Actress Priyamani Reaction On Trolls Over Her Bhamakalapam Web Series, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyamani: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..

Published Thu, Feb 3 2022 3:01 PM | Last Updated on Thu, Feb 3 2022 4:52 PM

Priyamani Intresing Comments In Her Bhamakalapam Series Event - Sakshi

సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. యమదొంగ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తొలి చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్ద గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో ఆడపదడపా చిత్రాలు చేసుకుంటునే వ్యాపారవేత్త ముస్తాఫా రాజును పెళ్లాడింది. పెళ్లి అనంతరం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్‌ 2తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్‌ సిరీస్‌లో తన నటనకు జాతీయ అవార్డును కూడ అందుకుంది. అప్పటీ నుంచి వరస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ పరంగా ప్రియమణి ఫుల్‌ బిజీ అయిపోయింది.

చదవండి: వరుణ్‌ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..

ఆమె తాజాగా ‘భామాకలాపం’ అనే వెబ్‌ సిరీస్ చేస్తోంది. త్వరలో ఇది ఆహాలో విడుదల కానుంది. ఇలా సైలెంట్‌గా తన పని తను చూసుకుంటూ,  సినిమాలు చేసుకుంటున్న ప్రియమణిని తరచూ ట్రోలర్స్‌ టార్గెట్‌ చేస్తుంటారు. ఆంటీ అంటూ విమరించడమే కాక ఒకనోక సమంలో తనని బాడీ షేమింగ్‌ కూడా చేశారు. వీటికి ఆమె గతంలో ఘాటూగానే సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్‌ తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం’ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్‌పై స్పందించింది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి అయిన తర్వాత కెరీయర్ పరంగా ఇప్పుడు బిజీ అయ్యాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. వెబ్ సిరీస్, సినిమాలు వరుసగా చేస్తున్నాను.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

చదవండి: మోడల్‌ ఆత్మహత్యాయత్నం కేసులో బయటకొచ్చిన షాకింగ్‌ నిజాలు..

2006 నుంచి 2012 వరకు చాలా బిజీగా ఉన్నాను. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్‌ కూడా చాలా ముఖ్యం. అందుకని పని తగ్గించుకుని ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. అప్పుడు టీవీ షోస్ చేస్తూ వెళ్లాను. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లనే టీవీ షోలు చేస్తుందని కొంతమంది కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ చూడను .. కామెంట్లు చదవను .. వాటి గురించి అసలు పట్టించుకోను. ఎందుకంటే ప్రతి కామెంట్‌కు రియాక్ట్ కాలేము కదా? అంటూ చెప్పకొచ్చింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ సపోర్ట్‌ ఉందని, ఏదైన ఉంటే నా ఫ్యామిలీ, భర్తకు సమాధానం చెప్పుకుంటాని, వేరే వాళ్లకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ట్రోలర్స్‌ ఘాటుగా సమాధానం​ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement