
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్‌ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.
ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.
దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్‌కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.
what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT
— kira 👾 (@kirawontmiss) October 22, 2024