హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(టిసిఎల్పి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో టిసిఎల్పి సమావేశం ముగిసింది. పోలవరం ఆర్డినెన్స్‌పై పోరాడాలని తీర్మానించారు. ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు చట్ట సభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలని నిర్ణయించారు. పోలవరం బోర్డులో తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఒక తీర్మానం ద్వారా ఖండించారు.
టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు చురుగ్గా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.
టిసిఎల్పి న్యాయపోరాటం
Published Wed, Jun 11 2014 4:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
Advertisement