master plan issue
-
జగిత్యాలలో టెన్షన్ టెన్షన్
-
జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం
సాక్షి, జగిత్యాల: మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్భందనానికి గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాలలో నలువైపులా రహదారుల దిగ్బంధం చేయనున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలకు రైతుల ప్రణాళికలు సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ వద్దంటూ రైతులకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తమ గ్రామాన్ని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మాన ప్రతిని జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌కు ప్రజలు అందజేశారు. తిమ్మాపూర్ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై నిరసనలు ఉదృతం చేసేందుకు రైతు జేఏసీ ఏర్పాటుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. జగిత్యాల బల్దియా జారీ చేసిన ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై బుధవా రం కూడా ఆందోళనలు కొనసాగాయి. జగిత్యా ల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ రైతులు పంచాయతీ కార్యాలయం ఎదుట సమావేశమై ఆందోళన నిర్వహించారు. మరోవైపు.. మోతె, ధరూర్, తిప్పన్నపేట, నర్సింగాపూర్, హస్నాబాద్, అంబారిపేట, తిమ్మాపూర్ గ్రామాలను మాస్టర్‌ప్లాన్ నుంచి తొలగించాలని కోరుతూ మోతె సర్పంచ్ భర్త సురకంటి రాజేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేశారు. -
కామారెడ్డి రైతుల సంచలన నిర్ణయం.. వారు రాజీనామా చేయాలని హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్ రద్దుపై పాత రాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, రైతుల సమావేశంలో ఎల్లుండి(గురువారం) సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకు గడువు ఇచ్చారు. 19న విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని హెచ్చరించారు. 20వ తేదీన ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. మున్సిపల్ తీర్మానం చేయించి మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యాచరణ కమిటీకీ రాజీనామా పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి రామేశ్వరపల్లికి చెందిన బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. నిర్మల్‌లో పాత రోడ్లనే బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మాస్టర్ ప్లాన్ లీడర్ల కొంప ముంచుతుందా? ఆ నేతకు టికెట్ కష్టమేనా?
రెండు నెలల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రకటించినప్పటినుంచీ పట్టణం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉంది. ఈనెల 4వ తేదీన అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్యతో... రైతుల నిరసనల పర్వం కాస్తా ఉద్రిక్తంగా కూడా మారింది. రైతుల ధర్నాలు, ఆందోళనలకు బీజేపి, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం ప్రకటించడమే గాకుండా..వెనుకుండి నడిపించడంలో తమ పార్టీల ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది వాస్తవం. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడి పోయిందనే ప్రచారం ఊపందుకుంది. రైతు ధర్నాల్లో స్వయానా షబ్బీర్ అలీ.. కోదండరెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి వంటివారితో కలిసి పాల్గొన్నా.. సంఘీభావం ప్రకటించినా... బీజేపీకి వచ్చిన మైలేజ్ ను మాత్రం కాంగ్రెస్ పార్టీ పొందలేకపోయిందన్న ప్రచారం కామారెడ్డిలో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో కామారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న షబ్బీర్ అలీకి ఈ పరిణామాలు కొంత నిరాశాజనకమే అనే చర్చ నడుస్తోంది. కమలం రూటు కరెక్టేనా? మరోవైపు మాస్టర్ ప్లాన్ అంశాన్నే కమలం పార్టీ భుజానికెత్తుకుని సక్సెస్ అయిందనే టాక్ కామారెడ్డిలో నడుస్తోంది. బీజేపి కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి రైతుల ఇష్యూను సజీవంగా ఉంచుతూ... వారి వెనుకుండి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మాట ఆందోళనల సమయంలో పలుమార్లు పోలీసుల నోటే వినిపించడం విశేషం. రమణారెడ్డి.. రైతు ఐక్య కార్యాచరణ మీటింగ్స్ కు ప్రతీసారీ హాజరుకావడం.. రైతుల పక్షాన మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ...అన్నీ తానై నడిపించడంతో..రమణారెడ్డి రాజకీయం ముందు కాంగ్రెస్ తేలిపోయిందనే వాదన బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న రమణారెడ్డి..రైతుల భూముల వ్యవహారాన్ని తన సొంత అజెండాగా చేసుకుని.. గిరి గీసి బరిలోకి దిగడంతో బీజేపీకి మైలేజ్ ఎక్కువే వచ్చిందన్నది కాషాయ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కామారెడ్డి తీసుకువచ్చిన రైతుల ఆందోళనకు మద్దతు తెలియచేయడంతో.. రాజకీయంగా బీజేపీ పేరే ఎక్కువ వినిపించేలా చేసుకోగల్గారు. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా వస్తారని ప్రచారం జరిగినా... ఆయన రాకపోవడంతో షబ్బీర్ అలీపై అనుమానాలకు ఆయనే తెర లేపినట్టైంది. షబ్బీర్‌కు సంబంధించిన భూములు కూడా కామారెడ్డి చుట్టుపక్కల చాలా ఉండటంతో.. ఈ వివాదంలో ఎక్కువ తలదూర్చొద్దనే భావనతోనే రేవంత్ ను రాకుండా అడ్డుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుకు ఎందుకు సంకటం? కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారాన్ని అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మలచడంలో కమలం పార్టీ సక్సెస్ అయిందనే టాక్ నడుస్తోంది. అదే సమయంలో ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫెయిల్ అయ్యారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. స్థానిక ప్రజలు మాస్టర్ ప్లాన్ విషయంలో అధికార, ప్రతిపక్షాల వైఖరిపై చర్చించుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అవసరమైతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం : రైతు జేఏసీ
-
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్
-
మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి కలెక్టర్ వివరణ
-
Kamareddy: మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళన.. కలెక్టర్ ఏమన్నారంటే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటాని తెలిపారు. అలాగే కొత్త మాస్టర్ ప్లాన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతులు నిరసన విరమించారు. కలెక్టర్ దిష్టిబొమ్మను రైతులు దగ్దం చేశారు. కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డి బంద్‌కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కాగా అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హెటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ ముందు టెంట్ వేసి రైతులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించి., బృందాలుగా లోపలికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కోరినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రావాల్సిందేనని పట్టుబట్టారు. కాగా కామారెడ్డి బల్దియాలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రీయల్ జోన్ కింద చూపడం, అవసరం లేని చోట్ల 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతులు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అయితే మాస్టర్ ప్లాన్‌లో భూమి పోతుందని మనస్తాపంతో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. చదవండి: KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్ -
KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్‌ప్లాన్ అని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. ప్రజల అభ్యంతరాలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలన్నారు. కాగా, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాకు దిగారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. చదవండి: కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్! -
కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని!
సాక్షి, మల్యాల(చొప్పదండి): కొండగట్టుపై వెలిసిన అంజన్నను దర్శించుకుంటే శని వదిలి అంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అయితే భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని మూడేళ్లుగా వీడడం లేదు. సీఎం వస్తే తప్పా పరిస్థితిలో మార్పు రాదనే భావన భక్తుల్లో నెలకొంది. కొండగట్టు పుణ్యక్షేత్రం మాస్టర్‌ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. నివేదిక రూపొందించి దేవాదాయ శాఖకు సమర్పించి మూడేళ్లు గడుస్తున్నా..నేటికీ మాస్టర్‌ప్లాన్ అమలు ఊసే లేదు. కొండగట్టు పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్ వస్తేనైనా మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకుంటుందనే ఆశతో భక్తులు ఎదురుచూస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో రోప్ నిర్మాణం ప్రతిపాదనలు చేసి, ఐదేళ్లయినా అతీగతీలేదు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. కొండగట్టులో భక్తులసంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఏటా వేలాది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ అమలెప్పుడో? భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం ముందుకు సాగడం లేదు. కొండగట్టు ఆలయ పరిధిలో ప్రభుత్వ భూమి 333 ఎకరాలు ఉంది. వీటిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మూడేళ్లు గడుస్తున్నా మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. కాగితాలకే పరిమితమైంది. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే.. కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే, భక్తులకు మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. భక్తులుకోసం 100 గదుల వసతి గృహం, మెట్లదారి వెంట రూఫ్ వేయనున్నారు. రోప్ వే నిర్మాణం, ఆలయ రెండో ప్రాకారం నిర్మాణం, కొండగట్టు దిగువన ఆర్చి గేటు నిర్మాణం, నిత్యాన్నదాన సత్రం భవనం, అభిషేక మండపం, సంతోల్లలొద్ది నుంచి గుట్టపైకి నీటిసరఫరా పైపులైన్, రెండస్తుల దీక్ష విరమణ భవనం, పార్కింగ్ స్థలం అభివృద్ధి, రెండు డార్మిటరీ హాళ్ల నిర్మాణం, యాత్రికులకోసం 500 గదుల భవనం, వీఐపీలకోసం 50 ఏసీ సూట్స్ నిర్మాణం, రెండు ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటు, దేవాలయం ఆవరణలో క్యూలైన్ల కంపార్ట్మెంట్ నిర్మాణం చేయనున్నారు. సీఎంకోసం ఎదురుచూపులు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటూ మూడేళ్లు గడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం ఆలయాలకు వచ్చినప్పటికీ, కొండగట్టుకు మాత్రం సీఎం రాకపోవడంపై భక్తులు నిరాశలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కొండగట్టుకు వస్తారంటూ చెబుతున్నా, నేటికీ నెరవేరడం లేదు. మాస్టర్ ప్లాన్ నివేదిక అందజేశాం కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన నివేదిక దేవాదాయశాఖకు అందజేసినం. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే ఏటా పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతిగృహం, పార్కింగ్ స్థలం, మెట్లదారిలో రూఫ్ అందుబాటులోకి వస్తాయి. – అమరేందర్, కొండగట్టు ఆలయ ఈవో -
‘ప్లాన్’ చేసి లేపేశారు
రాజమహేంద్రవరం మాస్టర్ ప్లాన్‌లో మరో మాయాజాలం మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డు విస్తరణ నిలిపివేత నలుగురు కార్పొరేటర్లు సిఫారసు చేశారని తొలగింపు చేతులు మారిన కోట్ల రూపాయలు సాక్షి, రాజమహేంద్రవరం : రానున్న పదిహేనేళ్ల కాలానికి రాజమహేంద్రవరం నగర జనాభా పెరుగుదల, అభివృద్ధిని ఊహిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లా¯ŒSలో అనేక చిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, పలువురు కార్పొరేటర్లు రూ.కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని మాస్టర్‌ప్లా¯ŒSలో తమకు నచ్చినవిధంగా మార్పులు చేర్పులకు సిఫారసులు చేశారు. మాస్టర్‌ప్లా¯ŒSను మంచి ఆదాయమార్గంగా మలచుకున్న పలువురు కార్పొరేటర్లు కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. కోలమూరు, కొంతమూరు, పిడింగొయ్యి తదితర పంచాయతీలను, నగరంలోని రాజకీయ నేతల స్థలాలను రెసిడెన్షియల్ జో¯ŒSలోకి మార్చడం, రియల్ వెంచర్లకు నష్టం కలగకుండా ప్రతిపాదించిన రోడ్లు ఉపసంహరించడం కోసం సిఫారసులు చేసిన పలువురు కార్పొరేటర్లు నగదు, స్థలాలు, పొలాలు బహుమతులుగా పొందారు. అధికార పార్టీ కార్పొరేటర్లు సినీ ఫక్కీలో మాస్టర్‌ప్లా¯ŒSలో చేసిన మరో ‘మాయాజాలం’ తాజాగా బయటపడింది. మోరంపూడి – స్టేడియం రోడ్డు విస్తరణకు బ్రేక్ నగరంలో అత్యంత ప్రధానమైన రహదారుల్లో మోరంపూడి సెంటర్ నుంచి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా మున్సిపల్ స్టేడియం వరకూ ఉన్న రోడ్డు ఒకటి. నగరంలోని ముఖ్యమైన ఎనిమిది లింకు రోడ్లు దీనికి కలుస్తాయి. వీఎల్ పురం రోడ్డు, తిలక్ రోడ్డు, పాత సోమాలమ్మ పుంత రోడ్డు, వెంకటేశ్వర హోల్‌సేల్ జనరల్ మార్కెట్ రోడ్డు, శీలం నూకరాజు ఫ్యాక్టరీ రోడ్డు, తాడితోట మహాత్మాగాంధీ హోల్‌సేల్ వస్త్ర దుకాణాల రోడ్డు, తాడితోట బైపాస్‌రోడ్డు, తాడితోట ఇండస్ట్రియల్ లింకు రోడ్లు దీనికి కలుస్తాయి. దాదాపు 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డుకు కలిసే లింకు రోడ్లు కూడా 30 నుంచి 60 అడుగుల వరకూ ఉన్నాయి. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, విద్యా, వ్యాపార సంస్థలు ఉన్న ఈ రోడ్డులో షెల్టాన్, తాడితోట జంక్ష¯ŒS, స్టేడియం కూడలిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు మాస్టర్‌ప్లా¯ŒSలో అధికారులు ప్రతిపాదించారు. కానీ, కీలకమైన ఈ ప్రతిపాదనను అధికార పార్టీ కార్పొరేటర్లు ఎత్తివేయించారు. పాత మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం ఈ రోడ్డును 80 అడుగులుగానే ఉంచాలని 10వ డివిజ¯ŒS కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, 13వ డివిజ¯ŒS టీడీపీ కార్పొరేటర్ పాలిక శ్రీనివాసరావులు మొదట సిఫారసు చేశారు. అయితే అత్యంత ప్రధానమైన ఈ రోడ్డును విస్తరించడం తప్పనిసరని పేర్కొంటూ అధికారులు వారి సిఫారసులను తిరస్కరించారు. మాస్టర్‌ప్లా¯ŒSపై ఈ నెల 4న జరిగిన 15, 16వ డివిజన్ల కార్పొరేటర్లు దంగేటి నాగలక్ష్మి, కిలపర్తి శ్రీనివాస్‌లతోపాటు ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాస్టర్‌ప్లా¯ŒSలో ఈ రోడ్డును ఉపసంహరించాలని సిఫారసు చేస్తూ తమ సంతకాలతో లేఖ ఇచ్చారు. చివరకు గందరగోళం మధ్య ఈ సిఫారసులకు పాలక మండలి ఆమోదం తెలిపింది. కేవలం నలుగురు కార్పొరేటర్లు ప్రతిపాదిస్తే కీలకమైన ఈ రోడ్డు విస్తరణను ఆపేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేతులు మారిన రూ.కోట్లు అయితే ఈ వ్యవహారంలో అధికార పార్టీ కార్పొరేటర్లతోపాటు ముఖ్య నేతలకు దండిగా ముట్టినట్లు సమాచారం. ఈ రోడ్డులో ఉన్న కొందరు వ్యాపారస్తులు, ఖాళీస్థలాల యజమానులు భారీ మొత్తంలో ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని నేతలు ప్రతిపాదించారు. వాస్తవానికి ఈ రోడ్డులో అసలు పేదల ఇళ్లే లేకపోవడం గమనార్హం. విస్తరణ సులువే.. మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును ఆనుకుని వ్యాపార దుకాణాలున్నాయి. స్టేడియం నుంచి రామకృష్ణా థియేటర్ వరకూ రెండువైపులా దుకాణాలు ఉండగా.. ఆ తరువాత అక్కడక్కడ మినహా.. ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ఒకవైపు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వీఎల్ పురం సెంటర్ వరకూ ఇరువైపులా అక్కడక్కడ మాత్రమే దుకాణాలున్నాయి. 90 శాతం మేర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీఎల్ పురం తర్వాత మోరంపూడి సెంటర్ వరకూ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇటువంటి రోడ్డును విస్తరించడం అధికార యంత్రాంగానికి చాలా సులువు. కానీ, వ్యాపారులు, స్థల యజమానుల ముడుపులకు తలొగ్గిన అధికార పార్టీ నేతలు అధికారులు కాదన్నా రోడ్డు విస్తరణను నిలిపివేయించడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోపక్క ఈ రోడ్డు విస్తరణ అత్యవసరమని, మెజారిటీ కార్పొరేటర్లు కోరితే 100 అడుగులకు విస్తరిస్తామని మేయర్ పంతం రజనీ శేషసాయి చెప్పారు. -
ఇలాగేనా భవిష్యత్ ప్లాను?
మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావన లేని మౌలిక వసతులు ప్రతిపాదించిన సదుపాయాల వివరాలు శూన్యం పెరిగిన జనాభాకు సౌకర్యాల మాటేమిటీ? రాజమహేంద్రవరం మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదించిన నేపథ్యంలో... సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలో 2031 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లా¯ŒS అసంపూర్తిగా ఉంది. మాస్టర్‌ప్లా¯ŒSలో కేవలం రోడ్లు వెడల్పు, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ల విభజననే ప్రస్తావించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన విద్యా, వైద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశానాలు ఇలా ఏ వివరాలను మాస్టర్‌ప్లా¯ŒSలో స్పష్టంగా పేర్కొనలేదు. సాధారణంగా మాస్టర్‌ప్లా¯ŒS అంటే భవిష్యత్‌లో పెరగనున్న జనాభాకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చేలా ముందస్తుగా ప్రణాళిక తయారు చేసి అంచెలంచెలుగా వాటిని ఆచరణలో పెట్టడం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు రూపాందించిన మాస్టర్‌ప్లా¯ŒS ఇందుకు విరుద్ధంగా ఉంది. జనాభాకు తగ్గట్టు వసతుల ప్రణాళికేదీ? ఇప్పటి వరకూ నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లు. కొత్త మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం నగర చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 పంచాయతీల విస్తీర్ణం 118.33 చ.కి.మీ కలవడంతో మొత్తం నగర విస్తీర్ణం 162.83 చ.కి.మీలకు పెరిగింది. అదే విధంగా 2011 లెక్కల ప్రకారం జనాభా 3,41,831 నుంచి 5,92,936కు పెరిగింది. విస్తీర్ణం నాలుగు రెట్లు, జనాభా దాదాపు రెండు రెట్లు మేర పెరిగాయి. 2031 నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అవసరమైన విద్యా, వైద్య సౌకర్యాలను మాస్టర్‌ప్లా¯ŒSలో ఎక్కడా ప్రస్తావించలేదు. నగరంలో ఇప్పటికే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పెరగనున్న జనాభాకు తగ్గట్టు మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి తీసుకునే చర్యల ప్రస్తావనే లేదు. ఇప్పటికీ నగర శివారు ప్రాంతాల్లోని డివిజన్లలో మురుగునీటి కాల్వలు, రోడ్లు లేవు. ముఖ్యమైన తాగునీటికి సౌకర్యానికి తీసుకోవాల్సిన చర్యలనూ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. రూపం ఇచ్చారు... జీవం మరిచారు! నగర కొత్త మాస్టర్‌ప్లా¯ŒSను హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ రూపొందించింది. దీనికి 2014 మే 23న టై¯ŒS అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆమోదముద్ర వేశారు. కొత్త మాస్టర్ ప్రకారం నగరానికి అవసరమయ్యే సదుపాయాలను అధికారులు అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఉన్న ఒక జనరల్ ఆస్పత్రికి అదనంగా మరో రెండు ఆస్పత్రులు, ఐదు పబ్లిక్ హెల్త్ సెంటర్లు కావాలని నివేదించారు. విద్య పరంగా ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు 50 ఉండగా అదనంగా మరో 270, ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం 13 ఉండగా మరో 93, జూనియర్ కళాశాలలు 106, డిగ్రీ, వృత్తి విద్య కళాశాలలు 6 కావాలన్నారు. ప్రస్తుతం నగర ప్రజలకు ప్రతి రోజు 65 ఎంఎల్డీ తాగునీటిని సరఫరా చేస్తుండగా, ఇకపై 125 ఎంఎల్డీ నీరు అవసరమవుతుందని పేర్కొన్నారు. ఇందుకు అదనంగా 9 రిజర్వాయర్లు, మూడు పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) ఒకటి ఉండగా అదనంగా మరో రెండు ప్లాంట్లు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు రెండు అవసరమవుతాయని పేర్కొన్నారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? భూమి లభ్యత వంటి వివరాలు మాస్టర్‌ప్లా¯ŒSలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ ప్రశ్నలకు బదులేదీ? కొత్త మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం నగరాభివృద్ధిలో వివిధ అంశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొం దించారో తెలపాలని పలువురు కార్పొరేటర్లు అధికారులను కోరుతున్నారు. అదే విధంగా ముఖ్యమైన రవాణా వ్యవస్థపై ఎలాంటి ప్రణాళికలు రూపొం దించారు? వంటి అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ∙భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుత మాస్టర్‌ప్లా¯ŒSలో సంబంధిత ప్రణాళికేదీ? ∙పెరుగుతున్న జనాభాకు అవసరమైన క్రీడా స్థలాలు, పార్కులు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ∙వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఎక్కడెక్కడ ఏర్పాటుకు అనుమతివ్వదలిచారు? ∙భిన్న మతాల ప్రజలకు అవసరమైన శ్మశానాల ఏర్పాటుకు స్థలం ఎక్కడ? వాటి నిర్వహణ పరిస్థితేంటి? ∙ప్రస్తుతం నగరంలో భూగర్భ జలాల లభ్యత ఎంత? ∙స్థానిక రావాణా (సిటీ బస్సులు) ఏర్పాటు ప్రణాళికలు? ∙ఆస్పత్రులు, స్కూళ్లు, గిడ్డంగుల కోసం నిర్ధిష్ట ప్రదేశాలు కేటాయించారా? ∙క్రీడా గ్రామం, క్రికెట్ స్టేడియం, ఇ¯ŒSడోర్ స్టేడియం, బయోడైవర్సిటీ ప్రాంతం, జంతు ప్రదర్శనశాల వంటి వాటికి ప్రత్యేక ప్రాంతాలు కేటాయించారా? ∙చెత్త డింపింగ్ యార్డులు ఎన్ని? ఎక్కడ ఏర్పాటు చేస్తారు?