పేదల భూములు లాక్కోవడం హేయం | poor lands grab not correct | Sakshi
Sakshi News home page

పేదల భూములు లాక్కోవడం హేయం

Published Thu, Aug 25 2016 7:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

పేదల భూములు లాక్కోవడం హేయం - Sakshi

పేదల భూములు లాక్కోవడం హేయం

మా పొట్టకొట్టకుండ్రి సారూ..
పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్‌ శ్రీనివాస్‌


శంకర్‌పల్లి: నిరుపేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కొవడం హేయమైన చర్య అని పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ అన్నారు.  ప్రభుత్వం మోకిల గ్రామంలోని సర్వే నెంబర్‌ 96, 197లో పేదలకు  కేటాయించిన లావణి పట్టా భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటోందని మోకిల గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ  చైర్మన్‌ కోదండరామ్‌కు ఫిర్యాదు చేశారు. కోదండరామ్‌ ఆదేశాల మేరకు పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ బృందం గురువారం మోకిల గ్రామాన్ని సందర్శించింది వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని మూడు నెలల క్రితం ఎకరం రూ.2 కోట్ల చొప్పున ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్ముకుందని, ఒక్కరూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. తమకు 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్‌ 96, సర్వే నెంబర్‌ 197లో సుమారు 700 ఎకరాలు లావణి భూమి కేటాయించి సర్టిఫికెట్లు కూడా జారీ చేసిందన్నారు. నాటి నుంచి నేటివరకు తామే ఆ భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడు ప్రభుత్వం అందులోని 27 ఎకరాలు వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మిందని రైతులు వాపోయారు. మరికొంత భూమి అమ్మెందుకు ప్రణాళిక తయారు చేస్తోందని విడతల వారిగా కొంతమందికి నోటీసులు జారీచేస్తోందని వారు ఆరోపించారు.

          ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని, తమ పొట్టకొట్టవద్దని రైతులు వేడుకుంటున్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పీఓటీ కింద ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఎన్నో సంవత్సరాలుగా కబ్జాలో, ఖారీజు ఖాతలో ఉన్నట్లు కంప్యూటర్‌ రికార్డులో నమోదు ఉందని, ఉన్నట్లుండి ప్రస్తుతం కంప్యూటర్‌లో వారి పేర్లు తీసేసి లావణి పట్టా, ఖారీజ్‌ ఖాత నిల్‌గా చూపిస్తోందని అన్నారు. అక్కడి నుంచి నేరుగా పంటపొలాలను జేఏసీ నాయకులు పరిశీలించి చైర్మన్‌ కోదండరామ్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. రైతులకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. త్వరలో తాను గ్రామానికి వస్తానని రైతులకు అన్యాయం జరగకుండా వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్‌ పట్టణ జేఏసీ చైర్మన్‌ కె.నర్సింలు, కన్వీనర్‌ రామరావుజోషి, మోకిల సర్పంచ్‌ అనందం, వైస్‌ఎంపీపీ శశిధర్‌రెడ్డి, నాయకులు మారుతి  వై.దాసు, అడివయ్య, ఖాదర్‌పాష, సిహెచ్‌.యాదయ్య, రాజునాయక్‌, పాపాయ్య, గోపాల్‌, నర్సింలు, చోక్లనాయక్‌, యేషయ్య, ఎండీ.జానీ, పాండు,  శ్రీశైలం, సదానందం, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు ఆశీర్వాదం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement