
మేకపాటి రాజమోహన రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.
అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించిన తీరును సవాల్ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు మేకపాటి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.