హైకమాండ్‌కు టీపీసీసీ సిఫారసు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించారని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ టీ పీసీసీ క్రమశిక్షణా సంఘం.. కాంగ్రెస్ అధిష్టానానికి సిఫారసు చేసింది. సోమవారం గాంధీభవన్‌లో క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన సభ్యులు పాల్వాయి వ్యవహారంపై చర్చించారు. షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ ఇంతవరకుపాల్వాయి వివరణ ఇవ్వలేదని, ఆయనను కాంగ్రెస్ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించి, ఏఐసీసీకి ఫిర్యాదు చేసింది.
పాల్వాయిని బహిష్కరించండి
Published Tue, May 20 2014 5:58 AM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM
Advertisement
Advertisement