అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఆసక్తికర సమరం చోటు చేసుకోబోతోందా?. జో బైడెన్ స్థానంలో మరొకరిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలపనుందా?. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అక్కడ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
బరాక్ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్‌ను మార్చే అవకాశం ఉందని తెలిపారు.
కాగా నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ డిబెట్‌లో ఇరువురు పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఈ చర్చలో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యూహకర్తలు బిడెన్‌ను భర్తీ చేసే మార్గాలపై చర్చిస్టున్నట్లు తెలుస్తోంది.
బైడెన్ మాట్లాడిన తీరుపై డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆయన మాట్లలో బొంగురు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, సమాధానలు చెప్పడంలో, ఆలోచనలను వివరించడంలో తడబాటు.. వంటి పలు కారణాలతో బైడెన్‌ను రేసు నుంచి తప్పించాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిడెన్‌ను మిచెల్ ఒబామాతో డెమొక్రాటిక్ పార్టీ భర్తీ చేయాలని చూస్తుందని చెప్పారు టెడ్ క్రూజ్. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ను తొలగించి మిషెల్లీ ఒబామాను నియమించే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment