
సాక్షి, అమరావతి: మావోయిస్టు లేఖపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. ఇటువంటి లేఖపై స్పందించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ‘‘నేను భూములు ఆక్రమించుకున్నట్లు లేఖలు వచ్చాయి. ఆ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.
చదవండి: ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్
విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి అని మంత్రి ప్రశ్నించారు. ‘‘అమరావతిని ఏ ప్యాకేజీ కోసం పవన్ సమర్థిస్తున్నారు. చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు. కచ్చితంగా పాదయాత్రను అడ్డుకుని తీరతాం’’ అని అప్పలరాజు అన్నారు. మా గుండెల మీద తంతాం. నోటి కాడ కూడు లాగేస్తామంటే ఊరుకుంటామా.. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రను అడుగు పెట్టనివ్వం’’ అని మంత్రి అప్పలరాజు తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment