కామారెడ్డి/దేవునిపల్లి, న్యూస్‌లైన్: కామారెడ్డిలో రెవెన్యూ సర్వే, రికార్డు ల ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న జి.వెంకటేశ్వ ర్లు ఏసీబీ అధికారులకు చిక్కడం ఈ ప్రాం తంలో కలకలం రేపింది. దోమకొండకు చెం దిన సామల శంకర్ నుంచి మంగళవారం రూ. 20 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నా రు. సామల శంకర్‌కు భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి సర్వే చేయడం కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీవో కార్యాలయం నుంచి సర్వే కోసం ఆదేశాలు జారీ అయినా.. భూమి ని సర్వే చేయకుండా ఏడాది కాలంగా వెంకటేశ్వర్లు వేధిస్తున్నాడు. చివరికి రూ. 50 వేలు ఇస్తేనే సర్వే రిపోర్టు ఇస్తానని స్పష్టం చేయడంతో శంకర్ రూ. 10 వేలు ముందు ముట్టజెప్పాడు. మరో విడతగా రూ. 20 వేలు తీసుకుంటున్న వెంకటేశ్వర్లును ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని సర్వే కార్యాలయంలో దాడి చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా సామల శంకర్ గతంలోనూ దోమకొండ పంచాయతీ ఇన్‌చార్జి ఈవోగా పనిచేసిన భిక్కనూరు ఈవో శంకరయ్యను ఏసీబీ అధికారులకు పట్టించారు. తన ఇంటివద్ద మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకును కూల్చివేస్తామని పంచాయతీ అధికారులు వేధింపులకు గురిచేయడంతో శంకరయ్యకు రూ. 5 వేలు ఇచ్చి ఏసీబీకి పట్టించారు. ఇదిలా ఉండగా కామారెడ్డిలో 2010లో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన పోచయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు.
ప్రజలు సమాచారం ఇవ్వాలి : ఏసీబీ డీఎస్పీ
లంచాల కోసం వేధించే అధికారుల సమాచారం అందిస్తే పట్టుకుంటామని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ చేస్తే చాలు తానే నేరుగా బాధితుల వద్దకు వస్తానన్నారు. కామారెడ్డి ప్రాంతంలో అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. బాధితులకు లంచం కింద ఇచ్చే డబ్బును తిరిగి ఇప్పిస్తా మన్నారు. అదేవిధంగా ఏ పనికోసం లంచం ఇచ్చారో ఆ పనిని త్వరగా పూర్తిచేయిస్తామన్నారు.
కామారెడ్డిలో ఏసీబీ వల
Published Wed, Jan 8 2014 3:13 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement