celebrarions
-
వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు
దేశంలో ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లోని ఎత్తయిన భవనాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ దీపాల పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వెలుగులమయంగా మారింది. అమెరికాలోని అత్యంత ఎత్తైన భవనమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ లైట్లు ట్విన్ టవర్స్ అందాలను రెట్టింపు చేస్తున్నాయి. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు దీపోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. #WATCH दिवाली से पहले अमेरिका की सबसे ऊंची इमारत वन वर्ल्ड ट्रेड सेंटर को रंग-बिरंगी रोशनी से जगमग किया गया।(सोर्स: इंडिया इन न्यूयॉर्क) pic.twitter.com/Z81Zd0rrtp— ANI_HindiNews (@AHindinews) October 30, 20242021లో తొలిసారిగా న్యూయార్క్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వేడుకలు జరిగాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. నాటి నుంచి ప్రతీయేటా దీపావళి నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను అందమైన లైట్లతో అలంకరిస్తున్నారు. ఈ వేడుకలు మత సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం -
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్‌లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్‌లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్‌లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్‌లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
హీరోయిన్ మీనా బర్త్ డే వేడుకల్లో శరత్‌కుమార్.. ఫోటోలు వైరల్
-
Independence Day- 2024: అమరవీరులను గుర్తుచేసే ఆరు ప్రాంతాలు
1947, ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఆరోజు నుంచి ప్రతీయేటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం పలువురు సమరయోధులు పోరాటాలు సాగించారు. వీరి త్యాగానికి గుర్తుగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారకాలు ఉన్నాయి. ఇదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్మారకాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆగస్టు 15న ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తారు.1. కార్గిల్ వార్ మెమోరియల్ (లధాఖ్)పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైనవారి గౌరవార్థం 1990ల చివరలో భారత సైన్యం కార్గిల్ వార్ మెమోరియల్‌ని నిర్మించింది. ఈ స్మారక చిహ్నంపై యుద్ధంలో వీరమరణం పొందిన భారతీయ సైనికులందరి పేర్లను చెక్కారు.2. ఎర్రకోట (ఢిల్లీ)ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి ప్రసంగించారు.ఈ ఎర్రకోటను షాజహాన్ నిర్మించారు. ఎరుపు రంగు ఇసుకరాయితో నిర్మించినందున దీనికి ఎర్రకోట అని పేరు పెట్టారు.3. జలియన్ వాలా బాగ్ (అమృత్సర్)1919లో జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్ర్య సమరయోధులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎటువంటి హెచ్చరిక లేకుండా జనరల్ డయ్యర్ కాల్పులు జరపాలని ఆదేశించాడు. నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందల మంది అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం జలియన్‌వాలాబాగ్‌లో స్మారక చిహ్నం నిర్మించారు.4. ఇండియా గేట్(ఢిల్లీ)దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉన్న ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన 82 వేల మంది భారతీయ ఆర్మీ సైనికుల గౌరవార్థం నిర్మితమయ్యింది. ఈ అమరవీరుల పేర్లు ఇండియా గేట్ గోడలపై కనిపిస్తాయి.5. పోరుబందర్(గుజరాత్)గుజరాత్‌లోని పోర్బందర్ జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. కీర్తి మందిర్, మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని గాంధీ జీవితంతో పాటు ఆయన రచనలను వివరించే మ్యూజియంలుగా మార్చారు.6. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ (ప్రయాగ్‌రాజ్)1931లో చంద్రశేఖర్ ఆజాద్ ఈ ప్రయాగ్‌రాజ్ పార్కులో బ్రిటిష్ సైనికులతో పోరాడారు. అతను తన 25 ఏళ్ల వయస్సులోనే జీవితాన్ని త్యాగం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు, వారి తూటాలకు బలికావడం ఇష్టం లేక ఈ పార్కులో తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఈ పార్కులో చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం ఉంది. -
టీమిండియా విక్టరీ.. పూనకంతో ఊగిపోయిన టాలీవుడ్ హీరో!
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ప్రపంచకప్ విన్నింగ్ మూమెంట్‌ను ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.అయితే సినీతారలు సైతం విన్నింగ్ మూమెంట్ తనదైన స్టెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పూనకంతో ఊగిపోయారు. చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేస్తుండగా.. వరల్డ్ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు ట్విటర్లో పంచుకున్నారు. మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పలువురు అగ్రతారలు కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. Yahooooo! India! India! ❤️❤️❤️❤️ @ImRo45 🙏@imVkohli 🙏 What a memorable night @PDdancing anna ❤️❤️❤️ pic.twitter.com/k8q7WlmroL— Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2024 -
ట్రెండీ లుక్‌లో యషికా ఆనంద్..కూతురితో మంచు లక్ష్మి సెలబ్రేషన్స్!
ట్రెండీ లుక్‌లో యషిక ఆనంద్.. ఉగాది ఫెస్టివల్ మూడ్‌లో అతుల్య రవి... నభా నటేశ్ ట్రైడిషనల్ లుక్ వైరల్... గ్రీన్ డ్రెస్‌లో తేజస్విని గౌడ హోయలు.. కూతురితో మంచు లక్ష్మి ఉగాది సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!
టాప్ వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోవాలన్నా.. యంగ్లుక్తో మెరిసిపోవాలన్నా.. ఆధునికతతో జోడీ కట్టాలన్నా.. సంప్రదాయంతో జత చేరాలన్నా ..అన్నింటికీ ఒకే ఆన్సర్‌గా సమాధానం లెహంగా టాప్ అనేది నవతరం మాట. దానికి తగ్గట్టు ఇండోవెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోయే ఈ డిజైన్స్ రానున్న పెళ్లిళ్ల సీజన్‌కు మరింత వైవిధ్యంగా ముస్తాబై రానున్నాయి. ఏ పట్టు, జార్జెట్, బ్రొకేడ్... మెటీరియల్ ఏదైనా లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. దానిమీదకు ధరించే టాప్ మాత్రం కాలర్టైప్, పెప్లమ్, సింగిల్ షోల్డర్ .. వంటి డిజైన్స్ అయితే మోడర్న్‌గా ఆకట్టుకోవచ్చు. సంప్రదాయ వేడుకలకు ప్రత్యేక కళను తీసుకురావచ్చు. ఏ లెహంగా టాప్ ఒకే కలర్లో ఎంచుకున్నప్పుడు దానికి తగిన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్, మెటీరియల్‌ను బట్టి స్పెషల్‌గా క్రియేట్ చేయచ్చు. ఏ ప్లెయిన్ కాలర్ నెక్ టాప్ ఎంచుకున్నప్పుడు కొద్దిపాటి ఎంబ్రాయిడరీ డిజైన్‌తో మెరిపించవచ్చు. దీనికి ప్లెయిన్ లెహంగా లేదా ప్రింటెడ్ లెహంగా సరైన కాంబినేషన్ అవుతుంది. ఏ గ్రాండ్‌గా ఉన్న లెహంగాకి సింగిల్ షోల్డర్ కేప్ స్టైల్ టాప్ ప్రత్యేకతను తీసుకువస్తుంది. (చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!) -
26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 26, గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో నిఘా మరింతగా పెంచారు. ఢిల్లీలోని అన్ని కూడళ్లలో పోలీసులను మోహరించారు. వారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ దృష్ట్యా, జనవరి 26న ఢిల్లీ మెట్రో రాకపోకల సమయాలను మార్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపిన వివరాల ప్రకారం గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం నాలుగు గంటల నుండి మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రజలకు పరేడ్‌ను చూసే అవకాశం కల్పించేందుకు డీఎంఆర్సీ మెట్రో రాకపోకల్లో మార్పులు చేసింది. 26న ఉదయం 4 గంటల నుంచి అన్ని రూట్లలో మెట్రో అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ-టికెట్లు లేదా ఈ-ఇన్విటేషన్లు కలిగినవారికి ప్రత్యేక కూపన్లు జారీ చేయనున్నట్లు డిఎంఆర్సి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ సమాచారం తెలిపారు. ఈ కూపన్లు కలిగిన ప్రయాణికులు ‘కర్తవ్య పథ్’ వరకూ మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం కోసం ప్రయాణీకులు తమ ఈ-టికెట్, ఈ-ఇన్విటేషన్ లేదా ఫోటో గుర్తింపు కార్డును మెట్రో స్టేషన్‌లోని సంబంధిత కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. ఇదిలావుండగా రిపబ్లిక్ డే సందర్భంగా రాజధానిలోని పలు బస్సుల రూట్లను కూడా మార్చారు. జనవరి 26న విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్, తిలక్ మార్గ్-బహదూర్ షా జఫర్ మార్గ్-ఢిల్లీ గేట్-నేతాజీ సుభాష్ మార్గ్లలోకి ఎలాంటి వాహనాన్ని అనుమతించరు. Delhi Metro services to commence at 4:00 Am on 26th January. pic.twitter.com/DnK6Ak1sHh — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) January 24, 2024 -
మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
విజయవాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
ఉగ్రం మూవీ సక్సెస్ సెలబ్రేషన్...
-
ఉగాదికి తెలుగు లోగిళ్ల ముస్తాబు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా పాల్గొననున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.50 గంటల వరకు ఉగాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వివిధ వేద పాఠశాలల విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలుకుతారు. 10.42 గంటలకు పంచాంగ శ్రవణం అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉగాది క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులను సీఎం సన్మానించనున్నారని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అర్చకులు, వేద పండితులకు సన్మానం ఉగాది పండుగ సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులతో పాటు వేద పండితులను ఘనంగా సన్మానించనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో 62 ఏళ్లకు పైబడిన ముగ్గురు ఆర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతలకు రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలను కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు. ఇందుకు గాను దేవదాయ శాఖ ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. మరో వైపు రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఆ సమీపంలో ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే ఇద్దరు అర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని.. -
న్యూయార్క్‌లో ఆకట్టుకున్న రాజస్థానీ వేడుకలు
న్యూయార్క్ నగరంలో రాజస్థానీ నృత్యాలు, పాటలతో ప్రవాస భారతీయులు పరవశించిపోయారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను భారత కాన్సులేట్ అధికారులు 2022 ఫిబ్రవరి 21న న్యూయార్క్ నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్‌లో భాగంగా రాజస్థానీ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా లతా మంగేష్కర్ ఆలపించిన రాజస్థానీ గతంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వచ్చిన వారిని ఉద్దేశించి కౌన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్ ప్రసంగించారు. మాతృభాష గొప్పతనాన్ని సభికులకు వివరించారు. రాజస్థానీ సంగీతం , కళలు సంస్కృతి విశిష్టతలను ఎన్నారై జైపూర్ విభాగం తరఫున ప్రేమ్ భండారీ వివరించారు. గూంగర్ డ్యాన్సులతో, రాజస్థానీ పద్యాలతో వేడుకలు జరుగుతున్న ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమాన్ని కేవలం రాజస్థానీలకే పరిమితం చేయకుండా అమెరికాలో ఉన్న వివిధ రాష్ట్రాలు, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలను భాగస్వాములను చేశారు. భారత్‌కే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించారు. భారతీయ భాషల గొప్పదానాన్ని చాటిచెబుతూ కాన్సులేట్ అధికారులు ఇప్పటికే రాజస్థానీ, తమిళ్ భాషలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో మరో ఏడు భాషలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని వివరించారు. -
నాట్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
నేపెర్విల్లే: చికాగో: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేస్తూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగో దీపావళి వేడుకలు నిర్వహించింది. దాదాపు 300 మందికిపైగా తెలుగువారు చికాగోలోని నేపెర్విల్లే లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆట, పాట కార్యక్రమాలతో పాటు దీపావళి పటాసులు కాల్చి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. తర్వాత చక్కటి విందు కూడా నాట్స్ ఏర్పాటు చేశారు. చికాగోలో తెలుగువారందరిని ఒక్కటి చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంపై నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని చికాగో నాట్స్ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ సేవా కార్యక్రమాలతో పాటు అమెరికాలో తెలుగు వారందరిని ఓ కుటుంబంలా కలిపి ఉంచేందుకు చేస్తున్న కృషి గురించి వివరించారు. అమెరికాలో తెలుగుజాతి కోసం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని... నిస్వార్థంతో, సేవాభావంతో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలకు మంచి మద్దతు లభిస్తుందని నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే అన్నారు. చికాగో నుంచి నాట్స్ బోర్డ్, ఈసీ సభ్యులు మూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, విజయ్ వెనిగళ్ల, మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బొజ్జ తదితరులు సహకారంతో నాట్స్ చికాగో నాయకులు డా. వేణు కృష్ణార్ధుల, డాక్టర్ ప్రసుధ నున్న, బిందు వీధులమూడి, శ్రీహరీశ్ జమ్మల, కార్తీక్ మోదుకూరిలు దీపావళి వేడుకలను దిగ్విజయంగా నిర్వహించారు. బిందు బాలినేని, రోజా శీలంశెట్టి, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ బొప్పన్న, కృష్ణ నున్న, ఆర్.కె. బాలినేని, పండు చెంగలశెట్టి, వంశీ మన్నే, మురళి కలగర, అరవింద్ కోగంటి, రవి బాలినేని, మనోహర్ పాములపాటి, అరుల్ బాబు,యజ్నేష్, వినోద్ బాలగురు, అజయ్, శేఖర్ మిడతన, నవీన్ జరుగుల, రామ్ తూనుగుంట్ల, శ్రీనివాస్ పిల్ల, రాజేశ్ వీధులమూడి, శ్రీకాంత్ బొజ్జ, కిరణ్ అంబటి, శ్రీనివాస్ పిల్ల, వెంకట్ తోట తదితర నాట్స్ వాలంటీర్లు దీపావళి వేడుకల్లో తమ అమూల్యమైన సేవలు అందించినందుకు నాట్స్ జాతీయ నాయకత్వం వారిని ప్రత్యేకంగా అభినందించింది. -
సింగపూర్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జయ ప్రియ భారత జనయిత్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత భువనచంద్ర, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ దూర దేశాల్లో ఉన్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు పిల్లలు పెద్దలతో కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో నివసించే 32 మంది గాయనీ గాయకులు కవులు పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవాస భారతీయులు ఒక సాయంత్రం దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా కలసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో నేతలు,కార్యకర్తల సంబరాలు
-
అందుకే క్రిస్మస్ ట్రీకి వీటిని వేలాడదీస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి. క్రిస్మస్ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. క్రిస్మస్ చెట్టుకు క్రిస్మస్ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే క్రిస్మస్ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు. ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల నాన్నతో క్రిస్మస్ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్కు పిల్లలందరూ క్రిస్మస్ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ తాత వచ్చి వాటిలో క్రిస్మస్ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది. జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్ కార్డులు: 1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్ హెన్నీ కోల్ తన బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన. ఎప్పటికీ ఎండిపోని ఫిర్ చెట్టు(క్రిస్మస్ ట్రీ).. క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్ చెట్టును క్రిస్మస్ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్ ట్రీ డిమాండ్ పెరిగింది. అనంతరం జర్మన్ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది. చైనాలో అతిపెద్ద క్రిస్మస్ సిజన్ షాపింగ్ : క్రిస్మస్ సీజన్లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్ సీజన్ క్రిస్మస్ ముందు రోజే. క్రిస్మస్ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్ భాషలో యాపిల్ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ముందు రోజు ఉపవాసం: క్రిస్మస్ ముందు రోజైన డిసెంబర్ 24న రష్యన్ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు. - స్నేహలత (వెబ్ డెస్క్) -
స్వీట్ క్రిస్మస్
దట్టంగా మంచుకురిసే రాత్రి జీసస్ పుట్టాడు. ఎంత తీపి కబురు. అందరి నోరూ తీపి చేయాల్సిన కబురు. ఏం చేద్దాం. కేక్ చేద్దాం. ఏం కేక్. ప్లమ్ కేక్, రమ్ కేక్, చాక్లెట్ కేక్, మార్బుల్ కేక్... కేక్‌ల పండుగుల ఇది. ఒకరికి కేక్ పంచి సంతోషించే పండుగ. ఎప్పుడూ కొనడమేనా. ఈసారి చేయొచ్చుగా? ట్రిపుల్ లేయర్ చాకొలేట్ కేక్ ఈ కేకును తయారుచేయడం కొంచెం కష్టమే. కాని ఇది పూర్తయ్యాక చూసుకుంటే అలసట అంతా మరచిపోవచ్చు. ఇక తిన్నాక, నోటి నుంచి మాటలు రావు. అంత ఆనందంగా ఆస్వాదిస్తూ తింటారు ఈ కేక్‌ని. కావలసినవి: మొదటి లేయర్ కోసం: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు; బేకింగ్ పౌడర్ – ముప్పావు టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను, ఉప్పు – పావు టీ స్పూను; బటర్ – అర టీ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – అర టేబుల్ స్పూను; కోడి గుడ్లు – 2; బటర్ మిల్క్ – ముప్పావు కప్పు. బటర్ క్రీమ్ కోసం: పంచదార – ఒక కప్పు; కోడిగుడ్డు తెల్ల సొనలు – 4; నిమ్మరసం – అర టీ స్పూను; ఉప్పు – చిటికెడు; బటర్ – ఒక కప్పు. కుకీ డఫ్ లేయర్ కోసం: మొలాసెల్ – 2 టీ స్పూన్లు; చాకొలేట్ చిప్స్ – పావు కప్పు. ఓరియో లేయర్ కోసం: ఓరియో బిస్కెట్స్ (బ్రౌన్ కలర్) – 3 బ్రౌనీ లేయర్ కోసం: డచ్ ప్రోసెస్డ్ కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: బ్రౌనీ కుకీస్, ఓరియోలు (టాపింగ్ కోసం) – 2 టేబుల్ స్పూన్లు; గనాచే (కుకింగ్ చాకొలేట్ + పాలు కలిపి తయారుచేసినది) – 2 కప్పులు. తయారీ: ►350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ►తొమ్మిది అంగుళాల కేక్ పాన్‌ను బటర్, మైదాలతో గ్రీజ్ చేయాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ►మరొక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టి క్రీమ్ తయారుచేసుకోవాలి ►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేసి మరోమారు బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►మైదా పిండిలో సగ భాగాన్ని జత చేయాలి ►సగం బటర్ మిల్క్ జత చేసి గిలకొట్టాక, మిగిలిన మైదా పిండి, బటర్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►ఈ మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా విడదీసి, ఒక్కో లేయర్‌కు తీసుకున్న పదార్థాలను ఒక్కో దానికి విడివిడిగా జత చేయాలి ►కేక్‌పాన్‌లో ఒక లేయర్ తరవాత మరొక లేయర్కి కలుపుకున్న మిశ్రమాలను జాగ్రత్తగా వేసి, అవెన్‌లో ఉంచి సుమారు 35 నిమిషాలు బేక్ చేయాలి. బటర్ క్రీమ్ కోసం: ఒక సాస్పాన్లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙వేరొక పాత్రలో పంచదార, కోడిగుడ్డు తెల్ల సొన నిమ్మ రసం, ఉప్పు వేసి ఆ పాత్రను మరుగుతున్న నీళ్ల గిన్నెలో ఉంచాలి ∙పదార్థాలన్నీ వేడెక్కి, పంచదార కరిగేవరకు కలిపి దింపేసి, ఈ మిశ్రమాన్ని బటర్లో వేసి కొద్దిసేపు కలియబెట్టాలి (ఇలా చేయడం వల్ల మృదువుగా అయ్యి, కేక్ మీద సమానంగా వేయటానికి సులువుగా ఉంటుంది) ∙బేక్ చేసుకున్న కేక్ బేస్‌ను బయటకు తీసి, మొదటి లేయర్‌ను ఒక ప్లేట్లో ఉంచాలి ∙బటర్ క్రీమ్‌ను అర అంగుళం మందంలో మొదటి లేయర్ మీద సమానంగా పోయాలి ∙రెండవ లేయర్‌ను ఉంచి దాని మీద కూడా ఇదే విధంగా చేసి, మూడో లేయర్‌ను ఉంచాలి ∙గనాచేతో అలంకరించాలి ∙టాపింగ్స్ కోసం తీసుకున్న వాటిని కూడా జత చేయాలి. మార్బుల్ కేక్ ఈ కేక్‌కి తయారుచేసే బేస్‌ని చాకొలేట్ మార్బుల్ అంటారు. ఎవరి ఆలోచనకు వారు పదును పెట్టుకుని, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లేదా తాజా పండ్లు... బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఏవైనా సరే... బ్యాటర్‌కి జత చేస్తే – కేక్ కలర్ఫుల్గా వస్తుంది. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక కప్పు కంటె ఎక్కువ; ఉప్పు – చిటికెడు; బటర్ – అర కప్పు (సాల్టెడ్ బటర్ వాడుతుంటే ఉప్పును ఉపయోగించక్కర్లేదు); కోడి గుడ్లు – 2; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఫుడ్ కలర్ – చిటికెడు; పాలు – ఒక కప్పు; కోకో పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►కేక్ పాన్‌ను బటర్ తో గ్రీజ్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, బటర్, కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా గిలకొట్టాలి (అన్నీ కలిసి బాగా మెత్తగా అయ్యేవరకు గిలకొడితే కేక్ స్మూత్‌గా వస్తుంది) ►సగం కంటె ఎక్కువ భాగాన్ని కేక్ పాన్‌లో పోయాలి ►ఆ పైన వెనిలా ఎక్స్ట్రాక్ట్ను, ఫుడ్ కలర్ మిశ్రమం, కోకో పొడి ఒక దాని మీద ఒకటి పోయాలి ►చాకుతో కాని ఒక పుల్లతో కాని ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా సరిచేయాలి (మార్బుల్ ఎఫెక్ట్ వచ్చేలాగ) ►అవెన్‌లో ఉంచి సుమారు 40 నిమిషాలు బేక్ చేయాలి ►బయటకు తీసి చల్లారాక సర్వ్ చేయాలి. యూలే ద లాగ్ చాలామందికి ప్లమ్ కేక్, రమ్ కేక్ తెలుసు. మీరెప్పుడైనా యూలే ద లాగ్ కేక్ తయారుచేసుకున్నారా! ఇది చూడటానికి చెక్క దూలంలాగ ఉంటుంది. అందువల్ల ఈ కేక్‌ను చూడగానే సంతోషంతో పాటు సెలవును ఆస్వాదిస్తున్న భావన కూడా కలుగుతుంది. కావలసినవి: కేక్ కోసం: కోడి గుడ్లు – 6; పంచదార – ముప్పావు కప్పు; కోకో పొడి – అర కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను ఐసింగ్ కోసం: డార్క్ చాకొలేట్ తురుము – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; పంచదార – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సాఫ్ట్ బటర్ – ఒక కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూను. అలంకరించడం కోసం: 2 టేబుల్ స్పూన్ల పంచదార, పార్లే జి బిస్కెట్స్, ఎరుపు రంగు ఫుడ్ కలర్ (చెర్రీలు తయారుచేయడానికి); మెరింగ్ మష్రూమ్స్, చాకొలేట్ సాయిల్, క్రిస్మస్ ట్రీ పుల్లలు తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో కోడి గుడ్డు తెల్ల సొనలను వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►బాగా మెత్తగా అయిన తరవాత పావు కప్పు పంచదార కొద్దికొద్దిగా వేస్తూ మళ్లీ గిలకొడుతుండాలి ►వేరొక పాత్రలో కోడిగుడ్డు పచ్చ సొనలను వేసి పంచదార జత చేస్తూ గిలకొట్టాలి ►వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేయాలి ∙కోకో పొడిని జల్లెడ పట్టి, మెత్తటి పొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ గిలకొట్టాలి ►కోడి గుడ్డు తెల్ల సొన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా జత చేస్తూ, అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి (ఎంత ఎక్కువసేపు గిలకొడితే అంత మెత్తగా వస్తుంది కేక్) ►నలుచదరం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కేక్‌పాన్‌లో బేకింగ్ షీట్ లేదా ఫాయిల్ (కింద కొద్దిగా పంచదార వేస్తే కేక్ అతుక్కోకుండా తేలికగా వస్తుంది) ఉంచి, దాని మీద ఈ మిశ్రమాన్ని సమానంగా పరిచి, అవెన్‌లో ఉంచి, సుమారు 20 నిమిషాల పాటు బేక్ చేయాలి ►చల్లారిన తరవాత, జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఐసింగ్తయారీ: ►చాకొలేట్‌ను ముందుగా కరిగించాలి (మైక్రోవేవ్లోకాని వేడి నీళ్ల మీద కాని) ►ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టాలి ►కరిగించిన చాకొలేట్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేసి మెత్తగా వచ్చేవరకు కలుపుతుండాలి ►బాగా మెత్తగా అయిన తరవాత కేక్ మీద సమానంగా పరిచి, కేక్‌ను (ఫాయిల్‌తో) నెమ్మదిగా రోల్ చేయాలి (వదులుగా కాకుండా టైట్‌గా వచ్చేలా జాగ్రత్తగా రోల్ చేసి, చివరగా ప్రెస్ చేయాలి) ►అంచులను జాగ్రత్తగా కట్ చేయాలి ►మిగిలిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ►అంతే!!! అందమైన కేక్ సిద్ధమైనట్లే. సాల్టెడ్ క్యారమెల్ షీట్ కేక్ కావలసినవి: మైదా పిండి – రెండు కప్పుల కంటె కొద్దిగా ఎక్కువ; బటర్ – ఒక కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్ సుగర్ – ఒక కప్పు ; పెద్ద కోడిగుడ్లు – 2; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; తాజా పెరుగు – అర కప్పు; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; చిక్కటి పాలు (హోల్ మిల్క్) – ఒక కప్పు. తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►12 అంగుళాల చతురస్రాకారంలో ఉన్న కేక్ పాన్లను ముందుగా కొద్దిగా బటర్‌తో గ్రీజ్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా కలిపి, మెత్తగా వచ్చేవరకు గిలకొట్టాలి ►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పెరుగు జత చేసి మరోమారు గిలకొట్టాలి ►మరొక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి, సగ భాగాన్ని కోడి గుడ్డు మిశ్రమానికి జత చేయాలి ►అర కప్పు పాలు జత చేసి నెమ్మదిగా గిలకొట్టాలి ►మిగిలిన పిండిని జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా బీట్ చేయాలి ►ట్రేలో పోసి, అవెన్‌లో ఉంచి 25 నిమిషాల పాటు బేక్ చేయాలి ►బయటకు తీసి, చల్లారాక, సాల్టెడ్ కారమెల్ను పైన చల్లి అందించాలి. కేక్ పాప్స్ కావలసినవి: కేక్ పాప్స్ కోసం: పొడిపొడిగా మిగిలిపోయిన కేక్ (క్రంబ్ల్డ్ కేక్) – 2 కప్పులు; హెవీ క్రీమ్ – ఒక కప్పు కోటింగ్ కోసం: తగినంత డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్; తగినంత నట్స్ పొడి; కార్డ్బోర్డ్ బాక్స్. తయారీ: ►ఒక పాత్రలో క్రీమ్, క్రంబ్ల్డ్ కేక్ వేసి బాగా కలపాలి (ఈ పొడి కొద్దిగా ఎక్కువ ఉన్నా పరవాలేదు) ►రెండు అంగుళాల పరిమాణంలో బాల్స్‌లా చేతితో చేసి, పొడవాటి పుల్లలకు గుచ్చి, పక్కన పెట్టాలి ►డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్‌ను కరిగించాలి (ఒక మామూలు గిన్నెలో వీటిని ఉంచి, మరుగుతున్న గిన్నె మీద ఈ గిన్నె ఉంచి కరిగించాలి) ►కరుగుతున్న చాకొలేట్ లో కేక్ బాల్స్ పుల్లలను ముంచి, తీసేసి, కార్డ్ బోర్డు మీద ఉంచాలి ►నట్స్ పొడి చల్లాలి ►చల్లారాక అందించాలి (వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే నాలుగైదు రోజుల వరకు చెడి పోకుండా ఉంటాయి) -
డిమాండ్‌కు మించి ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: నదుల్లో వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొరతను అధిగమించడం, మాఫియాను అరికట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం కావడంతో నిర్మాణ రంగ పనులు ఊపందుకున్నాయి.వచ్చే ఐదేళ్లకు సరిపడా ఇసుక మేటలు నదుల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. అక్రమ తవ్వకాలు, అధిక ధరలకు విక్రయం లాంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ జీవో జారీ చేసింది. నూతన విధానం నేపథ్యంలో ఈనెల 14నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాల సందర్భంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఇసుక కొరత పరిష్కారమై ప్రస్తుతం స్టాక్ యార్డుల నిండా నిల్వలున్నాయి. అధిక ధరలకు కళ్లెం రివర్స్ టెండర్ల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రేవుల నుంచి ఇసుక డిపోల దూరాన్ని బట్టి రవాణా చార్జీలను లెక్కించారు. ప్రాంతాలవారీగా ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రకటించారు. ఫలితంగా ప్రధాన నగరాల్లో ఇసుక ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఫుల్ ‘స్టాక్!’ ఇసుక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈనెల 14వ తేదీన 1.61 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులకు చేరింది. వారోత్సవాల ముగింపు రోజైన గురువారం ఏకంగా 2.82 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉండటం గమనార్హం. ఫిర్యాదుల కోసం 14500 అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా 35కిపైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టారు. తొలిరోజే లక్ష్యాన్ని అధిగమించి... రాష్ట్రంలో రోజువారీ ఇసుక డిమాండ్ గరిష్టంగా 80 వేల టన్నులు కాగా వారోత్సవాల మొదటి రోజే ఈ లక్ష్యాన్ని అధిగమించడం విశేషం. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు కొత్తగా 17 రీచ్‌లను ప్రారంభించారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు 12 పట్టా భూముల్లో అనుమతులు మంజూరు చేశారు. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని జలాశయాల్లో మేట వేసిన ఇసుకను వెలికి తీసేందుకు రెండు చోట్ల అనుమతులిచ్చారు. 13 జిల్లాల పరిధిలో అదనంగా 34 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
108 అడుగుల స్తంభంపై జాతీయ జెండా
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లాకు గుర్తింపులా 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 20 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు ఉన్న ఈ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ గురువారం ఆవిష్కరించారు. ఎయిర్‌పోర్టులు, మరికొన్ని ప్రధాన నగరాల్లో కనిపించే పొడవైన స్తంభాలపై జాతీయ జెండాను తొలిసారిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కలెక్టరు నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో రూ.12.50 లక్షలు వ్యయం చేసి 108 అడుగులు పొడువు ఉండే స్తంభాన్ని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో గ్యాలవైజ్డ్ ఇనుముతో తయారు చేయించారు. బుధవారం ఆ స్తంభాన్ని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాన్ని గురువారం ఆవిష్కరించడం సంతోషమన్నారు. గుంటూరు తర్వాత విజయనగరంలోనే ఇంత పెద్ద జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జెండా ఆవిష్కరించిన కలెక్టర్.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆవిష్కరించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన తర్వాత వందనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థతో సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో వెంకటరావు, విజయనగరం ఆర్డీఓ జెవి.మురళి, ఇతరులు పాల్గొన్నారు. రక్షాబంధన్ వేడుకలు.. రక్షాబంధన్ సందర్భంగా కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌కు పలువురు మహిళలు రాఖీ కట్టి సోదర భావాన్ని తెలిపారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అగ్రగామిగా విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే రోజు ల్లో జిల్లాను పూర్తి సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ∙ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలనే గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వ సాలన సాగుతోందని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, ప్రస్తుతం ఉన్నవాటిని ఆధునికీకరిస్తామని తెలిపారు. త్యాగధనుల ఆశయసాధనకు కృషి: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది నిస్వార్ధ పోరాటం చేశారని, వారి త్యాగాలను మనం ఎన్నటికీ మరువలేమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మొదలుకొని మన ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో నేతలు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అర్పించారనీ, అలాంటి సమర యోధులందరికీ శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు తెలిపా రు. వారి ఆశయాల సాధన కోసం పునరంకితం కావా లని కోరారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజల్లో దేశభక్తి భావాలు పెంపొందించే రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు నడయాడిన నేల అని, వ్యవహారిక భాషకు పట్టంకట్టిన గిడుగు రామమూర్తి, హరికథ ద్వారా జిల్లా పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన ఆదిభట్ల నారాయణ దాసు వంటి ఎందరో మహనీయులకు పురిటిగడ్డయిన ఈ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి: జిల్లా ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ, అనుబంధ రంగాల అభివద్ధికి తోడ్పాటు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, మరికొన్ని ప్రాజెక్టులను ఆధునికీకరించి పూర్తి సామర్థ్యంతో నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించే పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అదనపు ఆయకట్టుకు సాగునీటి వసతుల కల్పనలో భాగంగా 62 పెద్ద చెరువులను మరమ్మతు చేయనున్నట్టు చెప్పారు. దాదాపు రూ.210 కోట్లతో ఈ ఏడాది నుంచి వ్యవసాయరంగ అభివృద్ధితో పాటు ఉద్యాన పంటల విస్తరణకు ప్రోత్సాహం, మత్స్య పరిశ్రమ అభివద్ధికి తోడ్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చేయూతనిస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమీకృత సాగునీరు– వ్యవసాయ పరివర్తన పథకం, నీటిపారుదల– జీవనోపాధుల అభివృద్ధి పథకం పేరుతో ఈ కార్యక్రమాలు ఈ ఏడాది నుండి అమలు కానున్నాయని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా రైతులు గౌరవప్రదమైన స్థానంలో నిలిచేలా ప్రస్తుత ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రకృతివ్యవసాయంవైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 37 వేల మంది రైతుల ద్వారా 40వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 61 వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, విత్తనాలు రాయితీపై సరఫరా చేశామని, బ్యాంకుల ద్వారా రూ.1446కోట్ల పంట రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని ఇప్పటి వరకూ రూ. 571 కోట్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 15 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు మంజూరు చేసినట్లు వివరించారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట: జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ, విద్య, వైద్యంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నామని వివరించారు. గిరిజనులకోసం మంజూరైన విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మన జిల్లాలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలన్నీ వంద శాతం గిరిజన యువతకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించటంతో పాటు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు భోజన, వసతి సదుపాయాల నిమిత్తం ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి జిల్లాలో రెండు చోట్ల గర్భిణుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. పాఠశాలల మెరుగుకు చర్యలు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు మెరుగు పరచి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయన్నారు. సంక్షేమ వసతి గృహాలలో పరిస్థితులు మెరుగు పరుస్తామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతుకోసం జిల్లాకు రూ.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తూ బడ్జెట్లో రూ.66 కోట్లు కేటాయించారన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ నుంచి వైఎస్సార్ రైతు భరోసా: రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ళకు పెట్టుబడి సహాయంగా రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచే ఈ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతుల దరఫున ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తుందని, రైతులకు వడ్డీలేని పంట రుణాలు అందించడంతో పాటు వారికి ప్రభుత్వమే ఉచితంగా బోర్లు కూడా వేయిస్తుందన్నారు. ఆరోగ్యపరిరక్షణలో భాగంగా కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నామన్నారు. బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలువనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 9 వేల మంది ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 45 ఏళ్ల వయస్సు కలిగిన డ్వాక్రా సభ్యులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు ఏడాదికి రూ. 15 వేలు సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 3 లక్షల 5 వేల మందికి ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. మద్యం నిషేధానికి అడుగులు: మద్యం రక్కసిని తరిమి కొట్టాలని ప్రభుత్వం భావి స్తోందనీ, దీనిని దశలవారీగా అమలు చేసేందుకు బెల్ట్ షాపులు మూసివేయిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అక్టోబర్నుంచి ప్రజలదగ్గరికే పథకాలు వస్తాయన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అందుబాటులోకి వస్తోందన్నారు. విజయనగరాన్ని సుందర వనంగా, హరిత నగరంగా చేయాలనే కలెక్టర్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి, నీటి సరఫరా వంటి పనులను రూ.110 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి తోడ్పాటు నందించా లని కోరారు. -
స్త్రీ మూర్తికి ‘కళాత్మక’ అభినందన
సాక్షి, నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహపురికి చెందిన కళాకారులు తమ భావాలను కళారూపంలో వ్యక్తీకరించారు. సందేశాత్మకంగా మహిళలకు స్ఫూర్తినిస్తూ కళాభివందనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని మూలాపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్ కోకకోలా శీతలపానీయం డబ్బా పై పిడికిలి బిగించి, జై కొడుతున్న మహిళ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. మహిళలు ఏ రంగంలో తీసిపోరని, సమాజంలో మహిళాసాధికారత సాధించాలని కాంక్షిస్తూ రెండు గంటల సమయంలో స్త్రీ మూర్తి రూపాన్ని తీర్చిదిద్దానన్నారు. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌కు చెందిన కార్పెంటర్ శ్రీనివాసులు తన వృత్తి నైపుణ్యంతో 8 అంగుళాల ఎత్తు, రెండున్నర అంగుళాల వెడల్పు ఉన్న కొయ్య ముక్కపై స్త్రీ రూపాన్ని రెండు గంటల సమయంలో తీర్చిదిద్దారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని కాంక్షించారు. ముత్తుకూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని నారికేళపల్లి పంచాయతీ సుబ్బారెడ్డిపాళెం యూపీ స్కూల్ తెలుగు పండిట్ సోమా పద్మారత్నం గురువారం సీసాలో ‘జాగృతి మహిళ’ చిత్రాన్ని నిక్షిప్తం చేశారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి తన కళారూపం ద్వారా అభినందనలు తెలిపారు. నెల్లూరుకు చెందిన సూక్ష్మరూప చిత్ర కళాకారుడు వెంకటశేషగిరిరావు చిన్న రబ్బర్ ముక్క(ఎరేజర్)పై అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పుతో కలర్ పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు. రెండు గంటల పాటు శ్రమించి చిత్రానికి రూపమిచ్చానని చెప్పారు. సుద్ద ముక్కపై మహిళకు సూక్ష్మరూపం అనుమసముద్రంపేట: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఎస్‌పేట మండలంలోని హసనాపురం ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు పార్థసారథి సుద్ద ముక్కపై కూర్చున్న మహిళ ఆకృతిని తయారు చేశారు. ఒక మహిళ దుఃఖిస్తూ, ప్రాధేయపడుతూ దేశంలో ఉన్న మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్న అర్థం తెలిపేలా ఈ సూక్ష్మరూపాన్ని చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా చాక్‌పీసులతో ఈ బొమ్మను తయారు చేశారు. -
వేడుకలకు రెడీ..
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి సంస్థ 130వ ఆవిర్భావ వేడుకల సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ శ్రీధర్ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి పలు విషయాలను జీఎం (వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్) కె.బసవయ్య శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతుండగా, సెంట్రల్ ఫంక్షన్ మాత్రం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్నాం. ఈ వేడుకకు సింగరేణి సీఎండీ శ్రీధర్ హాజరు కానున్నారు. సంస్థ పురోభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎండీని ఆహ్వానించేందుకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 8:30 గంటలకు సింగరేణి కేంద్ర కార్యాలయం నుంచి 2 కె రన్ ప్రారంభం అవుతుంది. ప్రకాశం స్టేడియం వరకు ఈ రన్ కొనసాగుతుంది. కార్యక్రమంలో అందరు డైరక్టర్లు, అధికారులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొంటారు. 9:30 గంటలకు సీఎండీ స్టేడియానికి చేరుకుని సింగరేణి జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రకాశం స్టేడియంలో మొత్తం 13 విభాగాలకు సంబంధించిన 18 స్టాల్స్ ఏర్పాటు చేశాం. సాయంత్రం 7 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. సినీ, టీవీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సినీ గాయకుడు యాసిన్నిజార్, స్వాతి, శృతిల సంగీత విభావరి, క్రాంతినారాయణ్, సీతాప్రసాద్ బృందా లతో శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఉంటాయి. జబర్దస్త్ ఫేమ్ సుధాకర్ కామెడీ ఉంటాయి. 7గంటల నుంచి 7:30 వరకు బహుమతి ప్రదానం ఉంటుంది. ఆర్జీ–1 ఏరియా లోని జీడీకే–11 ఉత్తమ కంటి న్యూయస్ మైనర్‌గా ప్రథమ బహుమతి సాధించింది. ఆర్జీ–2 ఏరియాలోని ఓసీ–3 ప్రథమ, ఎస్డీఎల్స్ విభాగంలో మందమర్రి ఏరియాలోని కేకే–1 కు ప్రథమ, ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5కు ఎల్‌హెచ్‌డీ విభాగంలో ప్రథమ బహుమతులు వచ్చాయి. వీటిని సీఎండీ ప్రదానం చేస్తారు. -
వైఎస్ ఆశయసాధనే లక్ష్యం
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మన్యంలో వాడవాడలా ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ నాయకులు వితరణతో అంజలి ఘటించారు. పేదలకు దుప్పట్లు, యువకులకు వాలీబాల్ కిట్లు, రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మన్యానికి చేసిన మేలు మరువలేనిదని, ఆయన ఆశయసాధనే వైఎస్సార్సీపీ లక్ష్యమని పాడేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఆదివారం పాడేరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో వైఎస్సార్సీపీ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అలాగే వైఎస్ విగ్రహానికి భాగ్యలక్ష్మితోపాటు మండల పార్టీ అధ్యక్షుడు కూడా సింహాచలం, వైఎస్సార్సీపీ నాయకులు కె.వి. సురేష్‌కుమార్, విశ్వ, డాక్టర్ నర్సింగరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు వైఎస్ ఎనలేని సేవలందించి, చిరస్మరణీయుడుగా నిలిచారని కొనియాడారు. వైఎస్ స్పూర్తి తో ఆదివాసీల అభ్యున్నతికోసం వైఎస్సార్సీపీ నిత్యం కృషి చేస్తుందనిన్నారు. అనంతరం ఆమె 25 మంది వృద్ధ మహిళలకు దుప్పట్లు, వివిధ గ్రామాలకు చెందిన యువక్రీడాకారులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీల ఘన నివాళి పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని వైఎస్సార్సీపీ నా యకులు, కార్యకర్తలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పాడేరులోని అంబేడ్కర్ సెం టర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మండలంలోని లింగాపుట్టు గ్రామంలో ఉన్న వైఎస్ విగ్రహానికి మాజీ ఎంపీపీలు ఎం.వి.గంగరాజు, ఎస్వీవీ రమణమూర్తి, వండ్లాబు మత్స్యకొండం నాయుడు, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి సతకా బుల్లిబాబు, సొల భం సర్పంచ్ ఐసరం హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్భంగా వారు వైఎస్సార్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మండల మహిళా అధ్యక్షురాలు లకే రత్నాభాయి, గబ్బాడి శేఖర్ పాల్గొన్నారు. ఆ వృక్ష ఛాయలో... పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత పాడేరు సందర్శించినప్పుడు నాటిన మొక్క వద్ద ఆయన చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు నివాళులు అర్పించారు. రానున్నది రాజన్న రాజ్యం చింతపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ సభ్యురాలు కంకిపాటి పద్మకుమారి అన్నారు. ఆది వారం ఆమె నివాసంలో దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాతబస్‌స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్‌చేసి, దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. అన్న సమారాధన నిర్వహించారు. బెన్నవరం పంచాయతీకి చెందిన సుమారు వంద మంది గిరిజనులు పార్టీలో చేరారు. జి.మాడుగుల మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, మం డల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ, సర్పంచ్‌లు సుండ్రు నాగజ్యోతి, కొర్రా రఘునాథ్, మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణారావు, అరుకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బుల్లిబాబు, జీకే వీధి నాయకులు గొర్లె కోటేశ్వరరావు, అడపా విష్ణుమూర్తి, సీనియర్‌నాయకులు గోవర్ధన్‌గిరి, ఎంపీటీసీలు సోమరత్నం, ఈశ్వరి పాల్గొన్నారు. జగన్‌తోనే పేదల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ అరుకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ అన్నారు. అంతర్లలోని చిన్న పిల్లల ఆశ్రమంలో వైఎస్ జయం తిని నిర్వహించారు. పిల్లతో కేక్‌కట్ చేయించారు. స్వామి , కిట్లం గిరాంబాబు, మామిడిగోవింద్,రామారావు, రాంకీ,కిరణ్,మంజు, బాబి,వెంకటట్పాల్గొన్నారు. కొయ్యూరు మండలంలో... కొయ్యూరు: రాజశేఖరరెడ్డికి మండల ప్రజలు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ, మండల యువజన సంఘం అధ్యక్షుడు జల్లి హుస్సేన్,మహిళా విభా గం అధ్యక్షురాలు జె.రాజులమ్మ,నేతలు వారా నూకరాజు, లోకుల సోమాగాంధీ నల్లగొండలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జి.మాడుగులలో.. జి.మాడుగుల: దివంగత ముఖ్యమంత్రి, రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంపీపీ పాడేరు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ నాయకులు మత్స్యరాస వెంకటగంగరాజు, న్యాయవాది ఎం విశ్వేశ్వరరాజు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో వెంకటగంగరాజు, గ్రంథాలయ ఆవరణ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కుడుమల సత్యనారాయణ, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం మత్స్యరాజు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పీహెచ్‌సీలోని రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఐసరం హనుమంతరావు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి సతక బుల్లిబాబు, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.మత్స్యరాజు, మాజీ ఎంపీపీలు మత్స్యకొండం నాయుడు, ఎస్వి రమణమూర్తి, పాడేరు మండల మహిళా అధ్యక్షురాలు లకే రత్నమాంబ, వైఎస్సార్సీపీ నాయకులు బాలయ్యదొర, శేఖర్,సోమలింగం, రాంబాబు, బాబూరావు, పెదబంగా రాజు,నర్సిమూర్తి,రాజారావు, పండుబాబు, కొండబాబు, పాతుని రాములు, రామన్నదొర, మత్స్యకొండబాబు పాల్గొన్నారు. జీకే వీధిలో.. గూడెంకొత్తవీధి: వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ మండల యూత్ ప్రెసిడెంట్ కుందరి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. జర్రెల ఎంపీటీసీ ఉగ్రంగి జగ్గమ్మ, బొబ్బిలి లక్ష్మణ్, జి.గోవిందరాజు, కె.ప్రసాద్, కె.శ్రీరాములు, ఉగ్రింగి ప్రసాద్, మండల మహిళ అధ్యక్షురాలు లింగేశ్వరమ్మ, సాగిన సత్తిబాబు పాల్గొన్నారు. జర్రెల పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ విజయకుమారి పేద గిరిజ న మహిళలకు చీరలు, రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. వంచెల సర్పంచ్ కాంతమ్మ, విష్ణుమూర్తి, రాజేష్, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆటా డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ భానుశ్రీ ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి అందరిని అలరించారు. ఆటా టీం హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది. వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్), సుశీల్ చంద్రా ( స్టాండింగ్ కమిటి, కో-చైర్), కిషోర్ రెడ్డి గుడూర్, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమ్యూనిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు హజరయ్యారు.