సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమమే ప్రాధాన్యాంశంగా పనిచేయాలని కిసాన్ కాంగ్రెస్ సూచించింది. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన శని వారం గాంధీభవన్‌లో జరిగింది. గతంలో కాం గ్రెస్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఆర్మూర్ డిక్లరేషన్‌కు అదనంగా పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన రైతు సంక్షేమ, అభివృద్ధి అంశాలపై కిసాన్ కాంగ్రెస్ నేతలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నా రు.
కల్తీ విత్తనాల కట్టడికి రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం తేవాలని, మానవహక్కుల కమిష న్ తరహాలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతు సమన్వయ సమితుల స్థానం లో రైతు మిత్ర సంఘాలను పునరుద్ధరించాలని, సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేయాలని, భూరికార్డుల ప్రక్షాళనలో అవకతవకలను సరిదిద్దడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలను టీపీసీసీకి అందిస్తామని, వీటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా చర్యలు తీసుకుం టామని కిసాన్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment