టీమిండియా విక్టరీ.. పూనకంతో ఊగిపోయిన టాలీవుడ్ హీరో! Manchu Vishnu And Prabhu Deva India's T20 World Cup 2024 Victory Video Viral | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: టీ20 వరల్డ్‌ కప్‌.. టాలీవుడ్‌ హీరో సెలబ్రేషన్స్‌ వేరే లెవెల్!

Published Sun, Jun 30 2024 7:55 AM | Last Updated on Sun, Jun 30 2024 11:35 AM

Tollywood Hero Team India World Cup Winning Celebrations Video Goes Viral

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్‌ ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ప్రపంచకప్‌ విన్నింగ్‌ మూమెంట్‌ను ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇప్పటికే పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.

అయితే సినీతారలు సైతం విన్నింగ్‌ మూమెంట్‌ తనదైన స్టెల్లో సెలబ్రేట్  చేసుకున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా పూనకంతో ఊగిపోయారు. చివరి ఓవర్లో హార్దిక్‌ బౌలింగ్ చేస్తుండగా.. వరల్డ్‌ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు ట్విటర్‌లో పంచుకున్నారు. మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్‌ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పలువురు అగ్రతారలు కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement