kamma reddy
-
అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, కామారెడ్డి: ప్రధాని మోదీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్ మున్సిపల్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, పబ్లిక్ పార్క్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. స్పీకర్ శ్రీనివాసరెడ్డికి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని నడిపిన మంత్రి కేటీఆర్.. స్పీకర్‌ని వాహనంలో ఎక్కించుకొని ప్రారంభోత్సవాలకు వెళ్లారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ అంటూ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మేమే బస్సు పెట్టి తీసుకెళతామని బాన్సువాడ జుక్కల్ ఎక్కడికైనా వచ్చి కరెంటు తీగలు పట్టుకొని కరెంటు ఉందో లేదో చూడాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి ఇస్తారని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని కోరారు. ఓటుకు నోటు దొంగ చిల్లర వ్యక్తి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీటుకు నోటు 25 కోట్లకు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటున్నాడని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా వాళ్ల తాతకు మించి ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు.. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ విమర్శించారు.. ప్రధాని మోదీతో తెలంగాణకు ఒరిగింది శూన్యం. మోదీ జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.. ప్రధాని పసుపు బోర్డు అనుకుంటూ వస్తున్నారు.. గ్రహించాలని కోరారు.. కేటీఆర్ సీఎం కావాలంటే ప్రధాని అనుమతి అవసరమే లేదు: స్పీకర్ పోచారం మరో వైపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ ఢిల్లీ నుంచి వచ్చి గల్లీ లీడర్లా మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రధాని అనుమతి అవసరమే లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్ రూంలు, కేసీఆర్ కిట్లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ స్పీకర్ ఛాలెంజ్ చేశారు. చదవండి: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ -
KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్‌ప్లాన్ అని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. ప్రజల అభ్యంతరాలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలన్నారు. కాగా, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాకు దిగారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. చదవండి: కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్! -
మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..
సాక్షి, కామారెడ్డి: అపరిచిత మహిళల ఫోన్ కాల్స్ విషయంలో కొందరు చేస్తున్న ‘తప్పు’టడుగులు వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముందువెన కా ఆలోచించకుండా అపరిచిత మహిళలతో జరిపే సంభాషణలు దారితప్పి వారి మెడకే చుట్టుకుంటున్నాయి. కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు వలపు వలలో పడి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో.. తెలిసీ తప్పు చేశామని తరువాత బాధపడుతున్నారు. విషయం ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కితే పరువు ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో మనోవ్యధకు గురవుతున్నారు. భిక్క నూరులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వలపు వలలో పడిన విషయంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఘటనలను పలువురు ‘సాక్షి’కి వివరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కూడా వలపు వలలో పడి ఇబ్బందులపాలయ్యాడు. చాలా డబ్బు లు పోగొట్టుకున్నానని బాధితుడు ‘సాక్షి’కి వివరించాడు. ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా ఓ తల్లీకూతురు వలపు వలలో చిక్కి ఆర్థికంగా చితికిపోయాడు. వీడియోకాల్స్‌తో తల్లీ కూ తురు న్యూడ్‌గా లైవ్‌లో కనబడడం, దానికి సదరు వ్యక్తి కూడా న్యూడ్‌గా మారి వాళ్లు ఆన్లైన్లో డబ్బు లు పంపమని కోరినపుడల్లా పంపాల్సి వచ్చింది. వేల రూపాయలు వారికి చెల్లించాడు. అప్పట్లో కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్‌లో నివసించే ఓ గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి మాయలేడీల వలలో పడి ఇబ్బందులు పడిన విషయం ‘సాక్షి’ పాఠకులకు విధితమే. వీడియోకాల్‌తో కైపెక్కిస్తున్నారు.. వారం, పది రోజులు మాట్లాడిన మాయలేడీలు ఓ సారి వీడియోకాల్ చేయండి సార్ అంటారు. ఇంకేముంది మనోడు ఆ మాయలో పడి వీడియో కాల్ చేయడం, ఆమెను చూసి చొంగచార్చుకోవడం జరుగుతోంది. రోజూ ఒకటి, రెండు సార్లు వీడియో కాల్ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు. భార్య, సెక్స్ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుతూ ‘నేను నచ్చా నా’ అంటూ మొదలవుతుంది. వీడియో కాల్లో ఉండగానే న్యూడ్‌గా మారుతున్నారు. దీంతో మగవాళ్లు కూడా ఆ మత్తులో న్యూడ్ అవుతున్నారు. ఎంతోమంది బాధితులు.. మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నమ్మించే మాటలతో, కైపెక్కించే వలపులతో వలలో వేసుకుని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో చాలామంది ఇలా మోసపోతూనే ఉన్నారు. కొందరైతే తెలిసి మరీ మోసపోతున్నారు. అయితే తమకు జరిగిన ఇబ్బందిని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు. మాయలేడీల వలలో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తియ్యటి మాటలతో స్నేహం అపరిచిత మహిళలు ఫోన్ చేసి ‘సార్’ అంటూ తియ్యగా మాట్లాడతారు. ఎవరు అని ప్రశ్నిస్తే మేం వేరే వాళ్లకు కాల్ చేశామని, పొరపాటున మీ కు వచ్చిందంటూ సారీ చెబుతారు. పరవాలేదని అంటే చాలు ‘మీ పేరు, మీ ఊరు సార్, ఏం చేస్తారు సార్’ అంటూ మాటలు కలుపుతారు. ఆడగొంతు, ఆపై తియ్యగా మాట్లాడడంతో సహజంగా మగవాళ్లు వాళ్లతో మాట కలపడం, ఇదే అదనుగా అపరిచిత మహిళ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. రోజూ కాల్ చేసి ఏదో మాట్లాడుతూ టైంపాస్ చేయడం ద్వారా, ఆమె ఫోన్ కోసం ఎదురుచూసే పరిస్థితిని తీసుకువస్తున్నారు. వీడియో కాల్ రికార్డులు పంపి బ్లాక్ మెయిలింగ్.. పది, పదిహేను రోజులుగా ఫోన్‌కాల్ ఆ తరు వాత వీడియో కాల్స్ ద్వారా దగ్గరైన మహిళలు న్యూడ్ వీడియోలను రికార్డు చేసి, వాటిని వాట్సాప్‌కు పంపుతున్నారు. ఆ వీడియోలను చూసి మనోళ్లు షాక్ అవ్వాల్సిందే. వీడియో క్లిప్పింగులు పంపి, డబ్బులు డిమాండ్ చేస్తున్నా రు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీ డియాలో వైరల్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. కొందరు బతిమాలుకుని ఎంతో కొంత డబ్బు అప్పగించి క్లోజ్ చేసుకుంటుండగా, డబ్బులు ఇవ్వని వారిని మానసికంగా వేధిస్తున్నారు. -
81 శాతం మందికి కరోనా సోకినట్లు..
సాక్షి, కామారెడ్డి: కరోనా వైరస్‌కు తోడు సీజన్ వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరోనా నియంత్రణ చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో సమస్యలు తెలుసుకోవడానికి సమీక్షలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రపంచంలో భగవంతుని తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది వైద్యుడు మాత్రమేనన్నారు. ‘‘కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అప్రమత్తమైంది. కరోనా ప్రభావం ఎలా ఉంటుందో డబ్ల్యూ హెచ్ ఓ, ఐసీఎంఆర్‌కు కూడా తెలియలేదు. కానీ వారిచ్చిన సలహాలను పాటించాం. 81 శాతం మందికి కూడా ఈ వైరస్ సోకినట్టు కూడా తెలియదు. ఈ వైరస్ బారిన పడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు మించదు. తీవ్రత ఉండి ఆసుపత్రికి వెళ్లినప్పుడే ఖర్చవుతుందని’’ మంత్రి పేర్కొన్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ఆలస్యమయిందని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచామని తెలిపారు. లక్షణాలు లేని వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. హోం ఐసోలేషన్‌కు పంపే ముందు ఇంటిలో ఉన్న వారి వివరాలను సేకరించాలని సూచించారు. ‘‘కరోనా లక్షణాలున్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలించాలి. అనస్థీషియా డాక్టర్లు ఎవరైనా ఉంటే వెంటనే ఏర్పాటు చేసుకోండి. అవసరం ఉన్న చోట ఆక్సిజన్, వెంటిలేటర్ వసతి కల్పిస్తాం. వైద్యులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని’’ మంత్రి తెలిపారు. 31వ తేదీ లోపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బాధితులకు ధైర్యం చెప్పకుండా కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదన్నారు. కరోనా విపత్తు సమయంలో మరణించిన వ్యక్తిని కుటుంబ సభ్యులు కూడా ముట్టకునే పరిస్థితి లేదు. కానీ వైద్యులు, మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేస్తున్నారు. వైద్యులను అభినందించాల్సి పోయి హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మంత్రి రాజేందర్ దుయ్యబట్టారు. -
52 కేజీల గంజాయి పట్టివేత
కామారెడ్డి: జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తోన్న మోహన్ రావు, శంకర్రావు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 52 కేజీల గంజాయి, తూపాను వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ ప్రసన్న రాణి విలేకరుల సమావేశంలో తెలిపారు. -
కామారెడ్డిలో ఏసీబీ వల
కామారెడ్డి/దేవునిపల్లి, న్యూస్‌లైన్: కామారెడ్డిలో రెవెన్యూ సర్వే, రికార్డు ల ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న జి.వెంకటేశ్వ ర్లు ఏసీబీ అధికారులకు చిక్కడం ఈ ప్రాం తంలో కలకలం రేపింది. దోమకొండకు చెం దిన సామల శంకర్ నుంచి మంగళవారం రూ. 20 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నా రు. సామల శంకర్‌కు భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి సర్వే చేయడం కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీవో కార్యాలయం నుంచి సర్వే కోసం ఆదేశాలు జారీ అయినా.. భూమి ని సర్వే చేయకుండా ఏడాది కాలంగా వెంకటేశ్వర్లు వేధిస్తున్నాడు. చివరికి రూ. 50 వేలు ఇస్తేనే సర్వే రిపోర్టు ఇస్తానని స్పష్టం చేయడంతో శంకర్ రూ. 10 వేలు ముందు ముట్టజెప్పాడు. మరో విడతగా రూ. 20 వేలు తీసుకుంటున్న వెంకటేశ్వర్లును ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని సర్వే కార్యాలయంలో దాడి చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా సామల శంకర్ గతంలోనూ దోమకొండ పంచాయతీ ఇన్చార్జి ఈవోగా పనిచేసిన భిక్కనూరు ఈవో శంకరయ్యను ఏసీబీ అధికారులకు పట్టించారు. తన ఇంటివద్ద మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకును కూల్చివేస్తామని పంచాయతీ అధికారులు వేధింపులకు గురిచేయడంతో శంకరయ్యకు రూ. 5 వేలు ఇచ్చి ఏసీబీకి పట్టించారు. ఇదిలా ఉండగా కామారెడ్డిలో 2010లో సర్వే ఇన్స్పెక్టర్గా పని చేసిన పోచయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. ప్రజలు సమాచారం ఇవ్వాలి : ఏసీబీ డీఎస్పీ లంచాల కోసం వేధించే అధికారుల సమాచారం అందిస్తే పట్టుకుంటామని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ చేస్తే చాలు తానే నేరుగా బాధితుల వద్దకు వస్తానన్నారు. కామారెడ్డి ప్రాంతంలో అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. బాధితులకు లంచం కింద ఇచ్చే డబ్బును తిరిగి ఇప్పిస్తా మన్నారు. అదేవిధంగా ఏ పనికోసం లంచం ఇచ్చారో ఆ పనిని త్వరగా పూర్తిచేయిస్తామన్నారు.