- రాజమహేంద్రవరం మాస్టర్ ప్లాన్‌లో మరో మాయాజాలం
- మోరంపూడి సెంటర్ – స్టేడియం
- రోడ్డు విస్తరణ నిలిపివేత
- నలుగురు కార్పొరేటర్లు సిఫారసు చేశారని తొలగింపు
- చేతులు మారిన కోట్ల రూపాయలు
‘ప్లాన్’ చేసి లేపేశారు
Published Sun, Dec 11 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
రానున్న పదిహేనేళ్ల కాలానికి రాజమహేంద్రవరం నగర జనాభా పెరుగుదల, అభివృద్ధిని ఊహిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లా¯ŒSలో అనేక చిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, పలువురు కార్పొరేటర్లు రూ.కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని మాస్టర్‌ప్లా¯ŒSలో తమకు నచ్చినవిధంగా మార్పులు చేర్పులకు సిఫారసులు చేశారు. మాస్టర్‌ప్లా¯ŒSను మంచి ఆదాయమార్గంగా మలచుకున్న పలువురు కార్పొరేటర్లు కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. కోలమూరు, కొంతమూరు, పిడింగొయ్యి తదితర పంచాయతీలను, నగరంలోని రాజకీయ నేతల స్థలాలను రెసిడెన్షియల్ జో¯ŒSలోకి మార్చడం, రియల్ వెంచర్లకు నష్టం కలగకుండా ప్రతిపాదించిన రోడ్లు ఉపసంహరించడం కోసం సిఫారసులు చేసిన పలువురు కార్పొరేటర్లు నగదు, స్థలాలు, పొలాలు బహుమతులుగా పొందారు. అధికార పార్టీ కార్పొరేటర్లు సినీ ఫక్కీలో మాస్టర్‌ప్లా¯ŒSలో చేసిన మరో ‘మాయాజాలం’ తాజాగా బయటపడింది.
మోరంపూడి – స్టేడియం రోడ్డు విస్తరణకు బ్రేక్
నగరంలో అత్యంత ప్రధానమైన రహదారుల్లో మోరంపూడి సెంటర్ నుంచి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా మున్సిపల్ స్టేడియం వరకూ ఉన్న రోడ్డు ఒకటి. నగరంలోని ముఖ్యమైన ఎనిమిది లింకు రోడ్లు దీనికి కలుస్తాయి. వీఎల్ పురం రోడ్డు, తిలక్ రోడ్డు, పాత సోమాలమ్మ పుంత రోడ్డు, వెంకటేశ్వర హోల్‌సేల్ జనరల్ మార్కెట్ రోడ్డు, శీలం నూకరాజు ఫ్యాక్టరీ రోడ్డు, తాడితోట మహాత్మాగాంధీ హోల్‌సేల్ వస్త్ర దుకాణాల రోడ్డు, తాడితోట బైపాస్‌రోడ్డు, తాడితోట ఇండస్ట్రియల్ లింకు రోడ్లు దీనికి కలుస్తాయి. దాదాపు 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డుకు కలిసే లింకు రోడ్లు కూడా 30 నుంచి 60 అడుగుల వరకూ ఉన్నాయి. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, విద్యా, వ్యాపార సంస్థలు ఉన్న ఈ రోడ్డులో షెల్టాన్, తాడితోట జంక్ష¯ŒS, స్టేడియం కూడలిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు మాస్టర్‌ప్లా¯ŒSలో అధికారులు ప్రతిపాదించారు.
కానీ, కీలకమైన ఈ ప్రతిపాదనను అధికార పార్టీ కార్పొరేటర్లు ఎత్తివేయించారు. పాత మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం ఈ రోడ్డును 80 అడుగులుగానే ఉంచాలని 10వ డివిజ¯ŒS కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, 13వ డివిజ¯ŒS టీడీపీ కార్పొరేటర్ పాలిక శ్రీనివాసరావులు మొదట సిఫారసు చేశారు. అయితే అత్యంత ప్రధానమైన ఈ రోడ్డును విస్తరించడం తప్పనిసరని పేర్కొంటూ అధికారులు వారి సిఫారసులను తిరస్కరించారు. మాస్టర్‌ప్లా¯ŒSపై ఈ నెల 4న జరిగిన 15, 16వ డివిజన్ల కార్పొరేటర్లు దంగేటి నాగలక్ష్మి, కిలపర్తి శ్రీనివాస్‌లతోపాటు ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాస్టర్‌ప్లా¯ŒSలో ఈ రోడ్డును ఉపసంహరించాలని సిఫారసు చేస్తూ తమ సంతకాలతో లేఖ ఇచ్చారు. చివరకు గందరగోళం మధ్య ఈ సిఫారసులకు పాలక మండలి ఆమోదం తెలిపింది. కేవలం నలుగురు కార్పొరేటర్లు ప్రతిపాదిస్తే కీలకమైన ఈ రోడ్డు విస్తరణను ఆపేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చేతులు మారిన రూ.కోట్లు
అయితే ఈ వ్యవహారంలో అధికార పార్టీ కార్పొరేటర్లతోపాటు ముఖ్య నేతలకు దండిగా ముట్టినట్లు సమాచారం. ఈ రోడ్డులో ఉన్న కొందరు వ్యాపారస్తులు, ఖాళీస్థలాల యజమానులు భారీ మొత్తంలో ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని నేతలు ప్రతిపాదించారు. వాస్తవానికి ఈ రోడ్డులో అసలు పేదల ఇళ్లే లేకపోవడం గమనార్హం.
విస్తరణ సులువే..
మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును ఆనుకుని వ్యాపార దుకాణాలున్నాయి. స్టేడియం నుంచి రామకృష్ణా థియేటర్ వరకూ రెండువైపులా దుకాణాలు ఉండగా.. ఆ తరువాత అక్కడక్కడ మినహా.. ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ఒకవైపు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వీఎల్ పురం సెంటర్ వరకూ ఇరువైపులా అక్కడక్కడ మాత్రమే దుకాణాలున్నాయి. 90 శాతం మేర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీఎల్ పురం తర్వాత మోరంపూడి సెంటర్ వరకూ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇటువంటి రోడ్డును విస్తరించడం అధికార యంత్రాంగానికి చాలా సులువు. కానీ, వ్యాపారులు, స్థల యజమానుల ముడుపులకు తలొగ్గిన అధికార పార్టీ నేతలు అధికారులు కాదన్నా రోడ్డు విస్తరణను నిలిపివేయించడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోపక్క ఈ రోడ్డు విస్తరణ అత్యవసరమని, మెజారిటీ కార్పొరేటర్లు కోరితే 100 అడుగులకు విస్తరిస్తామని మేయర్ పంతం రజనీ శేషసాయి చెప్పారు.
Advertisement
Advertisement