వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ ప్రకటించారు. అనంతరం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను అధ్యక్ష అభ్యర్థితత్వానికి తాను మద్దతిస్తున్నట్టు బైడెన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు బైడెన్ మద్దతివ్వడం గౌరవంగా భావిస్తున్నట్టు కమలా హారీస్ చెప్పుకొచ్చారు.
ఇక, తాజాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలా హారీస్ మాట్లాడుతూ..‘అధ్యక్షుడు బైడెన్ మద్దతు పొందడం నాకు గౌరవంగా ఉంది. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలుపే నా లక్ష్యం. అలాగే, అధ్యక్షుడిగా జో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారు. ప్రజల తరఫున బైడెన్‌ను ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా పర్యటించాను. సమస్యలను అడిగి తెలుసుకున్నాను.. రాబోయే రోజుల్లో కూడా ఇదే కొనసాగిస్తాను. డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడమే ఇప్పుడు ప్రజల ముందున్న లక్ష్యం. ట్రంప్ 2025 ఎజెండాను ఓడించడానికి, డెమోక్రటిక్ పార్టీని, దేశాన్ని ఏకం చేయడానికి నా శక్తి మేరకు పని చేస్తాను. 107 రోజులు కలిసికట్టుగా పోరాడి ఎన్నికల్లో విజయం అందుకుందాం’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘అందుకే తప్పుకుంటున్నా’.. బైడెన్ ఏం చెప్పారంటే..
Comments
Please login to add a commentAdd a comment