రైతు ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు. కరువు మండలాల ప్రకటనలో శాస్త్రీయతను పాటించలేదని ఆయన మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలపై పున: సమీక్షించి కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.
పంట నష్టపరిహారం రైతులను మరింత అప్పుల పాలు చేసేలా ఉందని అన్నారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చిస్తామని కోదండ రెడ్డి తెలిపారు.