మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం | Donald Trump Shakes Hands With Kamala Harris At World Trade Center Memorial, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

బైడెన్‌ సమక్షంలో.. మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం

Published Thu, Sep 12 2024 12:42 PM | Last Updated on Thu, Sep 12 2024 1:48 PM

Donald Trump And Shakes Hands With Kamala Harris At World Trade Center Memorial

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కమలా హారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌లు మరోసారి చేతులు కలిపారు. నిన్న డిబేట్‌ ప్రారంభానికి ముందు ఇద్దరూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి కరచలనం చేసుకున్నారు.

9/11 దాడులు.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. నిన్నటితో దాడులకు 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంలో.. న్యూయార్క్‌లోని 9/11మొమోరియల్‌ వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈసారి బైడెన్‌ సమక్షంలో మరోసారి కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో 90 నిమిషాల ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ జరిగింది. ఈ డిబేట్‌లో ట్రంప్‌, హారిస్‌ ఇద్దరూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్‌లలో అధ్యక్ష అభ్యర్థులెవరూ డిబేట్‌కు ముందు ఎవరూ ఇలా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోలేదు.  

ట్రంప్‌ టోపీ ధరించిన జో బైడెన్‌ 
ఇదే సంస్మరణ సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి ట్రంప్‌2024 అని ఉన్న టోపీని ధరించిన ట్రంప్‌ అభిమానులున్నారు.  ట్రంప్‌ అభిమానులు ధరించిన టోపీని చూసిన బైడెన్‌ సరదాగా వారితో మాట్లాడారు. అందులో ఓ ట్రంప్‌ మద్దతు దారుడు ధరించిన టోపీని బైడెన్‌ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి : ట్రంప్‌- హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement