Morampudi
-
‘ప్లాన్’ చేసి లేపేశారు
రాజమహేంద్రవరం మాస్టర్ ప్లాన్‌లో మరో మాయాజాలం మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డు విస్తరణ నిలిపివేత నలుగురు కార్పొరేటర్లు సిఫారసు చేశారని తొలగింపు చేతులు మారిన కోట్ల రూపాయలు సాక్షి, రాజమహేంద్రవరం : రానున్న పదిహేనేళ్ల కాలానికి రాజమహేంద్రవరం నగర జనాభా పెరుగుదల, అభివృద్ధిని ఊహిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లా¯ŒSలో అనేక చిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, పలువురు కార్పొరేటర్లు రూ.కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని మాస్టర్‌ప్లా¯ŒSలో తమకు నచ్చినవిధంగా మార్పులు చేర్పులకు సిఫారసులు చేశారు. మాస్టర్‌ప్లా¯ŒSను మంచి ఆదాయమార్గంగా మలచుకున్న పలువురు కార్పొరేటర్లు కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. కోలమూరు, కొంతమూరు, పిడింగొయ్యి తదితర పంచాయతీలను, నగరంలోని రాజకీయ నేతల స్థలాలను రెసిడెన్షియల్ జో¯ŒSలోకి మార్చడం, రియల్ వెంచర్లకు నష్టం కలగకుండా ప్రతిపాదించిన రోడ్లు ఉపసంహరించడం కోసం సిఫారసులు చేసిన పలువురు కార్పొరేటర్లు నగదు, స్థలాలు, పొలాలు బహుమతులుగా పొందారు. అధికార పార్టీ కార్పొరేటర్లు సినీ ఫక్కీలో మాస్టర్‌ప్లా¯ŒSలో చేసిన మరో ‘మాయాజాలం’ తాజాగా బయటపడింది. మోరంపూడి – స్టేడియం రోడ్డు విస్తరణకు బ్రేక్ నగరంలో అత్యంత ప్రధానమైన రహదారుల్లో మోరంపూడి సెంటర్ నుంచి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా మున్సిపల్ స్టేడియం వరకూ ఉన్న రోడ్డు ఒకటి. నగరంలోని ముఖ్యమైన ఎనిమిది లింకు రోడ్లు దీనికి కలుస్తాయి. వీఎల్ పురం రోడ్డు, తిలక్ రోడ్డు, పాత సోమాలమ్మ పుంత రోడ్డు, వెంకటేశ్వర హోల్‌సేల్ జనరల్ మార్కెట్ రోడ్డు, శీలం నూకరాజు ఫ్యాక్టరీ రోడ్డు, తాడితోట మహాత్మాగాంధీ హోల్‌సేల్ వస్త్ర దుకాణాల రోడ్డు, తాడితోట బైపాస్‌రోడ్డు, తాడితోట ఇండస్ట్రియల్ లింకు రోడ్లు దీనికి కలుస్తాయి. దాదాపు 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డుకు కలిసే లింకు రోడ్లు కూడా 30 నుంచి 60 అడుగుల వరకూ ఉన్నాయి. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, విద్యా, వ్యాపార సంస్థలు ఉన్న ఈ రోడ్డులో షెల్టాన్, తాడితోట జంక్ష¯ŒS, స్టేడియం కూడలిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు మాస్టర్‌ప్లా¯ŒSలో అధికారులు ప్రతిపాదించారు. కానీ, కీలకమైన ఈ ప్రతిపాదనను అధికార పార్టీ కార్పొరేటర్లు ఎత్తివేయించారు. పాత మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం ఈ రోడ్డును 80 అడుగులుగానే ఉంచాలని 10వ డివిజ¯ŒS కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, 13వ డివిజ¯ŒS టీడీపీ కార్పొరేటర్ పాలిక శ్రీనివాసరావులు మొదట సిఫారసు చేశారు. అయితే అత్యంత ప్రధానమైన ఈ రోడ్డును విస్తరించడం తప్పనిసరని పేర్కొంటూ అధికారులు వారి సిఫారసులను తిరస్కరించారు. మాస్టర్‌ప్లా¯ŒSపై ఈ నెల 4న జరిగిన 15, 16వ డివిజన్ల కార్పొరేటర్లు దంగేటి నాగలక్ష్మి, కిలపర్తి శ్రీనివాస్‌లతోపాటు ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాస్టర్‌ప్లా¯ŒSలో ఈ రోడ్డును ఉపసంహరించాలని సిఫారసు చేస్తూ తమ సంతకాలతో లేఖ ఇచ్చారు. చివరకు గందరగోళం మధ్య ఈ సిఫారసులకు పాలక మండలి ఆమోదం తెలిపింది. కేవలం నలుగురు కార్పొరేటర్లు ప్రతిపాదిస్తే కీలకమైన ఈ రోడ్డు విస్తరణను ఆపేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేతులు మారిన రూ.కోట్లు అయితే ఈ వ్యవహారంలో అధికార పార్టీ కార్పొరేటర్లతోపాటు ముఖ్య నేతలకు దండిగా ముట్టినట్లు సమాచారం. ఈ రోడ్డులో ఉన్న కొందరు వ్యాపారస్తులు, ఖాళీస్థలాల యజమానులు భారీ మొత్తంలో ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని నేతలు ప్రతిపాదించారు. వాస్తవానికి ఈ రోడ్డులో అసలు పేదల ఇళ్లే లేకపోవడం గమనార్హం. విస్తరణ సులువే.. మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును ఆనుకుని వ్యాపార దుకాణాలున్నాయి. స్టేడియం నుంచి రామకృష్ణా థియేటర్ వరకూ రెండువైపులా దుకాణాలు ఉండగా.. ఆ తరువాత అక్కడక్కడ మినహా.. ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ఒకవైపు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వీఎల్ పురం సెంటర్ వరకూ ఇరువైపులా అక్కడక్కడ మాత్రమే దుకాణాలున్నాయి. 90 శాతం మేర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీఎల్ పురం తర్వాత మోరంపూడి సెంటర్ వరకూ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇటువంటి రోడ్డును విస్తరించడం అధికార యంత్రాంగానికి చాలా సులువు. కానీ, వ్యాపారులు, స్థల యజమానుల ముడుపులకు తలొగ్గిన అధికార పార్టీ నేతలు అధికారులు కాదన్నా రోడ్డు విస్తరణను నిలిపివేయించడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోపక్క ఈ రోడ్డు విస్తరణ అత్యవసరమని, మెజారిటీ కార్పొరేటర్లు కోరితే 100 అడుగులకు విస్తరిస్తామని మేయర్ పంతం రజనీ శేషసాయి చెప్పారు. -
రోడ్డు ప్రమాదం: భవానీ భక్తుడు మృతి
-
రోడ్డు ప్రమాదం: భవానీ భక్తుడు మృతి
రాజమండ్రి: మోరంపూడి జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భవానీ భక్తులతో విజయవాడ వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
అధైర్య పడొద్దు.. మీకు అండగా ఉంటా
మోరంపూడి రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు జగన్ భరోసా ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ కన్నీరుమున్నీరైన బాధితులు.. తమ ఆవేదనను జగన్‌తో పంచుకున్న ఆయా కుటుంబాలవారు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘అధైర్యపడొద్దు.. నేను అండగా ఉంటాను.. ఏ అవసరమొచ్చినా మీకు అందుబాటులో ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇనపకోళ్ల దుర్గాప్రసాద్, శివనేని మహాలక్ష్మి, ర్యాలి వెంకన్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటనను తెలుసుకుని చలించిపోయిన జగన్ ఆ కుటుంబాల వారిని పరామర్శించేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ రాజమండ్రి, కరప మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మోరంపూడి రోడ్డు ప్రమాదంలో ఏడోతరగతి చదువుతున్న దుర్గాప్రసాద్ మృతిచెందగా, బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించారు. తామంతా అండగా ఉన్నామంటూ భరోసానిచ్చారు. వైద్యులనడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విజయలక్ష్మి చేయి, తల, కాళ్లకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుసుకుని చలించిపోయారు. జగన్‌ను చూడగానే విజయలక్ష్మికి దుఃఖం కట్టలుతెగింది. ఆమెను అనునయిస్తూ ‘మీకు వెన్నంటి ఉంటామమ్మా’ అని జగన్ ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి త్వరగా కోలుకునేందుకు కావాల్సిన చికిత్స విషయంలో ఎలాంటి లోపం రాకుండా చూడాలని వైద్యులను కోరారు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక దెబ్బతిన్న విజయలక్ష్మి భర్త శ్రీనివాసరావును మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించినట్టు వైద్యులు తెలపగా.. అక్కడ ఏ ఆసుపత్రిలో చేర్పించేది తనకు సమాచారమందిస్తే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యమందేలా చూస్తానని జగన్ చెప్పారు. వెంకన్న కుటుంబానికి పరామర్శ.. అనంతరం రాజమండ్రి గోరక్షణపేటలో ర్యాలి వెంకన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వెంకన్న తల్లి నాగరత్నం, భార్య వరలక్ష్మి, కుమారుడు మహేష్, కుమార్తె హేమలత తదితర కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించగా వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. వడ్రంగం పనిచేసే వెంకన్న ఆరోగ్యం సహకరించక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని, వెంకన్న మృతితో ఆధారం కోల్పోయామంటూ వారు బావురుమన్నారు. అద్దె ఇంటిలో ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. వెంకన్న పాతచిత్రాలు చూసి జగన్ కళ్లు చెమర్చాయి. ‘‘మీరు అధైర్యపడకండి, మా నాయకులు జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు మీకు అండగా నిలుస్తా’’రని జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని అంటూ.. సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం వచ్చే ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేస్తా.. తర్వాత జగన్ కరప మండలం కూరాడ వెళ్లి శివనేని మహాలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మహాలక్ష్మి కుమారులు సత్యనారాయణ, నారాయణరావుతోపాటు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించారు. మృతురాలి మనవరాలు శిరీష మాట్లాడుతూ.. మోరంపూడి జంక్షనంటే భయమేస్తోందని, తమ కుటుంబసభ్యులు ఇద్దరు అక్కడే ప్రమాదంలో మృతి చెందారంటూ కన్నీరుమున్నీరైంది. తమ పరిస్థితి మరొకరికి రాకుండా చూడాలని కుటుంబ సభ్యులన్నారు. జగన్ స్పందిస్తూ ఆ జంక్షన్ వద్ద జరిగే ప్రమాదాలను ప్రభుత్వదృష్టికి తీసుకెళ్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. బాధితులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయమందేలా అన్నిరకాలుగా ప్రయత్నిస్తానన్నారు. పార్టీ నేతలకు పరామర్శ.. ఇదిలా ఉండగా వేమగిరిలో మాతృవియోగంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు రావిపాటి రామచంద్రరావు, వేంకటేశ్వరరావుల కుటుంబాన్ని ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. వారి తల్లి గంగాభవాని చిత్రపటానికి నివాళులర్పించారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె తనను ఆత్మీయంగా పలకరించారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు భార్య వెంకటలక్ష్మిలను కూడా వైఎస్సార్సీపీ అధినేత పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహవేడుకలకు హాజరైన జగన్.. వధూవరులు అంజని, హర్షవర్ధన్‌రెడ్డిలను ఆశీర్వదించారు. నగరంలోని ఒక ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన పెద్దాపురం పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు రెండో కుమారుడిని జగన్ ఆశీర్వదించారు. అనంతరం రాజమండ్రి చేరుకుని ఆర్అండ్బి అతిథిగృహంలో రాత్రి బస చేశారు. ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, ప్రసాదరాజు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ నాయకులు పినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి తదితరులున్నారు. వైభవంగా ద్వారంపూడి కుమార్తె వివాహ రిసెప్షన్ కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె అంజని, హర్షవర్ధన్‌రెడ్డిల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భాస్కరపద్మ కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. రిసెప్షన్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు, అనధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సాక్షి డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి సహా పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు విచ్చేశారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వ విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వేడుకకు హాజరయ్యారు. -
కార్లు, ఆటోను ఢీకొన్న లారీ
మోరంపూడి (రాజమండ్రి రూరల్), న్యూస్‌లైన్ : మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఓ లారీ ఆటో, మూడు కార్లను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. లాలాచెరువు వైపు నుంచి వేమగిరి వైపు వెళ్తున్న లోడు లారీ మోరంపూడి కూడలి వద్ద సిగ్నల్ పడడంతో డ్రైవర్ బ్రేకు వేశాడు. అయితే లారీకి బ్రేకు పడకపోవడంతో ఆటోను ఢీకొంది. వేగంతో ఢీకొనడంతో ఆటో పక్కకు పోగా.. ముందున్న కారును లారీ బలంగా ఢీకొంది. ఆ కారు ఎదురు ఉన్న మరో కారును.. ఆ కారు మరో కారును ఢీకొన్నాయి. దీంతో లారీ ఢీకొన్న తొలి కారు వెనుకభాగం నుజ్జునుజ్జయింది. కారు వెనుక భాగంలో ఎవరూ లేకపోవడం.. ముందు కూర్చున్న వారిని అక్కడ ఉన్న కానిస్టేబుల్ రఘు జాగ్రత్తగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా రెండు కార్లలో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనను చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ బి.సాయిరమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.