
సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జయ ప్రియ భారత జనయిత్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత భువనచంద్ర, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ దూర దేశాల్లో ఉన్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు పిల్లలు పెద్దలతో కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో నివసించే 32 మంది గాయనీ గాయకులు కవులు పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు.
కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవాస భారతీయులు ఒక సాయంత్రం దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా కలసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment