![Bandi Sanjay Reaction On Janwada Farm House Rave Party: Telangana](/styles/webp/s3/article_images/2024/10/28/bandi.jpg.webp?itok=xVg8JqmC)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాజీపడుతున్నట్లు జన్వాడ రేవ్ పార్టీ విషయంలో మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ ట్విట్టర్ టిల్లు బామ్మర్ది ఫామ్ హౌజ్‌లో రేవ్‌పార్టీ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని, ఆ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి కొనసాగుతోందని, లిక్కర్ పార్టీయే తప్ప రేవ్‌పార్టీ కాదని బుకా యించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్ పార్టీపై సుద్దపూస ఏమంటాడో వేచి చూస్తున్నట్లు తెలిపారు.
రేవ్‌పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని, విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే ప్రస్తావించినట్లు తెలిసిందని అన్నారు. ట్విట్టర్ టిల్లు, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి, ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చుతున్నారని, తద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి బహుమతి ఇస్తోందని పేర్కొన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీధోరణి ప్రదర్శిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. సీసీ ఫుటేజీ సహా ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, బడా నేతలతోసహా రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జన్వాడ పార్టీ వివరాలు బయటపెట్టాలి
గజ్వేల్: జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్‌పార్టీ వివరాలన్నీ బయట పెట్టాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment