legal battle
-
పోస్టల్ బ్యాలెట్లపై YSRCP న్యాయపోరాటం
-
YSRCP న్యాయ పోరాటం
-
ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠానికి చెందిన 25.36 ఎకరాలపై రక్షిత కౌలుదారులు మూడు దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసులు పెండింగ్‌లో ఉండగానే తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు చట్టబద్ధ వారసులుగా న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితం అందుకున్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారులకే విక్రయించేందుకు మఠం సంరక్షకునికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చి న తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. వేలంలో కాకుండా, మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు లేకుండా భూములను విక్రయించడానికి వీల్లేదన్న సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఆ భూముల విక్రయం ప్రతిపాదనను మఠాధిపతి సర్జుదాస్ 1979లోనే తీసుకొచ్చారని గుర్తు చేసింది. 1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులోనే ఉన్నాయని, వాటిని వారి నుంచి స్వాదీనం చేసుకోవడం న్యాయపరంగా చాలా కష్టమని భావించడం, వివాదాలకు ఆస్కారం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆ భూములను వారికే విక్రయించడం మేలని మఠం సంరక్షకుడు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇదీ నేపథ్యం: హథీరాంజీ మఠానికి తిరుపతిలోని సర్వే నంబర్లు 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునుస్వామి నాయుడు 1957 నుంచి రక్షిత కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. ఆ తరువాత వారికి మఠం మహంత్ శాశ్వత లీజు మంజూరు చేశారు. మహంత్ మరణం తరువాత 1966లో ఆ లీజు రద్దయింది. అయినా వారు లీజు డీడ్ల ద్వారా కొనసాగుతున్నారు. 1980లో అప్పటి మహంత్ సస్పెండ్ అయ్యారు. మఠానికి సంరక్షకుడు నియమితులయ్యారు. అనంతరం ఆ భూమిని కౌలుదారులకే విక్రయించాలని మఠం నిర్ణయించింది. దీనిపై వి.నాగమణి, డి.కుప్పుస్వామి నాయుడు మరికొందరు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రక్షిత కౌలుదారులకే భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 1990లో జీవో 751 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నాగమణి తదితరులు హైకోర్టులో అదే ఏడాది పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. జీవో 751ని రద్దు చేస్తూ 2002లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ తదితరులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అనంతరం చెంగమ్మ, ఆమె భర్త వెంకట్రామనాయుడు మరణించడంతో వారి పిల్లలు ఈ వ్యాజ్యంలో చట్టబద్ధ వారసులుగా చేరారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది. -
Parking Offer: రూ.60 కోసం సుదీర్ఘ పోరాటం!
వినియోగాదారుల హక్కుల ప్రాముఖ్యత, దాని కోసం నిలబడి పోరాడేలని చెప్పే అంశం దేశ రాజధాని ఢిల్లీలో తెరపైకి వచ్చింది. అదీకూడ ఒక చిన్న మొత్తం కోసం పోరాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినా.. మన హక్కులను గుర్తు చేయడమే గాక కొన్ని ఆఫర్లు మనల్నీ ఎలా నిలువు దోపిడి చేస్తున్నారో ప్రపంచానికి తెలిసేలా చేసింది ఈ ఘటన. వివరాల్లోకెళ్తే..కమల్ ఆనంద్ తన భార్యతో కలిసి సాకేత్‌లోని ఒక మాల్లో కోస్టా కాఫీ అవుట్‌లెట్‌కి వెళ్లారు. అవుట్లెట్ ఉద్యోగి వారికి ఒక ఆఫర్ ఇచ్చాడు. కాఫీ ఆర్డర్ చేస్తే పార్కింగ్ ఉచితం అని వారికి తెలియజేశాడు. దీంతో కమల్ రెండు కాఫీలు కొనుగోలు చేసి రూ.570 చెల్లించాడు. తదనంతరం అతను తన భార్యతో కలిసి పార్కింగ్ స్థలం నుంచి బయటకు రాగానే రూ. 60 చెల్లించమని పార్కింగ్ నిర్వాహకుడు అడిగాడు. అతను ఆఫర్ స్లిప్‌ను చూపించాడు. ఐతే అక్కడున్న వ్యక్తి ఆ ఆఫర్ గురించి ఎలాంటి సమాచారం లేదని పార్కింగ్‌కి డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఈ విషయమై కోస్టా కాఫీ నిర్వాహకులకు, మాల్ యజమానికి ఫిర్యాదు చేసినప్పటికీ..లాభం లేకుండా పోయింది. పైగా నిర్వాహకులు పార్కింగ్ డబ్బులు వసూలు చేశారు కూడా. దీంతో ఆనంద్ ఢిల్లీలోని వినయోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ సుమారు పదేళ్లు సాగింది. ఐతే విచారణ సమయంలో ఆనంద్ తన ఫిర్యాదుకు మద్దతుగా తగిన సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పించాడు. అయితే ఆనంద్ వాదనను ఎదుర్కోనేలా ప్రతివాది ఎటువంటి ఆధారాలను సమర్పించ లేకపోయాడు. దీంతో కోర్టు ఇది కేవలం రూ. 60కి సంబంధించినది కాదని వినియోగదారుల హక్కులకు వారు పొందాల్సి సౌకర్యాలకు సంబంధించిందని పేర్కొంది. కస్టమర్‌ను ఆఫర్‌తో ప్రలోభ పెట్టి ఆపై కస్టమర్ విపత్కర స్థితిలో చిక్కుకున్నప్పుడూ ఆ ఆఫర్ తిరస్కరించటం సర్వీస్‌లో నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంత చిన్న మొత్తం అయినా వెనుకడుగు వేయక జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డందుకు ఆనంద్‌ని కోర్టు ప్రశంసించింది. అంతేగాదు కోర్టు ఈ కేసులో నిందితులకు రూ.61,201 జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కమల్‌కి చెల్లించాలని స్పష్టం చేసింది. (చదవండి: 'ప్రేమలో పడండి' అంటూ విద్యార్థులకు సెలవులు మంజూరు) -
రూ.20 కోసం 22 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం!
మనలో చాలామంది ఏ చిన్న సమస్య వచ్చిన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడం. మనకు ఏదైనా పని అవ్వడమే ముఖ్యం. జేబు చమురు వదిలించుకుని మరీ పని జరిపించుకుంటాం గానీ. ఎందుకు డబ్బులివ్వాలి అనడగం. పోతే పోనీలే అని సర్దుకుపోతాం. ఇక్కడో వ్యక్తి అలా కాదు. టిక్కెట్ ధర కంటే అదనంగా రూ.20 ఎక్కువ తీసుకున్నాడంటూ కోర్టు మెట్లెక్కాడు. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ గెలిచాడు. ఏం జరిగిందంటే....మధురకు చెందిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తి తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్ ధర రూ.70 కాగా టిక్కెట్ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్ మాస్టర్ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం పై 15 శాతం వడ్డీని అదనంగా చెల్లించమని భారత రైల్వేకి స్పష్టం చేసింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కేసు వదిలేయమని చెప్పారని అన్నారు. ఒకానొక దశలో ఈ కేసును కొట్టేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నించారు. ఈ కేసులో వందకు పైగా విచారణలు జరిగిన తర్వాత న్యాయం గెలిచిందని తెలిపారు. అయితే ఈ పోరాటంలో తాను కోల్పోయిన సమయం, శక్తికి వెలకట్ట లేనివని అవేదనగా చెప్పారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా !
Elon Musk Jeff Bezo Rival: పోటీ ప్రపంచంలో పోటాపోటీ విమర్శలూ సహజమే. కానీ, అవి విపరీతానికి చేరితేనే వెగటు పుడుతుంది. బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ జెజోస్‌ల మధ్య మాటల వైరం రోజురోజుకీ శ్రుతి మించుతోంది. వీలు దొరికినప్పుడల్లా బెజోస్పై పరోక్షంగా విరుచుకుపడుతున్న మస్క్.. తాజాగా మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అవతలి నుంచి కూడా కౌంటర్ పడడం విశేషం. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్) న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్ఎక్స్ ప్రయోగాలను నెమ్మదించేలా చేస్తున్నాయని ఆరోపించాడు ఎలన్ మస్క్. 2021 కోడ్ కాన్ఫరెన్స్‌లో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడాయాన. ‘‘నీ తరపు లాయర్లు ఎంత గొప్పవాళ్లైనా కావొచ్చు. చంద్రుడి చేరాలనే మా ప్రయత్నాన్ని ఎన్ని దావాలేసినా ఆపలేరు. అంతరిక్ష యానం నీ అబ్బసొత్తు కాదు’’ అంటూ ఒకానొక దశలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మస్క్. ఇదిలా ఉంటే స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్ వరుసగా దావాలు వేస్తోందన్నది ఎలన్ మస్క్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అమెజాన్ కౌంటర్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అమెజాన్ నుంచి కౌంటర్ పడింది. ఎలన్ మస్క్ తాను బెజోస్ లాంటోడేనని గుర్తించ లేకపోతున్నాడంటూ సెటైర్ వేసింది. గతంలో స్పేస్ఎక్స్ వేసిన దావాలకు సంబంధించిన చిట్టాను బయటపెట్టింది అమెజాన్. ఈ మేరకు అమెరికన్ టెక్నాలజీ బ్లాగ్ ది వర్జ్‌కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించింది. స్పేస్ఎక్స్ ఇప్పటిదాకా వివిధ కోర్టుల్లో వేసిన 13 దావాలు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన స్టేట్మెంట్ల తాలుకా వివరాలను వెల్లడించింది. 2004 నుంచి అమెరికా ప్రభుత్వం, నాసా, యూఎస్ ఎయిర్ఫోర్స్లకు వ్యతిరేకంగా స్పేస్ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్లు ఇందులో ఉన్నాయి. This is hilarious. Amazon sent us a 13-page PDF to prove Elon Musk is as litigious as Jeff Bezos https://t.co/Kh10AehEgB via @Verge — Eric Berger (@SciGuySpace) September 29, 2021 అమెజాన్ శాటిలైట్ డివిజన్ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్‌కు వచ్చాయి. ‘‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన స్పేస్ఎక్స్.. గతంలో చేసింది ఇదే కదా. ఏకంగా ప్రభుత్వంపైనే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది’’ అని కుయిపర్ పేరు మీద స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. మొత్తం 39 డాక్యుమెంట్లు ఉండగా, వాటిని 13 పేజీల(పీడీఎఫ్ ఫైల్రూపంలో) కుదించి పంపించారు. SpaceX has sued to be *allowed* to compete, BO is suing to stop competition — Elon Musk (@elonmusk) September 29, 2021 సెటైర్ అయితే తమ దావాల వ్యవహారాన్ని స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ సమర్థించుకున్నాడు. ‘‘మేం పోటీప్రపంచంలోకి అనుమతించాలని స్పేస్ఎక్స్ తరపున దావాలు వేశాం. కానీ, బీవో(బ్లూఆరిజిన్ను ఉద్దేశించి) అసలు పోటీయే ఉండకూడదని దావాలు వేస్తోంది’’ అని వ్యంగ్యం ప్రదర్శించాడు. ఇక న్యాయపరమైన చర్యలతో బ్లూ ఆరిజిన్ కంపెనీ తనకు మోకాలు అడ్డుపెట్టడంపై ఎలన్ మస్క్ ఘాటుగానే స్పందిస్తున్నాడు. బహుశా తమపై కేసులు వేయడానికే బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటాడంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చాడు. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
మా కుమార్తె చనిపోయాక చేతిలో చిల్లిగవ్వ లేదు: నటి తల్లిదండ్రులు
బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రత్యూష తల్లిదండ్రులు రాహుల్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తె మరణం తర్వాత అన్నీ పొగొట్టుకున్నామని.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రత్యూష తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ రూమ్ ఉన్న ఇంటికి మారామని.. రోజు వారి జీవితం గడవడం కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మా కుమార్తె మరణం తర్వాత ఓ పెద్ద భయంకరమైన తుపాను వచ్చి.. మా సర్వస్వం లాక్కెళ్లింది. మా దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఈ కేసు పోరాటంలో భాగంగా మేం సర్వస్వం కోల్పోయాం. నేను చైల్డ్ కేర్ సెంటర్లో పని చేస్తుండగా.. నా భర్త కథలు రాస్తూ.. పొట్ట పోసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఒక్క గదిలో నివసిస్తున్నాం’’ అని ప్రత్యూష తల్లి తెలిపారు. ప్రత్యూష బెనర్జీ 2016 లో తన ముంబై అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణం వెనుక ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్, నటుడు రాహుల్ రాజ్ సింగ్ పాత్ర ఉందని ఆరోపించారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ మూడు నెలల్లో బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం రాహుల్, నటి సలోని శర్మను వివాహం చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను గతం నుంచి బయటపడాలని భావించాను. ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో అయ్యింది. ఇప్పటికి సంతోషం కోసం పోరాడుతున్నాను. ఈ పరిస్థితులన్నింటిని నేను తట్టుకుని నిలబడటానికి నా కుటుంబ సభ్యులు, భార్య మద్దతు ఎంతో ఉంది. వారు నా బాధను అర్థం చేసుకుని.. నాకు అండగా నిలబడ్డారు’’ అని తెలిపాడు. -
మాల్యాకు మరో షాక్
లండన్/సింగపూర్ : బ్యాంకులకు రూ . వేల కోట్ల రుణాల ఎగవేతకేసులో నిందితుడైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాలను అద్దెకు తీసుకున్న బీఓసీ ఏవియేషన్‌కు 90 మిలియన్ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ హైకోర్టు తేల్చిచెప్పడంతో మాల్యాకు న్యాయపోరాటంలో భంగపాటు తప్పలేదు. లీజింగ్ అగ్రిమెంట్ ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సింగపూర్‌కు చెందిన బీఓసీ ఏవియేషన్ మూడు విమానాలను సరఫరా చేసింది. కాగా, లండన్ కోర్టు వెలువరించిన తీర్పును బీఓసీ ఏవియేషన్ స్వాగతించింది. మరోవైపు రుణ ఎగవేతకేసులో నిందితుడైన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
కేసు గెలిచి, కోట్లు కాపాడుకున్న సౌదీ రాజు!
లండన్: దివంగత సౌదీ రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజీజ్ తన తండ్రి రహస్య భార్యకు నష్టపరిహారం చెల్లించే పరిస్థితి నుంచి బయటపడ్డారు. కొన్ని వందల కోట్ల రూపాయలను రాకుమారుడు తండ్రి మరణానంతరం ఆయన భార్యకు చెల్లించాలంటూ గత ఏడాది నవంబర్ లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫహద్ మరణానంతరం జనన్ హర్బ్ అనే ఆమె సౌదీ రాజు తనను రహస్యంగా వివాహమాడారని కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి ఆమెకు రూ. 154 కోట్లతో పాటు లండన్ లో రెండు ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై రాకుమారుడు అబ్దుల్ అజీజ్ పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జడ్జి ఆమె పట్ల పక్షపాతం వ్యవహరించారని వేరే జడ్జితో కేసు విచారణ జరిపించాలని కోరారు. విచారణ చేపట్టిన మరో జడ్జి ఆమెకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పారు. కాగా, బ్రిటీష్ జాతీయురాలైన హర్బ్ 1968లో ఫహద్ ను వివాహమాడినట్లు తెలిపారు. 1982లో రాజైన ఫహద్ 2005లో చనిపోయే ముందు తనను జీవితకాలం ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. 2003లో అజీజ్ తనకు రూ. 80 కోట్ల పరిహారంతో పాటు థేమ్స్ నది ఒడ్డున రెండు ఫ్లాట్లు ఇస్తానని వాగ్దానం చేసినట్లు తెలిపారు. -
5 పైసల కోసం... 40ఏళ్లుగా పోరాటం
న్యూఢిల్లీ : ఐదు పైసల కాయిన్ కనుమరుగై దాదాపు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఆ నాణెం ఎలా ఉంటది అని అడిగితే చాలా మందికి తెలియదు కూడా. కానీ 73 ఏళ్ల రణవీర్ సింగ్ యాదవ్ మాత్రం ఈ ఐదు పైసల నాణెంపై గత 40 ఏళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ వేసిన పిటిషన్ పై సుదీర్ఘంగా పోరాడుతున్నాడు. ఇందుకోసం అతడికి లక్షల్లో కోర్టు ఖర్చులు అయినా ఈ పోరాటం ఆగలేదు. అసలు ఐదు పైసల కాయిన్ ఏమిటి? దానిపై పోరాటం ఏమిటి? అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి ఈ స్టోరీని. రణవీర్ సింగ్ యాదవ్ 1973లో ఢిల్లీ ట్రాన్స్ పోర్టు(డీటీసీ) బస్ లో కండక్టర్ గా పని చేసేవాడు. ఆ బస్సులో ఓ మహిళ ప్రయాణికురాలు దగ్గర టిక్కెట్టు కింద 10 పైసలకు బదులు 15 పైసలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అదనంగా 5 పైసలు అతని జేబులోకి వచ్చాయని నిందను ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలతో చెకింగ్ స్టాప్ బస్సులోకి ఎక్కి యాదవ్ పై ఇంటర్నల్ విచారణ చేపట్టారు. దీంతో 1976 నుంచి అతను ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తున్నాడు. 1990లో కార్మికుల న్యాయస్థానంలో యాదవ్ ఈ కేసు గెలిచినప్పటికీ, మళ్లీ తర్వాత ఏడాదిలో ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అతనిపై కేసును తిరగదోడింది. ఇప్పటి వరకూ ఈ కేసుపై పోరాటానికి యాదవ్ చాలావరకూ ఖర్చు పెట్టాడు. "ఒకవేళ నేను తప్పుచేసి ఉంటే నా పిల్లలే నన్ను అడిగేవారు. నాకు ఇద్దరు కుమారులున్నారు. నేను తప్పు చేయలేదు కాబట్టి నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నాను'' అని యాదవ్ చెప్పారు. అయితే డీటీసీ వేసిన ఈ పిటిషన్ ను ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తోసిపుచ్చింది. యాదవ్ కు రూ.30వేలు నష్టపరిహారంగా రవాణా సంస్థ చెల్లించాలని తీర్పునిచ్చింది. అతని పారితోషికం రూ.1.28 లక్షలు, సీపీఎఫ్ రూ.1.37 లక్షలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ 5 పైసల రికవరీ కోసం ఇప్పటివరకూ ఎన్ని లక్షలు ఖర్చు చేశారని డీటీసీని కోర్టు ప్రశ్నించింది. 40 ఏళ్లుగా డీటీసీ ఆరోపణలపై అతను పోరాటం చేస్తున్నాడని, కార్మికుల న్యాయస్థానంలో, హైకోర్టులో అతను కేసును గెలిచినా.. తగిన ఫలితాన్ని అతనికి దక్కకుండా చేశారని డీటీసీపై కోర్టు మండిపడింది. అయితే ఈ పోరాటం ఇంకా పూర్తికాలేదు. మే 26న కార్కార్డోమా కోర్టులో యాదవ్ తుది విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసు 5 పైసలకు లేదా 2 పైసలకు సంబంధించినదైనా, తమకు వేసిన జరిమానా విధింపు లక్షలతో సమానమని యాదవ్ భార్య విమల తెలిపింది. -
'ఆమె తండ్రిగా గర్విస్తున్నా..'
ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తున్న నటి కంగనా రనౌత్ కు ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్ మద్దతిచ్చాడు. తన కూతురు చాలా ధైర్యంగల అమ్మాయి అని అన్నారు. ప్రతిదశను ఆమె ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుర్కుందని, తన కూతురును చూసి గర్వంగా ఉందని చెప్పారు. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికిగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిన సందర్భంగా ఆ అవార్డు కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తండ్రిని హృతిక్ రోషన్ వివాదం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. హృతిక్ తో తన కూతురు చేస్తున్న న్యాయపోరాటంలో తాను ప్రతిక్షణం తోడుగా ఉంటానని చెప్పారు. 'నా కూతురు సాధించిన విజయాలు, అభివృద్ధిపట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను. ఆమె ఎంతో ధైర్యంగా తన జీవితాన్ని ఎదుర్కొంది. ప్రతి న్యాయ పోరాటంలో నా కూతురుతో ఉన్నాను. ఇప్పటికీ ఉంటాను' అని చెప్పారు. -
'నన్ను వ్యభిచారిణి, సైకో అన్నా ఫరవాలేదు'
న్యూఢిల్లీ: 'ఒక మహిళ చురుకుగా ఉందనుకోండి, ఆమెను వ్యభిచారిణిగా భావిస్తారు. అదే మహిళ ఏదైనా రంగంలో విజయాలను సాధించిందనుకోండి, సైకో అని ముద్రవేస్తారు. ఈ రెండింటింటిలో నన్ను ఏదనుకున్నా ఫరవాలేదు. ఎందుకంటే నేను ఎవరికోసమో బతికేదాన్నికాదు నా కోసం, నాకు నచ్చినట్టు జీవించేదాన్ని' అంటూ హృతిక్ రోషన్ తో న్యాయపోరాటం చేస్తోన్న తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా స్పందించారు జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్. ఓ జాతీయ చానెల్ కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలె చెప్పుకొచ్చారామె. 'నా మైండ్ షార్ప్ గా ఉంటుంది. దుర్భలమైన శరీరం. ఇందుకు నేను గర్విస్తా. నాపై వచ్చే విమర్శలకు సక్సెస్ తోనే సమాధానమిస్తా. నేను సెల్ఫ్ ప్లీజర్ ని.. పీపుల్స్ ప్లీజర్ ను కాను. ఇక్కడ ఆడవాళ్లను ఇంకా ఒక వస్తువుగానే ట్రీట్ చేస్తుండటం దారుణం. ఒక అమ్మాయి చనిపోవాలనుకుంటే ఆత్మహత్యే అవసరంలేదు.. ఆమె సాధించే విజయాలు, ఎదురయ్యే విమర్శలే ఆమెను చంపగలవు. ఎవరికైనాసరే, చీకటి రోజులు తప్పవు. కానీ మళ్లీ మనవైన రోజులు వస్తాయని నా నమ్మకం' అని తనపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు కంగన. చిన్న గ్రామం నుంచి ఇప్పుడున్నస్ధాయికి చేరుకోవడంలో తన జీవన ప్రయాణం అత్యద్భుతంగా సాగిందని, తాను తనలాగే ఉంటాను తప్ప మరొకరిలా ఎన్నటికీ మారబోనని కంగనా చెప్పారు. హృతిక్ రోషన్ తో వివాదాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని బదులిచ్చారు. నిజానికి ఇలా పోరాడటం కష్టం. నేను వేసే ప్రతి అడుగులో ఆటంకాలున్నాయని తెలుసు. అయినాసరే, వెళుతోన్నది సరైనదారే కబట్టి ముందుకే వెళతానని పేర్కొన్నారు. నటుడు 'క్రిష్ 3' తర్వాత సన్నిహితులుగా మారిన హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లు ఇటీవల గొడవపడటం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం, విషయం న్యాయపోరాటం వరకు వచ్చిన సంగతి తెలిసిందే. -
సస్పెన్షన్‌పై న్యాయపోరాటం
హైకోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్ సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా న్యాయ పోరాటం ప్రారంభించారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ్యురాలిగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారన్నారు. అసెంబ్లీ బిజనెస్ రూల్స్‌కు విరుద్ధంగా తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఆయన అనుసరించిన విధానం రాజ్యాంగ విరుద్ధమని, తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం వల్ల తాను మార్చి 1 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. నా వాదన విన్పించే అవకాశమే ఇవ్వలేదు ‘గత ఏడాది డిసెంబర్ 17 నుంచి జరిగిన అసెంబ్లీ సెషన్లో జరిగిన అనేక చర్చలతో పాటు కాల్ మనీ సెక్స్ కుంభకోణంపై కూడా చర్చ జరిగింది. ఈ కేసులో నిందితులకు, అధికార పార్టీకి మధ్య ఉన్న అనుబంధంపై నేను పలు ప్రశ్నలు సంధించా. అయితే అధికార పార్టీ సభ్యులు నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే నా సస్పెన్షన్‌కు తీర్మానం చేయాలని వారికి సూచించారు. వారు తీర్మానం ప్రవేశపెట్టడం, దానిని స్పీకర్ ఆమోదించి నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ సస్పెన్షన్ కాపీని నాకు ఇవ్వలేదు. అసలు సస్పెన్షన్‌కు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు..’ అని రోజా వివరించారు. ‘నేను అసభ్య పదజాలం వాడానని, తద్వారా శాసనసభ గౌరవాన్ని దిగజార్చానని సస్పెన్షన్‌పై చర్చ సందర్భంగా చెప్పారు. నా వాదన వినిపించే అవకాశం మాత్రం ఇవ్వలేదు. అసెంబ్లీలో నా ప్రవర్తనపై అభ్యంతరం ఉంటే ఆ ఒక్క సెషన్‌కే సస్పెండ్ చేయాలి తప్ప, ఏడాది పాటు సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధం..’ అని రోజా తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ చర్యలు న్యాయసమీక్ష లోబడి ఉంటాయని తెలియజేస్తూ.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిన తన సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు. -
తెలుగు కోసం న్యాయపోరు
చెన్నై : విద్యా సంబంధ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు తమిళ రాష్ట్రంలోని తెలుగువారు న్యాయపోరాటానికి దిగక తప్పలేదు. మాతృభాషపై మమకారాన్ని కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. నిర్బంధ తమిళం ముసుగులో మైనారిటీ ప్రజల మనోభావాలను కాలరాస్తున్న పాలకుల్లో కనువిప్పు కలిగించేందుకు అవిశ్రాంతపోరు అనివార్యమైంది. తమిళనాడులో తమిళం ప్రధాన భాషకాగా ఇంగ్లిషు, హిందీ వంటి జాతీయ, అంతర్జాతీయ భాషలను మినహాయిస్తే 13 మైనారిటీ భాషలున్నాయి. రాష్ట్ర జనాభాలో తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ తదితర 13 లింగ్విస్టిక్ మైనారిటీ భాషలకు చెందినవారు 40 శాతం వరకు ఉన్నారు. దేశం మొత్తం మీద త్రిభాషా సంప్రదాయం కొనసాగుతుండగా తమ కు హిందీ భాష వద్దంటూ 1970 కాలం లో తమిళనాడులో పోరాటం చేశారు. హిందీ అక్షరాలు కనపడితేచాలు వాటిపై తారుపూశారు. చివరకు రైల్వేస్టేషన్లలోని హిందీ అక్షరాలకు సైతం తారుపూతలో మినహాయింపు ఇవ్వలేదు. తమిళుల ఉద్యమానికి దిగివచ్చిన కేంద్రం ద్విభాషా సంప్రదాయానికి ఆమోదముద్ర వేసింది. తమిళనాడులోని అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లిషు, తమిళం భాషలే పరిమితమయ్యాయి. అంతటితో శాంతించని తమిళ పాలకులు (డీఎంకే ప్రభుత్వం) రాష్ట్రంలోని మైనారిటీ భాషల వారిని దెబ్బతీసేందుకు 2006లో నిర్బంధ తమిళం చట్టం తెచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే మైనారిటీ విద్యార్దులపై బలవంతంగా తమిళ భాషను రుద్దడమే ఈ చట్టం అంతరార్థం. మరి తమ మాతృభాష మాటేమిటని ప్రశ్నించిన వారికి ‘ఔట్ ఆఫ్ సిలబస్’గా చదువుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది. ప్రభుత్వానికి పట్టని భాషలో చదువుకుంటే ఫలితం ఏమిటనే వాదన మైనారిటీ వర్గాల్లో బయలుదేరింది. మాతృభాషాభిమానుల హక్కులను కాపాడేందుకు అఖిల భారత తెలుగు సమాఖ్య, సమాజ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి 2006లోనే సంయుక్తంగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేయడంతో సుప్రీం కోర్టు కెళ్లారు. దురదృష్టవశాత్తు రెండు కోర్టుల్లోనూ కేసు వీగిపోవడంతో మైనారిటీ భాషల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్బంధ తమిళంపైనా నిర్లక్ష్యం.. మైనారిటీ ప్రజలను, వారి మాతృభాషను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నిర్బంధ తమిళ చట్టాన్ని అనుసరించి కాంపోటెంట్ అథారిటీని ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. తమిళ సబ్జెక్టును బోధించాల్సిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం ఇందులో ప్రధానమైంది. అయితే చట్టం చేసిన ప్రభుత్వం అథారిటీ ఏర్పాటును అటకెక్కించేసింది. తమిళ ఉపాధ్యాయులు ఖాళీలను భర్తీ చేయలేదు.రాష్ట్రంలో మొత్తం 1500 మైనారిటీ భాషల వారి పాఠశాలలు ఉండగా, వీటిల్లో 900 తెలుగు పాఠశాలలు, 300 ఉర్దూ పాఠశాలలు, ఇతర భాషలవి ఉన్నాయి. మచ్చుకు ఒక్క మైనారిటీ పాఠశాలలో సైతం తమిళ ఉపాధ్యాయ నియామకానికి ప్రభుత్వం అనుమతించలేదు. 2006 నాటి నిర్బంధ తమిళ చట్టం ప్రకారం 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసేవారు ఇతర పరీక్షలను తెలుగులో రాసినా తమిళం సబ్జెక్టు పరీక్షను విధిగా రాయాల్సి ఉంటుంది. తమిళ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం రాబోయే పదో తరగతి పరీక్షల్లో తమిళం సబ్జెక్టును విధిగా రాయాలనే నిబంధనను మాత్రం అమలుచేసేందుకు సిద్ధమైంది. ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద 30 వేల మంది మైనారిటీ విద్యార్థుల మెడపై నిర్బంధ తమిళ చట్టం అనే కత్తి వేలాడుతోంది. ఏఐటీఎఫ్ నేతృత్వంలో సాగుతున్న న్యాయపోరులో భాగంగా కోర్టుకు హాజరైన అధికారులు చట్టం అమలులో లోపాలు లేవని, తమిళ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా సాగిందని బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు క్వాలిఫైడ్ తమిళ ఉపాధ్యాయుల నియామకంపై పూర్తిస్థాయి ఆధారాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో తమిళులకు పెద్దపీట.. ఏపీలో తమిళ విద్యార్థులకు పెద్ద గౌరవమే దక్కుతోంది. చిత్తూరు జిల్లాలో 11,170 మంది తమిళ విద్యార్థులు చదువుకుంటున్నారు. 66 తమిళ పాఠశాలలు, 6 కాలేజీలున్నాయి. ఎస్వీ యూనివర్సిటీలో 20 పీజీ సీట్లతో తమిళ విభాగమే ఉంది. 2003లో కార్వేటినగరంలో తమిళ టీచింగ్ ట్రైనింగ్ కాలేజీ ఏర్పడింది. ఈ కాలేజీలో మొత్తం 50 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా నాన్ లోకల్ కోటా కింద తమిళనాడుకు 20 శాతం కేటాయించారు. మాతృభాషల కోసం మరో పోరు.. మాతృభాషను కాపాడుకునేందుకు కొంతకాలంగా పోరు సాగిస్తున్నట్లు అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్) అధ్యక్షులు, లింగ్విస్టిక్ మైనారిటీ ఫోరం చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 2012లో సీఎం జయలలితకు రాసిన ఉత్తరం ద్వారా ఒత్తిడికి గురైన ప్రభుత్వం అదే ఏడాది కాంపోటెంట్ అథారిటీని నియమించగా అనేక లోపాలు బయటపడ్డాయని తెలిపారు. 2013-14లో కోర్టుకు వెళ్లడంతో కేవలం 20 శాతం పాఠశాలల్లో తమిళ ఉపాధ్యాయులను నియమించిందని చెప్పారు. తమిళభాషను నేర్చుకునేందుకు మైనారిటీలు వ్యతిరేకంగా కాదని, అయితే మాతృభాషకు సైతం అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వివరించారు. 2006 నుంచి నిర్బంధ తమిళం చట్టం అమలుచేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు తమిళంపై పూర్తిస్థాయి పట్టు సాధిం చేవారని, ఈ పరిస్థితి లేనందున కోర్టు ద్వారా పోరు సలుపుతున్నట్లు చెప్పారు. 9వ తరగతి వరకు మైనారిటీ భాషలను చదువుకుని పదో తరగతిలో అకస్మాత్తుగా తమిళం రాయించడం ద్వారా 30వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కాలరాసినట్లు అవుతుందన్నారు. -
రైతుల పక్షాన న్యాయపోరాటం:వైఎస్ జగన్
కడప: పసుపు రైతులకు అండగా ఉంటామని, వారి పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వెళ్లిన జగన్‌ను అక్కడి పసుపు రైతులు కలిశారు. తమ బాధలు ఆయనకు చెప్పుకున్నారు. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పంట నష్టపోయినట్లు వారు తెలిపారు. కలుపుకు ముందు మందు పిచికారీ చేయడం వల్ల పసుపు పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు సరికదా, రెన్యువల్ కూడా కాలేదన్నారు. అన్నదాతలకు కొత్త రుణాలు ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు పంట బీమా కోల్పోయినట్లు జగన్ తెలిపారు. ఇదిలా ఉండగా, మైదుకూరులో వైఎస్ఆర్ సీపీ నేత దస్తగిరి కూతుర్నీ, అల్లుడినీ వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ** -
టిసిఎల్పి న్యాయపోరాటం
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(టిసిఎల్పి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో టిసిఎల్పి సమావేశం ముగిసింది. పోలవరం ఆర్డినెన్స్‌పై పోరాడాలని తీర్మానించారు. ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు చట్ట సభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలని నిర్ణయించారు. పోలవరం బోర్డులో తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఒక తీర్మానం ద్వారా ఖండించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు చురుగ్గా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. -
బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు. అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించిన తీరును సవాల్ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు మేకపాటి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.