కోల్‌కత్తా : భారత్ బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ హౌజ్ మరోసారి వేలానికి రాబోతుంది. రూ.82 కోట్ల రిజర్వు ధరతో దీని వేలం నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాపర్టీని వేలం వేయడం ఇది ఆరోసారి. డెట్ రికవరీ ట్రిబ్యునల్(కర్నాటక), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కింగ్‌ఫిషర్ హౌజ్(కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ముంబై ఆఫీసు) డిసెంబర్ 19న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలం వేయనున్నట్టు తెలిసింది.
ఆసక్తి ఉన్న బిడ్డర్లు ముందస్తుగా రూ.50 లక్షల ఇంక్రిమెంటల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగ, కింగ్‌ఫిషర్ హౌజ్‌కు చెందిన 9 వాహనాలను రూ.4,90,00 రిజర్వు ధరకు ఈ నెల 11న వేలం వేశారు. మే 31న నాడు నిర్వహించిన వేలంలో రిజర్వు ధరను రూ.93.50 కోట్లకు తగ్గించినప్పటికీ ఈ స్థిరాస్తిని కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. 2401.70 చదరపు మీటర్ల విస్తర్ణీంలో ఇది విస్తరించింది. గతేడాది మార్చిలో ఈ ప్రాపర్టీ తొలిసారి వేలానికి వచ్చింది. అప్పట్లో రిజర్వు ధర రూ.150కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment