సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల వేలం హెచ్‌ఎండీఏకు కాసులుకు కురిపిస్తోంది. మోకిలలో ప్లాట్ల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది.
చివమోకిల హెచ్‌ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలంలో చివరి రోజు మొత్తానికి మొత్తం 60 ప్లాట్లు మంచి రేట్లతో అమ్ముడుపోయాయి. మోకిలలో చేస్తున్న భారీ వెంచర్‌లో ఫేజ్–1లో 50 ప్లాట్లు, ఫేజ్–2లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ వెంచర్ ప్లాట్లను ఆన్‌లైన్(ఈ–ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 346 ప్లాట్లకు మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది.
చదవండి: కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ!.. 29 స్థానాలకు 263 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment