'తెలంగాణ సీఎం స్పష్టత ఇవ్వాలి'
హైదరాబాద్: రైతు రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక ఇక నాగిరెడ్డి కమిటీ ఎందుకని కాంగ్రెస్ కిసాన్‌సెల్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించారు. పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సిడీపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
రైతులు ఒక పక్క తీవ్ర నష్టాలపాలు అవుతుంటే, మరోపక్క రుణాలు చెల్లించాలంటూ వారికి బ్యాంక్‌లు నోటీసులు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు.