
ప్రతీకాత్మక చిత్రం
లండన్/సింగపూర్ : బ్యాంకులకు రూ . వేల కోట్ల రుణాల ఎగవేతకేసులో నిందితుడైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాలను అద్దెకు తీసుకున్న బీఓసీ ఏవియేషన్‌కు 90 మిలియన్ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ హైకోర్టు తేల్చిచెప్పడంతో మాల్యాకు న్యాయపోరాటంలో భంగపాటు తప్పలేదు. లీజింగ్ అగ్రిమెంట్ ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సింగపూర్‌కు చెందిన బీఓసీ ఏవియేషన్ మూడు విమానాలను సరఫరా చేసింది.
కాగా, లండన్ కోర్టు వెలువరించిన తీర్పును బీఓసీ ఏవియేషన్ స్వాగతించింది. మరోవైపు రుణ ఎగవేతకేసులో నిందితుడైన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment