'ఆ రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలే' | Two state govts are against to farmers, says Telangana leaders | Sakshi
Sakshi News home page

'ఆ రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలే'

Published Thu, Apr 16 2015 2:41 PM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

Two state govts are against to farmers, says Telangana leaders

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కేసీఆర్ సర్కార్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోదండరెడ్డిలు మండిపడ్డారు. నరేంద్ర మోదీ సర్కార్తో కేసీఆర్ సర్కార్ కుమ్మక్కైందని వారు దుయ్యబట్టారు. రైతు సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్రాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాలు రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలేనని చెప్పారు. తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా కేంద్రానికి కేసీఆర్ నివేదిక ఇవ్వలేదన్నారు. కరవుకు తోడు అకాల వర్షాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. హెక్టార్కు రూ. 20వేల పరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే 500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ పన్నులు ఏర్పాటు చేయాలన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్తో వ్యతిరేకత వస్తుందనే వెంకయ్యనాయుడు, ఇతర మంత్రులు పరామర్శించారని విమర్శించారు. బియ్యం లెవీని 75శాతం నుంచి 25 శాతం తగ్గించడం సరికాదన్నారు. ఇది ముమ్మూటికీ రైతు వ్యతిరేక చర్యేనని షబ్బీర్ అలీ, పొంగులేటి, కోదండరెడ్డిలు ధ్వజమెత్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement