
సాక్షి, కామారెడ్డి జిల్లా: మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్‌ప్లాన్ అని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. ప్రజల అభ్యంతరాలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలన్నారు.
కాగా, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాకు దిగారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు.
చదవండి: కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment