అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ భానుశ్రీ ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి అందరిని అలరించారు. ఆటా టీం హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది.
వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్), సుశీల్ చంద్రా ( స్టాండింగ్ కమిటి, కో-చైర్), కిషోర్ రెడ్డి గుడూర్, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమ్యూనిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment