
సాక్షి,హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జన్వాడ రాజ్ పాకాల ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. వాటిపై బీఆర్‌ఎస్ మానసిక దెబ్బ తీసేలా మా కుటుంబ సభ్యులపై కేసులు పెడుతోంది. జన్వాడలో నా బావమరిది విల్లా కాదు. ఇల్లు.
నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? గృహ ప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు. కొందరు రేవ్‌పార్టీ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అటు ప్రభుత్వం,మీడియా,సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? వృద్ధులు, చిన్న పిల్లలతో సహా కుటుంబం మొత్తం బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు’అని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment