అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఎట్టకేలకు ఆమె ఈ విషయమై స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు మిచెల్. ప్రస్తుతం జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా చక్కగా పాలిస్తున్నారని, అతని పరిపాలనలో ప్రారంభించిన కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అలాగే బైడెన్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు కూడా ఆమె చాలా తెలివిగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
‘ఇది బైడెన్, అతని కుటుంబం అలోచించుకోవాల్సిన విషయం. ఇది పూర్తిగా బైడెన్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అలాగే బైడెన్, జిల్ బైడెన్ ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆలోచించే మిలియన్లమంది వ్యక్తులలో ఒకరిగా తాను ఉండాలనుకోవడం లేదు’ అంటూ కౌంటరిచ్చారు. అయితే ఆమె బైడెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అనే దానికి పూర్తి అంగీకారం ఇవ్వకుండా పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పకనే చెప్పారు.
(చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్)
Comments
Please login to add a commentAdd a comment