వాషింగ్టన్ : ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, కరోనా మహహ్మారి నుంచి రక్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జో బిడెన్ కృషిచేస్తారని మాజీ అమెరికా ప్రథమ మహిళ మిషెల్లి ఒబామా అభిప్రాయపడ్డారు. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో జో బిబెన్‌ను అద్యక్షుడిగా ఎన్నుకోవాల్సిందిగా కోరారు. డెమొక్రటిక్ కన్వెన్షన్ నైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిషెల్లి ఒబామా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారని, ఆయన పనితనం ఏంటో తనకు తెలుసునని అన్నారు. స్మార్ట్ ప్రణాళికలు రచించి తన జట్టులోని సభ్యులను ముందుకు నడిపిస్తారని, ఎంతో మార్గదర్శకంగా పనిచేస్తారని కొనియాడారు. ఆర్థక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, కరోనా మహమ్మారి నుంచి రక్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో బిబెన్‌కు బాగా తెలుసనని మిషెల్లి అభిప్రాయపడ్డారు. (ఆమె మొదటిది కానీ చివరిది కాదు)
ఇవి అత్యంత ప్రమాదకరమైన ఎన్నికలు : ట‌్రంప్
బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలా నిజాయితీగా, జవాబుదారితనంతో పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కోవిడ్ లాంటి అంటువ్యాధిని ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలమయ్యారని మిషెల్లి ఒబామా ఆరోపణలు గుప్పించారు. శాస్ర్తవేత్తలు, డాక్టర్లు ఈ మహమ్మారి గురించి ఎప్పటినుంచో అలర్ట్ చేసినా ట్రంప్ అవేవీ పట్టనట్లు ఉన్నారని, దాని మూలంగానే నేడు దేశంలో కరోనా విజృంభణ ఈ స్థాయిలో ఉందని మండిపడ్డారు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విస్కాన్సిన్, మిన్నెసోటాలో కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఫైర్ అయ్యారు. ఇక అమెరికాలో నవంబరులో జరగునున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. డెమాక్రాట్ అభ్యర్థులుగా జో బిడెన్, కమలా హ్యారిస్‌ను ప్రకటించిన నాటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక విధంగా నోరు పారేసుకుంటునారు. ఓష్కోష్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. వారిద్దరూ గెలిస్తే పిచ్చి సోషలిస్ట్ విధానాలను అమలు చేస్తారని ఆరోపించారు. అమెరికాలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యంత ప్రమాదకరమై ఎన్నిక అని ట్రంప్ అన్నారు. వాళ్లను గెలిపిస్తే అమెరికా మరో వెనిజులాగా మారుతుంది అని ఆరోపించారు. (డెమోక్రాటిక్ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment