బొగ్గు క్షేత్రాల 'ఈ ఆక్షన్' కు ఆర్డినెన్స్! | Government moves to issue Ordinance for e-auction of coal mines | Sakshi
Sakshi News home page

బొగ్గు క్షేత్రాల 'ఈ ఆక్షన్' కు ఆర్డినెన్స్!

Published Mon, Oct 20 2014 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

Government moves to issue Ordinance for e-auction of coal mines

న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్టినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేపడుతోంది. సుప్రీం కోర్టు రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల భూమిని కేంద్రం సేకరించనుంది. పీఎస్ యూ, రాష్ట్రాలకు ప్రత్యేక్షంగా భూకేటాయింపులు చేయడానికి ఈ-ఆక్షన్ నిర్వహించడానికి ఆర్డినెన్స్ తేవాలని కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 
 
1993 నుంచి చేసిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు లబ్ది చేకూరనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement