
సాక్షి,ముంబై: ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్‌కు విస్తరించనున్నారా? తాజా నివేదికలను ఈ ఊహలకు బలాన్నిస్తున్నాయి. ముఖేశ్ అంబానీ సింగపూర్‌లో ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక మేనేజర్‌ను కూడా నియమించారని సమాచారం. అయితే దీన్ని ప్రైవేట్ వ్యవహారంగా పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున‍్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అంబానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించనున్నారని టాక్. అయితే తాజా నివేదికలపై రిలయన్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.
రిలయన్స్ఆయిల్ రిఫైనింగ్ పెట్రోకెమికల్స్ వ్యాపారం నుండి ఇ-కామర్స్, గ్రీన్ ఎనర్జీ సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే క్రమంలో భారతదేశం వెలుపల కూడా విస్తరించే లక్క్ష్యంతోనే సింగపూర్‌లో కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 2021లో రిలయన్స్ బోర్డ్‌లో ఆరామ్‌కో చైర్మన్ నియామకాన్ని ప్రకటించినప్పుడు, తన వాటాదారులతో మాట్లాడుతూ, రిలయన్స్ "అంతర్జాతీయీకరణకు నాంది" అని, రానున్న కాలంలో తమ అంతర్జాతీయ ప్రణాళికలపై అంబానీ సంకేతాలివ్వాడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు అంబానీ, సింగపూర్ ఫ్యామిలీ ఆఫీస్‌ను ఈ ఏడాదిలోగా ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ వ్యవహారంలో ఆయన సతీమణి నీతా అంబానీ కూడా సహకరిస్తున్నారట. కాగా తక్కువ పన్నులు, భద్రతా కారణాల రీత్యా గ్లోబల్ బిలియనీర్లంతా సింగపూర్ బాటపడుతున్నారు. తాజా పరిణామంతో అంబానీ, హెడ్జ్ ఫండ్ బిలియనీర్ రే డాలియో ,గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సరసన నిలిచారు.మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అంచనా ప్రకారం 2021 చివరి నాటికి 700 మంది. ఇది ఒక సంవత్సరం ఈ సంఖ్య 400 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment