telugu convention
-
ఘనంగా ఆటా డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ భానుశ్రీ ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి అందరిని అలరించారు. ఆటా టీం హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది. వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్), సుశీల్ చంద్రా ( స్టాండింగ్ కమిటి, కో-చైర్), కిషోర్ రెడ్డి గుడూర్, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమ్యూనిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు హజరయ్యారు. -
నాటా తెలుగుసభల్లో కోటి సంగీత విభావరి
అమెరికాలోని డల్లాస్లో నాటా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే సంగీత విభావరిలో స్థానిక డల్లాస్ కళాకారులతో పాటు , సినీ సంగీత దర్శకులు, గాయకులు, గాయనీమణులు కూడా పాల్గొంటున్నారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు తమ పాటలను వినిపిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను సాంస్కృతిక కార్యక్రమాల విభాగం నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి దర్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి తదితరులు మహాసభల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.