World Trade Center
-
ఈఫిల్ టవర్‌పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్‌కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్‌ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్‌లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్‌కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్‌కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు
దేశంలో ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లోని ఎత్తయిన భవనాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ దీపాల పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వెలుగులమయంగా మారింది. అమెరికాలోని అత్యంత ఎత్తైన భవనమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ లైట్లు ట్విన్ టవర్స్ అందాలను రెట్టింపు చేస్తున్నాయి. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు దీపోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. #WATCH दिवाली से पहले अमेरिका की सबसे ऊंची इमारत वन वर्ल्ड ट्रेड सेंटर को रंग-बिरंगी रोशनी से जगमग किया गया।(सोर्स: इंडिया इन न्यूयॉर्क) pic.twitter.com/Z81Zd0rrtp— ANI_HindiNews (@AHindinews) October 30, 20242021లో తొలిసారిగా న్యూయార్క్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వేడుకలు జరిగాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. నాటి నుంచి ప్రతీయేటా దీపావళి నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను అందమైన లైట్లతో అలంకరిస్తున్నారు. ఈ వేడుకలు మత సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం -
మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు మరోసారి చేతులు కలిపారు. నిన్న డిబేట్ ప్రారంభానికి ముందు ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి కరచలనం చేసుకున్నారు.9/11 దాడులు.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. నిన్నటితో దాడులకు 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంలో.. న్యూయార్క్‌లోని 9/11మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి బైడెన్ సమక్షంలో మరోసారి కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో 90 నిమిషాల ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్, హారిస్ ఇద్దరూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్లలో అధ్యక్ష అభ్యర్థులెవరూ డిబేట్‌కు ముందు ఎవరూ ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. 🚨 After putting on a MAGA hat, Joe Biden told a group of Trump supporters: “No eating dogs and cats”pic.twitter.com/TIxtN5LDOa— Benny Johnson (@bennyjohnson) September 12, 2024ట్రంప్ టోపీ ధరించిన జో బైడెన్ ఇదే సంస్మరణ సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి ట్రంప్2024 అని ఉన్న టోపీని ధరించిన ట్రంప్ అభిమానులున్నారు. ట్రంప్ అభిమానులు ధరించిన టోపీని చూసిన బైడెన్ సరదాగా వారితో మాట్లాడారు. అందులో ఓ ట్రంప్ మద్దతు దారుడు ధరించిన టోపీని బైడెన్ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదీ చదవండి : ట్రంప్- హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి -
9/11 @ 23.. ఆ రోజు ఏం జరిగింది?
వాషింగ్టన్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి 23 ఏళ్లు. అల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మూడు వేల మందికి పైగా జనం మృతి చెందారు. నాటి ఈ సంఘటన విషాదం నేటికీ అమెరికన్లను బాధపెడుతూనే ఉంది. ‘‘2001, సెప్టెంబరు 11’’.. ఇది అమెరికా చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ మరువలేని చీకటి దినం. ప్రాథమిక నివేదికల్లో ఈ ఘటనను విమాన ప్రమాదంగా పేర్కొన్నారు.బోస్టన్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం 8.46 గంటలకు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొంది. ఇదిజరిగిన 17 నిమిషాల తర్వాత, అదే భవనంలోని సౌత్ టవర్‌ను మరో విమానం ఢీకొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇది ఉగ్రవాద దాడి అని స్పష్టమైంది.ఆ రోజు ఆల్ ఖైదా ఉగ్రవాదులు మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేశారు. వారి లక్ష్యం న్యూయార్క్ నగరం మాత్రమే కాదు. పెంటగాన్, వైట్ హౌస్‌లను కూడా లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. అయితే వైట్‌హౌస్‌పై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నం విఫలమైంది.మొత్తం మీద ఆ రోజు నాలుగు చోట్ల జరిగిన దాడుల్లో మూడు వేల మందికి పైగా జనం మృతిచెందారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన తర్వాత, ఆ ప్రదేశాన్ని గ్రౌండ్ జీరోగా పిలుస్తున్నారు. ఈ దాడి తర్వాత అమెరికా తీవ్రవాదంపై యుద్ధం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇందుకు అనుగుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ భయంకరమైన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. పెరల్ హార్బర్ తర్వాత అమెరికాపై జరిగిన అతిపెద్ద దాడిగా 9/11ను చెబుతారు.ఇది కూడా చదవండి: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు -
ఆగస్టులో టీఎఫ్‌సీసీ నంది అవార్డులు
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక జరగనుంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆగస్టు 12న ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేసుకున్న సందర్బంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2021, 22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల వారు ఈ అవార్డుల కోసం టీఎఫ్‌సీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్‌కి సంబంధించిన లెటర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం సహకారం కూడా కోరనున్నాం. ఆగస్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘‘జ్యూరీ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమన్నారు. కానీ నేను జ్యూరీ మెంబర్‌గా ఉంటూ సపోర్ట్ చేస్తానని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు మురళీ మోహన్. సుమన్, బి. గోపాల్ తదితరులు మాట్లాడారు. -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..
వాషింగ్టన్ : అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (2001 సెప్టెంబరు 11) బీన్ లాడెన్ టీమ్ జరిపిన ఉగ్ర దాడులు చరిత్ర మరవలేదు. ఉగ్రవాదలు సృష్టించిన రక్తపాతానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఆల్‌ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేలమంది అమాయక పౌరులను పొట్టనపెట్టకుంది. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాలో 9/11 మృతులకు నివాళి అర్పించారు. ఏం జరిగింది.. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్‌ఖైదా తీవ్రవాదులు.. వాణిజ్య సేవలందించే నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించారు. హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. ఈ ఘటనతో వేలమంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. రెండు సౌధాలు(భవనాలు) అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2,752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపకదళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.. ఇక మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. విమానాల్లో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి. తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించడం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రతిస్పందించింది. అల్‌ఖైదా తీవ్రవాదులకు సాయం చేసే తాలిబన్లను తుదముట్టించే విధంగా ఆఫ్గనిస్తాన్‌పై దండెత్తింది. అంతేకాక ఉగ్రవాదాన్ని ఏరివేతకు కఠిన చట్టాన్ని అమలుచేసింది. పలు ఇతర దేశాలు కూడా వాటి తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని బలోపేతం చేసుకోవడం మరియు చట్టం యొక్క అమలు అధికారాలను విస్తరించుకున్నాయి. కొన్ని అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు దాడుల నేపథ్యంలో వారంలోని మిగిలిన రోజుల్లో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి. ఫలితంగా తిరిగి ప్రారంభించే సమయానికి తీవ్ర నష్టాలను చవిచూశాయి. బిలియన్ల డాలర్లు విలువ చేసే కార్యాలయ ప్రాంతం ధ్వంసమవడం ద్వారా లోయర్ మన్‌హట్టన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి: 9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు తెర వెనుక ఇంత జరిగిందా.. సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్‌ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు బిన్ లాడెన్ 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది. డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా యూఎస్ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా రక్షణ శాఖ ఎంతో శక్తివంతమైనది, సీఐఏ ఎంతో ముందుచూపు కలిగి ఉన్నదైనప్పటికీ ఆల్‌ఖైదా టీమ్ పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన దాడులు జరపగలిగింది. ప్రపంచ దేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
ఎలక్ట్రానిక్స్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్‌వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్‌సెట్స్‌పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు
వాషింగ్టన్: 2001లో అమెరికాలోని వరల్డ్‌ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ కేసును 2021లో చేపట్టనున్నట్లు మిలటరీ కోర్టు జడ్జి ఎయిర్‌ఫోర్స్ కల్నల్ డబ్ల్యూ షేన్ కోహెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు వ్యూహ రచనతోపాటు అమలు చేసినందుకు యుద్ధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ప్రస్తుతం అమెరికా వైమానిక స్థావరం గ్వాంటానమో బే జైలులో ఉన్నారు. వీరిపై 2021 జనవరి 11వ తేదీ నుంచి అక్కడే విచారణ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. వీరిని 2002–2003 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి పలు రహస్య ప్రాంతాల్లో ఉంచి, విచారణ జరిపింది. చివరికి 2006లో గ్వాంటానమో బే జైలుకు తరలించింది. మిలటరీ చట్టాల ప్రకారం వీరిపై నేరం రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. నిందితుల్లో సెప్టెంబర్ 11 దాడులతోపాటు ఇతర ఉగ్రచర్యలకు కుట్రపన్నిన అల్ ఖైదా సీనియర్ నేత ఖలీద్ షేక్ మొహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచి, ముస్తఫా అల్ హౌసవి ఉన్నారు. అల్‌ఖైదాకు చెందిన మొత్తం 19 మంది సభ్యులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేసి రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన, ఒకటి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌పైన కూల్చడంతోపాటు మరో దానిని పెన్సిల్వేనియాలో నేల కూల్చారు. ఈ ఘటనల్లో మొత్తం 3వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. -
అమెరికాలో తెలుగు వెలుగు
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష తెలుగు భాషేనని ఓ అమెరికా సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010–17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది. సెన్సస్ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్‌లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010–17 కాలంలో ఇంగ్లిష్ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 భాషల్లో ఏడు దక్షిణాసియావే కావడం విశేషం. ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు. కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో యూఎస్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం వెళ్తున్నారని బీబీసీ తెలిపింది. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్‌లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్‌లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ఇలినాయీస్ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో తెలుగు మాట్లాడే వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదలుకొని మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు నీనా దావులూరి వరకు ప్రముఖులెందరో ఉన్నారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాదీలే. -
అమెరికాలో ట్రక్ టెర్రర్
న్యూయార్క్: అమెరికాలో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల తరహాలోనే.. న్యూయార్క్‌లో ఓ ఉన్మాది ట్రక్కుతో పాదచారులపైకి దూసుకుపోయాడు. 9/11 నాటి దాడులకు కేంద్రమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోనే ఉగ్రవాది ట్రక్కుతో దూసుకురావటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సైఫుల్లా హబీబుల్లాయ్విక్ సైపోవ్ (29) అనే ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి.. ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో న్యూయార్క్తోపాటుగా అమెరికా ఉలిక్కిపడింది. ఈ ఘటనను ఉగ్రదాడిగానే భావిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఉన్మాది 2010లో డైవర్సిటీ లాటరీ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాకు వలస వచ్చినట్లు తెలిసింది. కడుపులో బుల్లెట్ తగలడంతో కుప్పకూలిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ఎలా జరిగింది? మంగళవారం రాత్రి హాలోవీన్ సంబరాలకోసం న్యూయార్క్ సిద్ధమవుతోంది. మన్హాటన్ పశ్చిమభాగంలోని హడ్సన్ నది సమీపంలో (వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరలో)ని హైవే వద్ద మార్కెట్ రద్దీగా ఉంది. సైకిల్ లేన్, పాదచారుల లేన్కూడా రద్దీగా ఉంది. మధ్యాహ్నం 03.04 గంటల (స్థానిక కాలమానం) సమయంలో ఓ ట్రక్కు హైవే నుంచి వేగంగా ఈ రెండు లేన్ల వైపు దూసుకొచ్చింది. ట్రక్కు నడుపుతున్న ఐసిస్ ఉగ్రవాది ‘అల్లాహు అక్బర్’ అని గట్టిగా అరుస్తూ ట్రక్కును వేగంగా పోనిచ్చాడు. దీంతో కొందరు ట్రక్కు కింద చిక్కుకుపోగా.. ప్రమాదాన్ని గుర్తించిన వారు సైకిళ్లు వదిలి పారిపోయారు. ట్రక్కు త్రీలైన్డ్ సైకిల్ లేన్‌లో ఆగకుండా దాదాపు అరకిలోమీటర్ వరకు సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయింది. దీంతో రోడ్డు పొడుగునా రక్తపు మరకలు భయానకంగా కనిపించాయి. ట్రక్కుతో పార్కింగ్‌లో ఉన్న స్కూలు బస్సును ఢీకొట్టి ఇద్దరు చిన్నారులు సహా పలువురు యువకులను గాయపరిచిన ఉన్మాది.. డమ్మీ తుపాకీ పట్టుకుని ట్రక్కునుంచి బయటకు దిగాడు. అప్రమత్తమైన పోలీసులు అతని కడుపులో కాల్చారు. దీంతో ఉన్మాది సైఫుల్లా కుప్పకూలిపోయాడు. ఆరుగురు ట్రక్కు వేగానికి సైకిల్ లేన్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనా వాసులు, ఓ బెల్జియన్ ఉన్నారు. మరో ఇద్దరి గుర్తింపు తెలియలేదని పోలీసులు తెలిపారు. గాయాలతో ఉన్న సైఫుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఆపరేషన్‌కు ముందే ఉగ్రవాదితో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు సమాచారం. విదేశీయులపై తనిఖీలు కఠినతరం: ట్రంప్ ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ‘పశ్చిమాసియాలో మరోచోట ఐసిస్ ఉగ్రవాదులను ఓడిస్తున్నాం. అది చాలు. వారిని మన దేశంలోకి రానివ్వం’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ‘న్యూయార్క్‌లో ఓ మానసిక ఉన్మాది మళ్లీ దారుణానికి ఒడిగట్టాడు. అధికారులు ఈ ఘటనను పరిశీలిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికాకు వస్తున్న విదేశీయుల గత చరిత్రను, ఇతర వివరాలను తనిఖీ చేసే ప్రక్రియను మరింత కఠినంగా జరపాలని ఆదేశించారు. మరింత కఠినంగా తనిఖీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంతాప సూచకంగా తన ట్వీటర్ అకౌంట్ బ్యానర్‌ను ‘న్యూయార్క్ స్కైలైన్’ అని మార్చారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో ట్రంప్ తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గ్రీన్ కార్డు లాటరీ విధానాన్ని రద్దు చేస్తానని అన్నారు. ‘ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఐసిస్ ఉగ్రవాది సైఫుల్లా డైవర్సిటీ లాటరీ విధానం ద్వారా అమెరికాకు వచ్చాడు. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రక్రియను నేను ప్రారంభించబోతున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సోనియా గాంధీ ఖండించారు. కాగా, బాధితుల్లో భారతీయులెవరూ లేరని అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. సైఫుల్లా నేరచరితుడే ‘హైవే నుంచి ఓ ట్రక్కు వేగంగా పాదచారులు, సైక్లిస్టుల లేన్‌లోకి దూసుకురావటం చూశాను. అదే వేగంగా చాలా మందిని ఈ ట్రక్కు ఢీకొంది. 9–10 సార్లు కాల్చిన శబ్దం కూడా వినిపించింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘అల్లాహు అక్బర్’ అని గట్టిగా అరుస్తూ ట్రక్కును వేగంగా పోనిచ్చాడని పలువురు తెలిపారు. ట్రక్కులో దొరికిన ఓ నోట్లోనూ ఐసిస్‌కు సంబంధించిన వివరాలున్నాయని తెలిసింది. పెల్లెట్ గన్, పెయింట్ బాల్ గన్లను కూడా ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 11 మందికి గాయాలయ్యాయన్న న్యూయార్క్ ఫైర్ కమిషనర్.. వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టేనని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన ఉన్మాది న్యూజెర్సీలోని పాటర్సన్ నుంచి వచ్చాడని తెలిసింది. మిస్సోరి, పెన్సిల్వేనియాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా సైఫుల్లాపై అభియోగాలు కూడా ఉన్నాయి. మృతదేహాలున్న ఘటనాస్థలి వద్ద దర్యాప్తు చేపట్టిన ఫోరెన్సిక్ నిపుణులు వేడుకలకొస్తే విషాదం వెక్కిరించింది వారంతా చిన్నతనం నుంచి స్నేహితులు. అర్జెంటీనాలోని రోజారియో పట్టణంలో పాలిటెక్నిక్ కలిసే చదువుకున్నారు. వీరంతా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పదిమంది మిత్రులు న్యూయార్క్‌లో సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వీరంతా కలిసిన సమయంలోనే ఉగ్రవాది సైఫుల్లా ట్రక్‌తో దూసుకొచ్చాడు. దీంతో వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో హెర్న్ మెండోజా, డీగో ఎన్రిక్, డామిన్ పాంగ్నుకో, ఏరియల్ ఎర్లిజ్, హెర్న్ ఫెర్రూచీలు మృతిచెందినట్లు అమెరికాలోని అర్జెంటీనా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఉగ్రదాడితో మిగిలిన మిత్రులంతా షాక్‌కు గురయ్యారు. న్యూయార్క్‌కు రాకముందు వీరంతా లిబ్రె (స్వేచ్ఛ) అని రాసున్న టీ–షర్ట్‌లో దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మృతుల్లో ఒకరైన ఎర్లిజ్.. న్యూయార్క్ టూర్‌కోసం ఆర్థికంగా ఇబ్బందులున్న ఇద్దరు మిత్రుల ఖర్చులను తానే భరించారు. -
గోల్డ్ ’గాడ్జిల్లా’
దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగిన (ఈ నెల 8-10 వరకు) ఆటోమోటివ్ పార్ట్స్ ఎగ్జిబిషన్ ‘ఆటోమెకానికా దుబాయ్-2016’లో ప్రదర్శించిన గోల్డ్ ప్లేటెడ్ కస్టమైజ్డ్ కారు ఇది. దీని పేరు ‘గాడ్జిల్లా’. ఇది నిస్సాన్ ఆర్35 జీటీ-ఆర్ కారు. ఇందులో 3.8 లీటరు వీ6 ట్విన్ టర్బో 545 హెచ్‌పీ ఇంజిన్, దుర్భేద్యమైన బాడీ, ప్రీమియం డిజైన్, పెడల్ షిఫ్టెడ్ సీక్వెన్షియల్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర దాదాపుగా రూ.6.5 కోట్లుగా ఉంది. -
జోయ్ అలుక్కాస్ కు ఐబీపీసీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యూఏఈ సాంస్కృతిక యువజన సామాజికాభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యన్ బిన్ మబరక్ అల్ నహ్యన్ చేతుల మీదుగా ఐబీపీసీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు-2016ను అందుకుంటున్న జోయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జోయ్ అలుక్కాస్. -
9/11 ఉగ్రరహస్యం
-
అమెరికన్లను వెంటాడుతున్న చేదు ఙ్ఞాపకం
-
‘డస్ట్ లేడీ’ వెళ్లిపోయింది...