సాక్షి, కామారెడ్డి: ప్రధాని మోదీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్ మున్సిపల్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, పబ్లిక్ పార్క్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. స్పీకర్ శ్రీనివాసరెడ్డికి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని నడిపిన మంత్రి కేటీఆర్.. స్పీకర్‌ని వాహనంలో ఎక్కించుకొని ప్రారంభోత్సవాలకు వెళ్లారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ అంటూ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మేమే బస్సు పెట్టి తీసుకెళతామని బాన్సువాడ జుక్కల్ ఎక్కడికైనా వచ్చి కరెంటు తీగలు పట్టుకొని కరెంటు ఉందో లేదో చూడాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి ఇస్తారని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు.
ఓటుకు నోటు దొంగ చిల్లర వ్యక్తి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీటుకు నోటు 25 కోట్లకు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటున్నాడని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో కూడా వాళ్ల తాతకు మించి ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు.. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అంటూ విమర్శించారు..
ప్రధాని మోదీతో తెలంగాణకు ఒరిగింది శూన్యం. మోదీ జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.. ప్రధాని పసుపు బోర్డు అనుకుంటూ వస్తున్నారు.. గ్రహించాలని కోరారు..
కేటీఆర్ సీఎం కావాలంటే ప్రధాని అనుమతి అవసరమే లేదు: స్పీకర్ పోచారం
మరో వైపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ ఢిల్లీ నుంచి వచ్చి గల్లీ లీడర్‌లా మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రధాని అనుమతి అవసరమే లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్‌లు కూడా రావన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్ రూంలు, కేసీఆర్ కిట్‌లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ స్పీకర్ ఛాలెంజ్ చేశారు.
చదవండి: TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment