దేశంలో ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లోని ఎత్తయిన భవనాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ దీపాల పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వెలుగులమయంగా మారింది. అమెరికాలోని అత్యంత ఎత్తైన భవనమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దీపావళి వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ లైట్లు ట్విన్ టవర్స్ అందాలను రెట్టింపు చేస్తున్నాయి. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు దీపోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు.
#WATCH दिवाली से पहले अमेरिका की सबसे ऊंची इमारत वन वर्ल्ड ट्रेड सेंटर को रंग-बिरंगी रोशनी से जगमग किया गया।
(सोर्स: इंडिया इन न्यूयॉर्क) pic.twitter.com/Z81Zd0rrtp— ANI_HindiNews (@AHindinews) October 30, 2024
2021లో తొలిసారిగా న్యూయార్క్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దీపావళి వేడుకలు జరిగాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. నాటి నుంచి ప్రతీయేటా దీపావళి నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను అందమైన లైట్లతో అలంకరిస్తున్నారు. ఈ వేడుకలు మత సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం
Comments
Please login to add a commentAdd a comment