‘కింగ్ఫిషర్’ బ్రాండ్ వేల్యూపై ఎస్ఎఫ్ఐవో దృష్టి | Image for the news result Kingfisher Airlines' brand valuation under SFIO scanner | Sakshi
Sakshi News home page

‘కింగ్ఫిషర్’ బ్రాండ్ వేల్యూపై ఎస్ఎఫ్ఐవో దృష్టి

Published Thu, Mar 17 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

‘కింగ్ఫిషర్’ బ్రాండ్ వేల్యూపై ఎస్ఎఫ్ఐవో దృష్టి

‘కింగ్ఫిషర్’ బ్రాండ్ వేల్యూపై ఎస్ఎఫ్ఐవో దృష్టి

న్యూఢిల్లీ: రుణాల ఎగవేత కేసులు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ వేల్యుయేషన్‌పై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) దృష్టి సారించింది. బ్రాండ్ విలువను ఉన్న దానికంటే అధికంగా .. రూ. 4,000 కోట్ల పైగా చేసి చూపారన్న ఆరోపణలపై విచారణ చేపట్టింది. బ్యాంకుల నుంచి మరింత రుణం తీసుకుని, ఎయిర్‌లైన్స్ కాకుండా ఇతర అవసరాలకు మళ్లించేందుకు మోసపూరితంగా విలువను ఎక్కువ చేసి చూపారా అన్న కోణంలోను, ఇందులో కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ పాత్రపైన ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు ప్రారంభించింది.

గోవాలో కేసినో లెసైన్సుకు ‘మాల్యా’ కంపెనీ దరఖాస్తు
కాగా విజయ్‌మాల్యా నియంత్రణలోని యూబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంస్థ.. గోవాలో కేసినో లెసైన్సు కోసం దరఖాస్తు చేసింది. 2013 నుంచి కేసినోల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను వెల్లడిస్తూ గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్.. అసెంబ్లీలో ఈ విషయాలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement