'ఆమె తండ్రిగా గర్విస్తున్నా..' | I stand by her in all her legal battles: Kangana's father | Sakshi

'ఆమె తండ్రిగా గర్విస్తున్నా..'

May 5 2016 1:30 PM | Updated on Aug 16 2018 4:21 PM

'ఆమె తండ్రిగా గర్విస్తున్నా..' - Sakshi

'ఆమె తండ్రిగా గర్విస్తున్నా..'

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తున్న నటి కంగనా రనౌత్ కు ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్ మద్దతిచ్చాడు.

ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తున్న నటి కంగనా రనౌత్ కు ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్ మద్దతిచ్చాడు. తన కూతురు చాలా ధైర్యంగల అమ్మాయి అని అన్నారు. ప్రతిదశను ఆమె ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుర్కుందని, తన కూతురును చూసి గర్వంగా ఉందని చెప్పారు. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికిగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిన సందర్భంగా ఆ అవార్డు కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె తండ్రిని హృతిక్ రోషన్ వివాదం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. హృతిక్ తో తన కూతురు చేస్తున్న న్యాయపోరాటంలో తాను ప్రతిక్షణం తోడుగా ఉంటానని చెప్పారు. 'నా కూతురు సాధించిన విజయాలు, అభివృద్ధిపట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను. ఆమె ఎంతో ధైర్యంగా తన జీవితాన్ని ఎదుర్కొంది. ప్రతి న్యాయ పోరాటంలో నా కూతురుతో ఉన్నాను. ఇప్పటికీ ఉంటాను' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement