అమెరికాలోని డల్లాస్‌లో నాటా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే సంగీత విభావరిలో స్థానిక డల్లాస్ కళాకారులతో పాటు , సినీ సంగీత దర్శకులు, గాయకులు, గాయనీమణులు కూడా పాల్గొంటున్నారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు తమ పాటలను వినిపిస్తారు.
ఈ కార్యక్రమాల ఏర్పాట్లను సాంస్కృతిక కార్యక్రమాల విభాగం నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి దర్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి తదితరులు మహాసభల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.
నాటా తెలుగుసభల్లో కోటి సంగీత విభావరి
Published Wed, May 25 2016 3:58 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement