హైదరాబాద్: పంటల బీమాపై రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని టి.కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ ఇచ్చిన రూ.90 కోట్ల బీమా మొత్తాన్ని పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో బీమా ప్రీమియంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. పంటల బీమా పథకం అవకతవకలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోదండరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.