తెనాలి (గుంటూరు) : బీసీ వర్గాల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వాతంత్య్రయోధుడు, బీసీ ఉద్యమ ప్రముఖుడు దాలిపర్తి శేషయ్య విగ్రహాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం చినరావూరులో బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు.
అనంతరం దాలిపర్తి ధన్వంతరి అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నాయీబ్రాహ్మణ సంక్షేమం, బీసీ ఉద్యమానికి శేషయ్య చేసిన కృషి నిరుపమానం అని చెప్పారు. అనంతరం మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు తదితరులు మాట్లాడారు.
'బీసీ సంక్షేమం ప్రభుత్వ కర్తవ్యం'
Published Tue, Jan 12 2016 6:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement