- మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావన లేని మౌలిక వసతులు
- ప్రతిపాదించిన సదుపాయాల వివరాలు శూన్యం
- పెరిగిన జనాభాకు సౌకర్యాల మాటేమిటీ?
- రాజమహేంద్రవరం మాస్టర్‌ప్లా¯ŒSను ఆమోదించిన నేపథ్యంలో...
ఇలాగేనా భవిష్యత్ ప్లాను?
Published Sun, Dec 4 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
నగరంలో 2031 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లా¯ŒS అసంపూర్తిగా ఉంది. మాస్టర్‌ప్లా¯ŒSలో కేవలం రోడ్లు వెడల్పు, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ల విభజననే ప్రస్తావించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన విద్యా, వైద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశానాలు ఇలా ఏ వివరాలను మాస్టర్‌ప్లా¯ŒSలో స్పష్టంగా పేర్కొనలేదు. సాధారణంగా మాస్టర్‌ప్లా¯ŒS అంటే భవిష్యత్‌లో పెరగనున్న జనాభాకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చేలా ముందస్తుగా ప్రణాళిక తయారు చేసి అంచెలంచెలుగా వాటిని ఆచరణలో పెట్టడం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు రూపాందించిన మాస్టర్‌ప్లా¯ŒS ఇందుకు విరుద్ధంగా ఉంది.
జనాభాకు తగ్గట్టు వసతుల ప్రణాళికేదీ?
ఇప్పటి వరకూ నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లు. కొత్త మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం నగర చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 పంచాయతీల విస్తీర్ణం 118.33 చ.కి.మీ కలవడంతో మొత్తం నగర విస్తీర్ణం 162.83 చ.కి.మీలకు పెరిగింది. అదే విధంగా 2011 లెక్కల ప్రకారం జనాభా 3,41,831 నుంచి 5,92,936కు పెరిగింది. విస్తీర్ణం నాలుగు రెట్లు, జనాభా దాదాపు రెండు రెట్లు మేర పెరిగాయి. 2031 నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అవసరమైన విద్యా, వైద్య సౌకర్యాలను మాస్టర్‌ప్లా¯ŒSలో ఎక్కడా ప్రస్తావించలేదు. నగరంలో ఇప్పటికే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పెరగనున్న జనాభాకు తగ్గట్టు మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి తీసుకునే చర్యల ప్రస్తావనే లేదు. ఇప్పటికీ నగర శివారు ప్రాంతాల్లోని డివిజన్లలో మురుగునీటి కాల్వలు, రోడ్లు లేవు. ముఖ్యమైన తాగునీటికి సౌకర్యానికి తీసుకోవాల్సిన చర్యలనూ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
రూపం ఇచ్చారు... జీవం మరిచారు!
నగర కొత్త మాస్టర్‌ప్లా¯ŒSను హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీ అసోసియేట్స్ రూపొందించింది. దీనికి 2014 మే 23న టై¯ŒS అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆమోదముద్ర వేశారు. కొత్త మాస్టర్ ప్రకారం నగరానికి అవసరమయ్యే సదుపాయాలను అధికారులు అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఉన్న ఒక జనరల్ ఆస్పత్రికి అదనంగా మరో రెండు ఆస్పత్రులు, ఐదు పబ్లిక్ హెల్త్ సెంటర్లు కావాలని నివేదించారు. విద్య పరంగా ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు 50 ఉండగా అదనంగా మరో 270, ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం 13 ఉండగా మరో 93, జూనియర్ కళాశాలలు 106, డిగ్రీ, వృత్తి విద్య కళాశాలలు 6 కావాలన్నారు. ప్రస్తుతం నగర ప్రజలకు ప్రతి రోజు 65 ఎంఎల్‌డీ తాగునీటిని సరఫరా చేస్తుండగా, ఇకపై 125 ఎంఎల్‌డీ నీరు అవసరమవుతుందని పేర్కొన్నారు. ఇందుకు అదనంగా 9 రిజర్వాయర్లు, మూడు పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) ఒకటి ఉండగా అదనంగా మరో రెండు ప్లాంట్లు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు రెండు అవసరమవుతాయని పేర్కొన్నారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? భూమి లభ్యత వంటి వివరాలు మాస్టర్‌ప్లా¯ŒSలో ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
కొత్త మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం నగరాభివృద్ధిలో వివిధ అంశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొం దించారో తెలపాలని పలువురు కార్పొరేటర్లు అధికారులను కోరుతున్నారు. అదే విధంగా ముఖ్యమైన రవాణా వ్యవస్థపై ఎలాంటి ప్రణాళికలు రూపొం దించారు? వంటి అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
∙భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుత మాస్టర్‌ప్లా¯ŒSలో సంబంధిత ప్రణాళికేదీ?
∙పెరుగుతున్న జనాభాకు అవసరమైన క్రీడా స్థలాలు, పార్కులు ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
∙వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఎక్కడెక్కడ ఏర్పాటుకు అనుమతివ్వదలిచారు?
∙భిన్న మతాల ప్రజలకు అవసరమైన శ్మశానాల ఏర్పాటుకు స్థలం ఎక్కడ? వాటి నిర్వహణ పరిస్థితేంటి?
∙ప్రస్తుతం నగరంలో భూగర్భ జలాల లభ్యత ఎంత?
∙స్థానిక రావాణా (సిటీ బస్సులు) ఏర్పాటు ప్రణాళికలు?
∙ఆస్పత్రులు, స్కూళ్లు, గిడ్డంగుల కోసం నిర్ధిష్ట ప్రదేశాలు కేటాయించారా?
∙క్రీడా గ్రామం, క్రికెట్ స్టేడియం, ఇ¯ŒSడోర్ స్టేడియం, బయోడైవర్సిటీ ప్రాంతం, జంతు ప్రదర్శనశాల వంటి వాటికి ప్రత్యేక ప్రాంతాలు కేటాయించారా?
∙చెత్త డింపింగ్ యార్డులు ఎన్ని? ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
Advertisement