కోల్‌కతా : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మొండిబకాయిల అంశమై యునెటైడ్ బ్యాంక్ సీరియస్‌గా ఉంది. కేవలం కింగ్‌ఫిషర్ పైనే కాకుండా తమకు బకాయిలు చెల్లించాల్సిన అన్ని సంస్థలపై సీరియస్‌గా వ్యవహరిస్తామని యునెటైడ్ బ్యాంక్ ఎండీ పి.శ్రీనివాస్ తెలిపారు. ఎస్‌ఎంఈ, రిటైల్ విభాగాలపై యునెటైడ్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. కింగ్‌ఫిషర్‌ను యునెటైడ్ బ్యాంక్ ఇప్పటికే డీఫాల్టర్‌గా ప్రకటించడం తెలిసిందే.