జన్వాడ రేవ్‌ పార్టీ.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు | Minister Bandi Sanjay Sensational Comments On Janwada Rave Party | Sakshi
Sakshi News home page

జన్వాడ రేవ్‌ పార్టీ.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

Published Sun, Oct 27 2024 11:33 AM | Last Updated on Sun, Oct 27 2024 1:40 PM

Minister Bandi Sanjay Sensational Comments On Janwada Rave Party

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడలో రేవ్‌ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు పార్టీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఫామ్‌ హౌస్‌ సీసీ టీవీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.

జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరుగుతున్న రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాల డ్రగ్స్‌ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్‌ హౌస్‌లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి.

సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్‌ సిగ్గు చేటు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని’ డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement