కె.బసవయ్య, జీఎం(వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్)
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి సంస్థ 130వ ఆవిర్భావ వేడుకల సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ శ్రీధర్ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి పలు విషయాలను జీఎం (వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్) కె.బసవయ్య శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతుండగా, సెంట్రల్ ఫంక్షన్ మాత్రం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్నాం. ఈ వేడుకకు సింగరేణి సీఎండీ శ్రీధర్ హాజరు కానున్నారు. సంస్థ పురోభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎండీని ఆహ్వానించేందుకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాం.
- ఉదయం 8:30 గంటలకు సింగరేణి కేంద్ర కార్యాలయం నుంచి 2 కె రన్ ప్రారంభం అవుతుంది. ప్రకాశం స్టేడియం వరకు ఈ రన్ కొనసాగుతుంది. కార్యక్రమంలో అందరు డైరక్టర్లు, అధికారులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొంటారు. 9:30 గంటలకు సీఎండీ స్టేడియానికి చేరుకుని సింగరేణి జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రకాశం స్టేడియంలో మొత్తం 13 విభాగాలకు సంబంధించిన 18 స్టాల్స్ ఏర్పాటు చేశాం.
- సాయంత్రం 7 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. సినీ, టీవీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సినీ గాయకుడు యాసిన్‌నిజార్, స్వాతి, శృతిల సంగీత విభావరి, క్రాంతినారాయణ్, సీతాప్రసాద్ బృందా లతో శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఉంటాయి. జబర్దస్త్ ఫేమ్ సుధాకర్ కామెడీ ఉంటాయి.
- 7గంటల నుంచి 7:30 వరకు బహుమతి ప్రదానం ఉంటుంది. ఆర్జీ–1 ఏరియా లోని జీడీకే–11 ఉత్తమ కంటి న్యూయస్ మైనర్‌గా ప్రథమ బహుమతి సాధించింది. ఆర్జీ–2 ఏరియాలోని ఓసీ–3 ప్రథమ, ఎస్డీఎల్స్ విభాగంలో మందమర్రి ఏరియాలోని కేకే–1 కు ప్రథమ, ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5కు ఎల్‌హెచ్‌డీ విభాగంలో ప్రథమ బహుమతులు వచ్చాయి. వీటిని సీఎండీ ప్రదానం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment