Bhuvanachandra
-
130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ..
అనంతపురం: అతివేగం ఇద్దరిని బలిగొంది. కరిడికొండ శివారు 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరొకరు చిరు వ్యాపారి ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని కళాకారుల కాలనీకి చెందిన మల్లికార్జున, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్న కొడుకు కురువ భువనచంద్ర (29) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితుడి బుల్లెట్ బైక్ తీసుకుని అనంతపురం బయల్దేరాడు. ఆటోలో పల్లెలు తిరుగుతూ స్టీలుసామాన్లు, మిక్సీలు విక్రయిస్తూ జీవనం సాగించే బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన సలార్‌బాషా (55) అర్ధరాత్రి వేళ గుత్తి మండలం కరిడికొండ జాతీయ రహదారి సమీపంలో ఆగాడు. ఇటు వైపు నుంచి అటువైపు ఉన్న ధాబా వద్దకు వెళ్లేందుకని నడుచుకుంటూ రోడ్డు డివైడర్‌పైకి చేరుకున్నాడు. అక్కడ చెట్ల మధ్య నుంచి కిందకు కాలు పెట్టగానే అల్లంత దూరాన 130 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై వస్తున్న భువనచంద్ర వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్ ఢీకొని సలార్‌బాషా వంద అడుగుల దూరం ఎగిరి కిందపడగా.. భువన చంద్ర 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడ్డాడు. స్థానికులు ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. అచేతనావస్థలో ఉన్న ఇద్దరినీ గుత్తి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో సలార్బాషాకు భార్య రషీదా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనచంద్ర అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న బైక్ రేసర్ల ఆగడాలు.. గుత్తి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ రేసర్లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య శని, ఆదివారాల్లో వందలాదిమంది బైక్ రేసర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 250 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం కలిగిన బుల్లెట్, హోండా, యమహా బైక్‌లను రేసర్లు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లాలని బెట్టింగ్ వేసుకుని.. వేగంతో పోటీపడుతూ వారితో పాటు ఇతరులనూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు నిఘా ఉంచి బైక్ రేసర్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
సింగపూర్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జయ ప్రియ భారత జనయిత్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత భువనచంద్ర, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ దూర దేశాల్లో ఉన్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు పిల్లలు పెద్దలతో కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో నివసించే 32 మంది గాయనీ గాయకులు కవులు పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవాస భారతీయులు ఒక సాయంత్రం దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా కలసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీశ్రీ
తిరుపతి కల్చరల్ : తన రచనలతో జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం శ్రీశ్రీ స్వీయ దస్తూరితో రాసిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీశ్రీతో తనకున్న అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్థానం గీతాలను ఆలపించారు. శ్రీశ్రీ రచనలు జన హృదయాలను ప్రభావితం చేసేలా సాగాయన్నారు. చలం చెప్పినట్లు శ్రీశ్రీ కవిత్వం తెలుగు జాతిని ఊగించి, శాసించి, లాలించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తిరుపతితో పాటు వ్యక్తిగతంగా శ్రీశ్రీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన సోదరుడు భూమన కారణంగా శ్రీశ్రీ ప్రభావం తనపై పడిందన్నారు. ఆయనతో ఉన్న తనకున్న అనుభవాలను, మధురస్మతులను పంచుకుననారు. చిన్ననాటి నుంచి ఆయన రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. కలాన్ని జయించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీరంగం కవిత్వం చదవని వారు రచయితలే కాదని నమ్ముతున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీవారు అయితే ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచనకు ఆధ్యుడు శ్రీశ్రీనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన అక్షర విలువను ఎంచడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని సిరులు వెళ్లినా శ్రీశ్రీ మాత్రం మననుంచి వదలి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అద్భుత కవితల ప్రవకర్త శ్రీశ్రీ అని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి నేల మీదకు దింపారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కళాపోషకుడిగా తెలుగు వైభవాన్ని చాటిన ఘనుడని కొనియాడారు. తన బిడ్డకు రాజకీయ వారసత్వంతో పాటు సాంస్కతిక వారసత్వాన్ని అందించారన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి, యువతరానికి శ్రీశ్రీ రచనలు ఓ చైతన్య దీపికలుగా నిలుస్తాయన్నారు. అంతటి మహనీయుడు రచించిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం మహద్భాగ్యమని తెలిపారు. పుస్తక ప్రచురణ కర్తకు రూ.20 వేలు బహుమతిగా అందజేశారు. పుస్తకావిష్కరణ చేసిన అభినయ్ రెడ్డి తిరుపతి నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేతుల మీదుగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడికి, రెండో ప్రతిని విశ్రాంత ప్రిన్సిపల్ పెద్ది సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్ మేయర్ శిరీషా, మానవ వికాస వేదిక కనీ్వనర్లు సాకం నాగరాజు, శైలకుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి చేతిరాత నిపుణుడిగా భువనచంద్ర
భవానీపురం (విజయవాడ పశ్చిమ): భారతదేశంలో అందమైన దస్తూరి నేర్పే 36 మంది చేతిరాత నిపుణుల్లో ఒకరిగా విజయవాడకు చెందిన పి.భువనచంద్ర ఎంపికయ్యారు. సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపిన ఉత్తర్వులు ఇటీవల తనకు వచ్చాయని భువనచంద్ర శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. తనను ‘ప్రొఫెసర్ ఇన్ కేలిగ్రాఫీ ఆల్ ఓవర్ ఇండియా’గా సిఫార్సు చేస్తూ నియమించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ ఎస్.వరదరాజన్ తనను ప్రశంసిస్తూ రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ ఇచ్చేందుకు సిఫార్సు చేస్తూ ఈ ఏడాది జూన్ 14వ తేదీన ఒక లేఖ తనకు పంపించారని వెల్లడించారు. -
భువనచంద్రకు డాక్టరేట్
ప్రదానం చేసిన అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ సంస్థ సాహిత్య సేవకు గాను అందజేత చింతలపూడి : మారుమూల పల్లె నుంచి ప్రసిద్ధ సినీ గేయ రచయితగా ఎదగడమే కాక సాహిత్యంలోనూ తన ప్రతిభ చూపుతున్న మెట్ట ఆణిముత్యం భువనచంద్రకు అరుదైన గౌరవం దక్కింది. కర్నాటకలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఈ నెల 11న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ విషయాన్ని చింతలపూడి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లంశెట్టి సత్యనారాయణ గురువారం విలేకరులకు తెలిపారు. డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. విద్యాభ్యాసం అంతా చింతలపూడిలోనే.. పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడికి చెందిన ఊరకరణం గుర్రాజు(భువనచంద్ర) సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా సినీ మాటల రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా కూడా రాణిస్తున్నారు. ఆయన రచించిన ‘వాళ్లు’ అనే ఆధ్యాత్మిక నవల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భువనచంద్ర రచించిన అనేక కథలు స్వాతి, నవ్య వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి. భువనచంద్ర పుట్టింది కృష్ణాజిల్లా గుళ్లపూడి గ్రామంలో. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, చంద్రమౌళీశ్వరీదేవి. భువనచంద్రకు రెండేళ్ల వయస్సులో కుటుంబంతో సహా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన విద్యాభ్యాసం చింతలపూడిలోనే సాగింది. సైనికులకు అంకితం ఇస్తున్నా.. డాక్టరేట్ రావడం సంతోషంగా ఉంది. అయితే నేనెప్పుడూ అవార్డుల కోసం ఏదీ రాయలేదు. అవార్డు అనేది ఒక అలంకారం మాత్రమే. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి బోర్డర్లో కాపు కాస్తున్న సైనికులే కారణం. ఒక సినిమా రచయితగా కాకుండా సైనికుడికి ఇచ్చిన గౌరవంగా నాకు అందిన డాక్టరేట్‌ను భావిస్తున్నాను. అందుకే అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ ఇచ్చిన డాక్టరేట్‌ను 18 ఏళ్లు సైనికుడిగా పని చేసిన నేను భారత సైనికులకు అంకితమిస్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, లైబ్రరీలో నేను ఎక్కువ పుస్తకాలు చదివి ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన లైబ్రేరియన్ దాశరథి, మేడుకొండూరి రామకృష్ణలకు కృతజ్ఞతలు. వచ్చేనెలలో మరో నాలుగు పుస్తకాలు ఎమ్మెస్కో వారు విడుదల చేస్తున్నారు. వాటిలో చింతలపూడి ఆశ్రమానికి చెందిన శ్రీ బోధ, బోధానందామృతం నవలలు కాగా, మిగిలిన రెండు పుస్తకాలు కథా సంపుటాలు. ఆశ్రమంలో నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు, స్వామీజీ చెప్పిన మంచి మాటలను ఈ పుస్తకాల్లో పొందు పరిచాను. భావి తరాలకు ఈ పుస్తకాలు మార్గదర్శకమవుతాయి. -భువనచంద్ర, ప్రసిద్ధ సినీ గేయ రచయిత -
పాటల చంద్రుడు!
-
నాలో ఎన్నో... ప్రశ్నలు రేపిన రాత్రి!
నిద్రలేని రాత్రులు అది 1971వ సంవత్సరం. నేను అప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నాను. అప్పటికి మూడేళ్ల క్రితమే నేనా ఉద్యోగంలో చేరాను. కానీ ఆ ఉద్యోగం నాకు ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని మిగులుస్తుందని నేనప్పుడు ఊహించలేదు. ఇండియా, పాకిస్తాన్ల మధ్య పద్నాలుగు రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. దేశం తరఫున అందరం శాయశక్తులా పోరాడాం. చివరికి సంధి కుదిరింది. యుద్ధం ఆగిపోయింది. ఆ రోజు రాత్రి నేను బిల్లెట్లో (బిల్లెట్ అంటే విపత్కర సమయాల్లో సైనికులు ఉండే తాత్కాలిక నివాసం) పడుకుని ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. నిద్రించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ బిల్లెట్లోని ఓ మూలకి చూశాను. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అక్కడ నా స్నేహితుడు నారాయణన్ ఉండాలి. కానీ లేడు. ఏదో దిగులు కమ్మేసింది నన్ను. నారాయణన్ తమిళనాడుకు చెందినవాడు. మరో ఐదు రోజుల్లో అతని పెళ్లి. దానికి రమ్మని మమ్మల్ని రోజూ పోరేవాడు. ‘మా ఊరు చాలా అందంగా ఉంటుంది, బోలెడన్ని పక్షులు వలస వస్తాయి, అవన్నీ చూడాలంటే మా ఊరు రావాలి, అందుకు నా పెళ్లే తగిన సందర్భం, మీరంతా రావాల్సిందే’ అంటూ రోజూ పోరేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. నారాయణన్ మాత్రమే కాదు... గురు మీత్సింగ్ కూడా లేడు. పంజాబ్ నుంచి వచ్చి ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు గురుమీత్. తన ముసలి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని కలలు కనేవాడు. వచ్చే భార్య వాళ్లని ఆదరిస్తుందో లేదోనని పెళ్లి కూడా చేసుకోననేవాడు. అతను ఏడి? ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే బతికాడో ఆ తల్లిదండ్రుల్ని వదిలేసి ఎలా వెళ్లిపోగలిగాడు? మా స్వామి కూడా లేడు. నేను ఎయిర్‌ఫోర్స్‌కి వెళ్లినప్పుడు ఆయనే నా తొలి గురువు. ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో... అన్నీ నేర్పాడు. నువ్వు ఇంకా బాగా చదువుకుని ఎయిర్‌ఫోర్స్‌లోనే మంచి పొజిషన్‌కి చేరుకోవాలి అంటుండేవాడు. ఇకమీదట అలా చెప్పడానికి తను లేడు. కదన రక్కసి పాదాల కింద పడి నలిగిపోయాడు. అందరినీ వదిలి వెళ్లిపోయాడు. సరిగ్గా అంతకు కొన్ని రోజుల ముందే స్వామికి కూతురు పుట్టింది. తనని ఇంకా చూసుకోనే లేదు. ‘యుద్ధం అయిపోగానే నా పాపను చూడ్డానికి వెళ్తాను, తనని బాగా పెంచుతాను, డాక్టర్ని చేసి ఎయిర్ ఫోర్సులోనే చేర్పిస్తాను’ అంటూ తన కూతురి భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఆ కలల గురించి ప్రతిక్షణం కలవరించేవాడు. కానీ అతని కలలు నిజం కాలేదు. అతని కూతురి కోసమైనా మృత్యువు స్వామి మీద జాలి పడలేదు. బిల్లెట్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. అక్కడే తిరుగుతున్నారు. నవ్వుతున్నారు. నన్ను పలకరిస్తున్నారు. కబుర్లు చెబుతున్నారు. కన్నుమూసి తెరిచేలోగా మాయమవుతున్నారు. వారిని గూర్చిన తలపుల భారాన్ని మోయలేకపోయాను. వాళ్లు లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ రాత్రి క్షణమొక యుగంలా గడిచింది. అది మాత్రమే కాదు... క్షణమైనా కన్నంటుకోనీయకుండా నన్ను చిత్రవధ చేసిన ఆ రాత్రి... నాలో చాలా ప్రశ్నల్ని కూడా రేపింది. ఎవరి మధ్య జరిగింది యుద్ధం! దేశాల మధ్య జరిగిందా? లేదు. పాకిస్తాన్ అక్కడే ఉంది. ఇండియా ఇక్కడే ఉంది. అవి నేరుగా తలపడలేదు. నాయకుల మధ్య జరిగిందా? లేదు. వాళ్లు కూడా ఎక్కడివాళ్లక్కడ బాగానే ఉన్నారు. సుఖంగా ఉన్నారు. మరి ఎవరి మధ్య జరిగింది? అహంకారాల మధ్య జరిగింది. తమ అహాలను ప్రదర్శించడానికి జరిగింది. దానివల్ల ఏం జరిగింది? నాలాంటి కొందరి గుండెల్లో శూన్యం మిగిలింది. కొందరు తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలింది. కొందరు పిల్లలకు తండ్రి ప్రేమ దూరమయ్యింది. కొన్ని కుటుంబాల్లో చీకటి పరచుకుంది. పాకిస్తాన్‌తో సంధి కుదుర్చుకున్న మన ప్రభుత్వం వేలమంది సైనిక బలగాన్ని తీసుకెళ్లి సగర్వంగా పాకిస్తాన్ చేతుల్లో పెట్టింది. కానీ పోయిన సైనికుల ప్రాణాల్ని వెనక్కి తీసుకు రాలేకపోయింది. నా స్నేహితులను నాకు మళ్లీ చూపించలేకపోయింది. నాటి జ్ఞాపకాలను మర్చిపోలేక ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నా కంటి మీదికి కునుకును తీసుకు రాలేకపోయింది. - ఫన్డే టీమ్ -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
నేడు సాలూరి వాసూరావు బర్త్‌డే పల్లవి : ఆశా... ఆ... ఒకే ఒక ఆశ అదే నా శ్వాస... ఒకే ఒక ఆశ అదే నా శ్వాస కమ్మని కౌగిలి కోరితే దురాశ తీయని పెదవులు కలిపితే ఓ నిషా ఒకే ఒక ఆశ అదే నా శ్వాస చరణం : 1 చెదిరిన పైటకు బహుమతిగా చిలిపి ముద్దులు అందించనా నలగని పువ్వుల నవ్వులతో వలపు శుద్ధులు నేర్పించనా కులుకులు తగవే నా అలకల చిలక గడబిడి తగదోయ్ నా మగసిరి మొలక పరువమే ఇలా ఇలా పిలిచె మరి ఒకే ఒక ఆశ అదే నా శ్వాస కమ్మని కౌగిలి కోరితే దురాశ తీయని పెదవులు కలిపితే ఓ నిషా ఒకే ఒక ఆశ అదే నా శ్వాస చరణం : 2 మదనుడు మరచిన శరములేవో వెలికితీశా నీ కోసమే చల్లని వెన్నెల పల్లకిలో ఎదురుచూశా నీ కోసమే తరగని కలలే రా రమ్మని పిలువా తమకపు ఒడిలో చోటిమ్మని అడిగా సొగసరీ సరాసరీ పదవే మరీ ॥ఒక॥ చిత్రం : సూరిగాడు (1992) రచన : భువనచంద్ర సంగీతం : సాలూరి వాసూరావు గానం : ఎస్.పి.బాలు, చిత్ర