హృతిక్ రోషన్‌పై కంగనా ఫిర్యాదు | Kangana Ranaut lodges complaint against Hrithik Roshan for circulating her photos | Sakshi
Sakshi News home page

హృతిక్ రోషన్‌పై కంగనా ఫిర్యాదు

Published Fri, Apr 8 2016 3:37 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

హృతిక్ రోషన్‌పై కంగనా ఫిర్యాదు - Sakshi

హృతిక్ రోషన్‌పై కంగనా ఫిర్యాదు

ముంబై: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రౌనత్ మధ్య వివాదం ముదురుతోంది. పరస్పరం లీగల్ నోటీసులతో కోర్టుకెక్కిన ఈ వివాదం మరో మలుపు తిరిగింది. తన మాజీ ప్రియుడిపై 'క్వీన్' పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా తన వ్యక్తిగత ఈ-మెయిల్స్, ఫొటోలు బయటపెడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు ముంబై పోలీసు కమిషనర్ కు కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. తన క్లైంట్ కు సంబంధించిన వ్యక్తిగత ఈ-మెయిల్స్, ఫొటోలను ఆమె అనుమతి లేకుండా బయటపెట్టిన హృతిక్ రోషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ఈ ఏడాది ఆరంభంలో హృతిక్, కంగనా వివాదం మొదలైంది. హృతిక్ తన మాజీ ప్రియుడని కంగనా వెల్లడించడం, దాన్ని అతడు ట్విటర్ లో ఖండించడంతో వివాదం రాజుకుంది. తర్వాత ఇద్దరూ పరస్పరం లీగల్ నోటీసులు పంపుకున్నారు. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనబడడం లేదని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement