న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.
విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్‌లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.
ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది.
మారిషస్: మారిషస్‌లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.
నేపాల్: నేపాల్‌లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.
శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.
సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్‌లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు.
ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment